షూటింగ్‌లో ప్రభాస్.. రూ.150 కోట్లకు ఓటీటీ డీల్! | Prabhas-Hanu Raghavapudi Movie OTT Deal Details | Sakshi
Sakshi News home page

Prabhas: రీసెంట్‌గా షూటింగ్ షురూ.. ఓటీటీ డీల్ క్లోజ్!

Oct 25 2024 1:23 PM | Updated on Oct 25 2024 1:33 PM

Prabhas-Hanu Raghavapudi Movie OTT Deal Details

డార్లింగ్ ప్రభాస్ చకచకా ఒక్కో సినిమా పూర్తి చేస్తున్నాడు. ప్రస్తుతం 'రాజాసాబ్' చివరి దశ షూటింగ్‌లో ఉంది. డిసెంబరు కల్లా పూర్తి చేస్తారని తెలుస్తోంది. మరోవైపు హను రాఘవపూడితో చేస్తున్న మూవీ సెట్‌లోకి ప్రభాస్.. శుక్రవారం అడుగుపెట్టేశాడట. కానీ అంతకు ముందే ఓటీటీ డీల్ పూర్తయినట్లు అదిరిపోయే న్యూస్ ఒకటి బయటకొచ్చింది.

(ఇదీ చదవండి: బిగ్‌బాస్ 8 ఎలిమినేషన్ ఓటింగ్.. డేంజర్ జోన్‌లో ఇద్దరు!)

ప్రభాస్.. పాన్ ఇండియా హీరో అవడం మాటేమో గానీ రిజల్ట్‌తో సంబంధం లేకుండా తన గ్రాఫ్ పెంచుకుంటూ పోతున్నాడు. 'సలార్', 'కల్కి 2898' చిత్రాలతో ఇండియన్ బాక్సాఫీస్ కింగ్ అనిపించుకున్నాడు. ప్రస్తుతం 'రాజాసాబ్'తో పాటు ఫౌజీ (రూమర్ టైటిల్) చేస్తున్నాడు. మైత్రీ నిర్మాణంలో హను రాఘవపూడి తీస్తున్న ఈ సినిమాని రూ.150 కోట్లు ఇచ్చి ప్రముఖ ఓటీటీ సంస్థ డిజిటల్ హక్కుల్ని దక్కించుకుందట.

రిలీజ్ వరకు అంటే రేటు కాస్త పెరగొచ్చు. అందుకే ముందు జాగ్రత్తగా రూ.150 కోట్లు ఇచ్చేసి ప్రభాస్ మూవీని ఓటీటీ సంస్థ కొనేసినట్లు తెలుస్తోంది. ఈ ప్రాజెక్ట్‌లో ఇమాన్వి హీరోయిన్ అని ఇదివరకే ప్రకటించారు. బహుశా 2026లో ఇది థియేటర్లలో రిలీజ్ కావొచ్చు.

(ఇదీ చదవండి: ఈ శుక్రవారం ఓటీటీల్లోకి వచ్చేసిన 23 సినిమాలు)

Advertisement
 
Advertisement
Advertisement