వాళ్ల కోసం రూ.35 లక్షలు విరాళమిచ్చిన ప్రభాస్.. ఎందుకంటే? | Prabhas Donates 35 Lakhs To Telugu Film Directors Association, Video Goes Viral - Sakshi
Sakshi News home page

Prabhas Donation To TFDA: ప్రభాస్ మంచి మనసు.. వాళ్ల కోసం భారీ సాయం

Apr 23 2024 10:07 AM | Updated on Apr 23 2024 10:48 AM

Prabhas Donates 35 Lakhs To Telugu Film Directors Association - Sakshi

ప్రభాస్ పేరు చెప్పగానే పాన్ ఇండియా సినిమాలే కాదు మంచి మనిషి అనేది గుర్తొస్తుంది. ఎందుకంటే కాంట్రవర్సీలకు దూరంగా, సాయానికి దగ్గరగా ఉంటాడు. ఫుడ్ విషయంలో అయితే ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. సరే ఇదంతా పక్కనబెడితే తాజాగా మరోసారి మంచి మనసు చాటుకున్నాడు. తెలుగు దర్శకుల కోసం రూ.35 లక్షలు విరాళమిచ్చి వార్తల్లో నిలిచాడు.

(ఇదీ చదవండి: పెళ్లి న్యూస్‌తో షాకిచ్చిన యంగ్ హీరోయిన్.. హల్దీ వీడియో వైరల్)

ప్రభాస్ ప్రస్తుతం 'కల్కి' మూవీతో బిజీగా ఉన్నాడు. చివరి దశ పనుల్లో ఉంది. రిలీజ్ తేదీపై క్లారిటీ రావాల్సి ఉంది. ఇకపోతే దాసరి నారాయణరావు పుట్టినరోజు సందర్భంగా మే 4న ప్రతి ఏడాది డైరెక్టర్స్ డేగా జరుపుతున్నారు. ఈసారి కూడా హైదరాబాద్ ఎల్బీ స్టేడియం వేదికగా వేడుకని నిర్వహించనున్నారు. ఇప్పటికే చిరంజీవి తదితర అగ్రహీరోలకు ఆహ్వానం కూడా అందించారు.

ఈ క్రమంలోనే ప్రభాస్‌ని కూడా తెలుగు ఫిల్మ్ డైరెక్టర్ అసోసియేషన్ సభ్యులు వెళ్లి ఆహ్వనిచంగా.. వస్తానని మాట ఇవ్వడంతో పాటు సెలబ్రేషన్స్ బాగా జరిపించాలని రూ.35 లక్షల విరాళం కూడా ఇచ్చారు. ఈ విషయాన్ని అసోసియేషన్ ప్రెసిడెంట్ వెల్లడించారు. దీంతో ప్రభాస్ మనసు ఎంత మంచిదనేది ప్రూవ్ అయింది.

(ఇదీ చదవండి: విడాకులు నిజమే.. ఎప్పుడో విడిపోయాం: బుల్లితెర నటుడు)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement