'కల్కి' రిలీజ్‌కి రెడీ.. ఇంతలోనే ప్రభాస్ ఫారెన్ టూర్‌.. కారణమదేనా? | Prabhas Europe Trip Before Kalki 2898 AD Release | Sakshi
Sakshi News home page

Prabhas: సినిమా రిలీజ్‌కి ముందు విదేశాలకు.. ఎక్కడికో తెలుసా?

Jun 22 2024 1:55 PM | Updated on Jun 22 2024 4:21 PM

Prabhas Europe Trip Before Kalki 2898 AD Release

డార్లింగ్ ప్రభాస్ లేటెస్ట్ మూవీ 'కల్కి'. జూన్ 27న థియేటర్లలోకి రానుంది. ఇప్పటికే వచ్చిన రెండు ట్రైలర్స్.. స్టోరీ ఏంటనేది ఆల్మోస్ట్ రివీల్ చేశాయి. ముంబయిలో ఈవెంట్ చేశారు గానీ తెలుగు రాష్ట్రాల్లో ఇలాంటివేం లేవు. దీనిబట్టి చూస్తే ఇక ఈవెంట్స్ ఏం లేనట్లే. రిలీజ్‌కి మరో ఐదారు రోజులు ఉన్న నేపథ్యంలో ప్రభాస్ ఫారెన్ టూర్ వెళ్లబోతున్నాడట.

(ఇదీ చదవండి: ప్రభాస్ 'కల్కి'.. ఎవరెవరికీ ఎంత రెమ్యునరేషన్ ఇచ్చారు?)

'ప్రభాస్.. తన ప్రతి సినిమా విడుదలకు ముందు విదేశాలకు వెళ్తుంటాడు. గతంలో 'సలార్' రిలీజ్‌కి ముందు ఇటలీ వెళ్లినట్లు గుర్తు. ఇప్పుడు 'కల్కి' థియేటర్లలో రావడానికి ముందు మాత్రం యూరప్ వెళ్లబోతున్నాడట. ఇండస్ట్రీలో దీని గురించి టాక్ వచ్చింది గానీ ఇది నిజమో కాదో తెలియాల్సి ఉంది.

'బాహుబలి' తర్వాత గతేడాది రిలీజైన 'సాహో'తో మాత్రం ప్రభాస్ హిట్ కొట్టాడు. మధ్యలో 'సాహో', 'రాధేశ్యామ్', 'ఆదిపురుష్' మూవీస్.. ప్రేక్షకుల మనసు గెలుచుకోవడంలో ఫెయిలయ్యాయి. దీంతో అందరికీ 'కల్కి'పై అంచనాలు ఉన్నాయి. ప్రమోషనల్  కంటెంట్ చూస్తుంటే హిట్ కొట్టేలా ఉంది. మరి ప్రభాస్ ఈసారి ఏం చేస్తాడో తెలియాలంటే శుక్రవారం వరకు ఎదురుచూడాల్సిందే?

(ఇదీ చదవండి: ప్రభాస్ 'కల్కి'.. ఈ లాజిక్ ఎలా మిస్సవుతున్నారు?)

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement