‘రణబాలి’ తొలి రోజు కలెక్షన్స్‌ ఎంతంటే..? | Vijay Deverakonda Ranabaali Movie Day 1 Box Office Collections Details, Check Out Latest Numbers Inside | Sakshi
Sakshi News home page

Ranabaali Day 1 Collection: ‘రణబాలి’ ఫస్ట్‌డే కలెక్షన్స్‌ ఎంతంటే..?

Oct 17 2026 3:56 PM | Updated on Oct 17 2026 4:26 PM

Ranabaali Movie Box Office Collection Day 1 Details

విజయ్‌ దేవరకొండ, రష్మిక జంటగా నటించిన తాజా చిత్రం రణబాలి. రాహుల్‌  సంకృత్యాన్‌  దర్శకత్వం వహించిన ఈ చిత్రం నిన్న(అక్టోబర్‌  16)న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. తొలి రోజు ఈ మూవీకి మిక్స్‌డ్‌ టాక్‌ వచ్చింది. విజయ్‌, రష్మిక యాక్టింగ్‌, స్టోరీ బాగున్నప్పటికీ.. నిడివి, స్లోనెరేషన్‌ కొంత ఇబ్బందికరంగా మారాయని పలు వెబ్‌సైట్లు తమ రివ్యూల్లో పేర్కొన్నాయి. ఫలితంగా తొలి రోజు ఈ  చిత్రం అనుకున్న రేంజ్‌లో కలెక్షన్స్‌  రాబట్టలేకపోయిందని ట్రేడ్ వర్గాలు విశ్లేషిస్తున్నాయి.

(చదవండి: ‘రణబాలి’ మూవీ రివ్యూ అండ్‌ రేటింగ్‌)

సాక్నిల్క్ వెబ్‌సైట్ అందించిన సమాచారం ప్రకారం...తొలి రోజు ఈ చిత్రం రూ. 16.15 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టింది. భారత్‌లో తొలిరోజున 9.25 కోట్ల రూపాయల నెట్.. 10.75 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్ట్ చేసింది. ఓవర్సీస్‌లో రూ. 5.75 కోట్ల గ్రాస్ కలెక్షన్లు దక్కాయి. తెలుగు రాష్ట్రాలలో రూ. 9.25 కోట్లు, తమిళనాడులో రూ.15 లక్షలు, కర్ణాటకలో రూ. 1.10 కోట్లు వసూలు  చేసింది.

దేశవ్యాప్తంగా దాదాపు 2,515 స్క్రీన్లలో ప్రదర్శితమైన ఈ సినిమాకు తొలిరోజు సగటున 57 శాతం వరకు ఆక్యుపెన్సీ నమోదైంది. మొదటి రోజు మొత్తం 7.11 లక్షల మందికి పైగా ప్రేక్షకులు థియేటర్లకు తరలివచ్చారు. ఉదయం షోలు కాస్త నెమ్మదిగా (40.92%) మొదలైనప్పటికీ, నైట్ షోల సమయానికి ఆక్యుపెన్సీ 67.92 శాతానికి పుంజుకోవడం గమనార్హం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement