నీటిలో ప్రేమ!

Prabhas To Have A Breathtaking Underwater Action Sequence - Sakshi

ప్రభాస్, పూజా హెగ్డే జంటగా తెరకెక్కుతున్న పీరియాడికల్‌ లవ్‌స్టోరీ ‘రాధేశ్యామ్‌’. రాధాకృష్ణ దర్శకత్వంలో ఈ చిత్రాన్ని యూవీ క్రియేషన్స్, గోపీకృష్ణా మూవీస్‌ బ్యానర్లు నిర్మిస్తున్నాయి. ఈ చిత్రకథాంశం ఇటలీ బ్యాక్‌డ్రాప్‌లో ఉంటుంది. ఈ సినిమాకి సంబంధించి తాజాగా ఓ ఆసక్తికరమైన వార్త బయటకు వచ్చింది. అండర్‌ వాటర్‌ సీక్వెన్స్‌ను చిత్రీకరించారన్నదే ఆ వార్త. ఈ నీటిలోపల సన్నివేశాల్లో ప్రభాస్, పూజా హెగ్డే ఇద్దరూ కనిపిస్తారట. ఇవి ప్రేమ సన్నివేశాలని సమాచారం. కీలక సందర్భంలో వస్తాయని, సినిమాకు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయని తెలిసింది. ఈ సన్నివేశాలను ప్రత్యేక సెట్లో, ప్రత్యేక కెమెరాలతో చిత్రీకరించారట కెమెరామేన్‌ మనోజ్‌ పరమహంస. ప్రస్తుతం హైదరాబాద్‌లో చిత్రీకరణ జరుగుతోంది. ఈ ఏడాది చివర్లో ఈ సినిమా చిత్రీకరణ పూర్తవుతుంది. విడుదల తేదీ ఇంకా ఖరారు కాలేదు.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top