Ranveer Singh-Koena Mitra: రణ్‌వీర్‌ నుంచి ఇలాంటివి ఆశించడంలో తప్పులేదు: నటి షాకింగ్‌ కామెంట్స్‌

Actress Koena Mitra Supports Ranveer Singh Over His Undressed Photoshoot - Sakshi

బాలీవుడ్ స్టార్ రణవీర్ సింగ్ నగ్న ఫొటోషూట్ చేస్తున్న రచ్చ అంతాఇంతా కాదు. దీనిని కొందరు రణ్‌వీర్‌ను ప్రశంసిస్తోంటే మరికొందరు తప్పు బడుతూ విమర్శలు గుప్పిస్తున్నారు. ఒంటిపై నూలు పోగు లేకుండా ఫొటోలకు ఫోజులు ఇచ్చిన మహిళల మనోభవాలను దెబ్బతీశాడని ఆరోపిస్తూ స్వచ్ఛంద సంస్థలు, మహిళా సంఘాలు రణ్‌వీర్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో ముంబైలో అతడిపై ఎఫ్‌ఐఆర్‌ నమోదైన సంగతి తెలిసిందే.

చదవండి: షూటింగ్‌ సంక్షోభం.. దిగొచ్చిన అగ్ర హీరోలు.. చిరు లేఖ

దీనిని ఖండిస్తూ ‘ది కశ్మీర్‌ ఫైల్స్‌’ డైరెక్టర్‌ వివేక్‌ అగ్నిహోత్రి రణ్‌వీర్‌కు మద్దతుగా నిచ్చాడు. తాజాగా నటి, మోడల్ కోయినా మిత్రా సైతం రణ్‌వీర్‌ని సమర్థించింది. రణవీర్ సాహసం చేశాడంటూ అతడిపై ప్రశంసలు జల్లు కురిపించింది. తాజాగా ఆమె మీడియాతో ముచ్చటించింది. ఈ సందర్భందగా రణ్‌వీర్‌ నగ్నఫొటోషూట్‌పై స్పందిస్తూ అందులో తప్పేముందంటూ వెనకెసుకొచ్చింది. ‘రణ్‌వీర్‌ గురించి అందరికి తెలిసిందే. ప్రయోగాలు చేసే నటుల్లో ఆయన ముందుంటాడు. తొటి నటీనటుల పట్ల, ప్రజల పట్ల, ఫ్యాన్స్‌తో చాలా సరదాగా ఉంటాడు. ఆయన చిల్డ్‌ అవుట్‌ గాయ్‌.

చదవండి: ఫ్యాన్స్‌కి షాక్‌.. ఏడాదికే బ్రేకప్‌ చెప్పుకున్న ‘బిగ్‌బాస్‌’ జోడీ

అలాంటి వ్యక్తి నుంచి ఇలాంటివి ఆశించడంలో తప్పులేదు. ఆయనకు కాస్తా వెర్రి ఎక్కువ. దానితోనే అందరిని ఆకర్షిస్తాడు. స్క్రీన్‌పై అయినా స్టేజ్‌పై ఆయినా తన ఎనర్జీ అంటే నాకు ఇష్టం. రణ్‌వీర్‌ మిగతా నటుల కంటే కొంచం భిన్నం. అలాంటి తను ప్రజలను ఆకర్షించడానికి ఇలా చేశాడంటే నేను ఒప్పకొను. ఆయనకు ఆ అవసరం కూడా లేదు. తనో స్టార్‌. ఇది కేవలం సరదా కోసం, కాస్తా క్రేజీగా ఉండేందు ఇలా చేశాడని నేను ఖచ్చితంగా చెప్పగలను. అదే ఫన్‌తో ఈ ఫొటోలు షేర్‌ చేసి ఉంటాడు. కానీ భారతీయులు ఎప్పుడు ఇతరులను జడ్జ్‌ చేయడంలో ముందుంటారు కదా’ అంటూ చెప్పుకొచ్చింది. 

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top