దేవాకి నివాళులర్పించిన ముఖ్యమంత్రి, సూపర్‌స్టార్ | Tamil Nadu Cm Vijay And Rajinikanth Condolences Music Director Deva | Sakshi
Sakshi News home page

Cm Vijay-Deva: సంగీత దర్శకుడి కుటుంబానికి సీఎం పరామర్శ

Oct 17 2026 4:46 PM | Updated on Oct 17 2026 4:50 PM

Tamil Nadu Cm Vijay And Rajinikanth Condolences Music Director Deva

ప్రముఖ తమిళ సంగీత దర్శకుడు దేవా(75) అనారోగ్య సమస్యలతో కన్నుమూశారు. శనివారం ఉదయం తన ఇంట్లో ఒక్కసారిగా కుప్పకూలిపోవడంతో చెన్నైలోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రికి తరలించారు. కానీ అప్పటికే ఆయన మరణించినట్లు వైద్యులు ధ్రువీకరించారు. ఈ క్రమంలోనే చిత్రసీమ సంతాపం వ్యక్తం చేస్తోంది.

(ఇదీ చదవండి: ఓటీటీకి 'అక్క'.. లేడీ గ్యాంగ్‌స్టర్‌లా కీర్తి.. టీజర్ రిలీజ్)

ముఖ్యమంత్రి విజయ్.. దేవా ఇంటికి వచ్చి నివాళులు అర్పించారు. సూపర్‌స్టార్ రజనీకాంత్ తొలుత ఓ వీడియో రిలీజ్ చేసి సంతాపం తెలియజేశారు. అనంతరం ఇంటికొచ్చి దేవా కుటుంబాన్ని పరామర్శించారు. కమల్ హాసన్ తదితరులు కూడా భౌతిక కాయాన్ని సందర్శించుకుని నివాళులర్పించారు.

తమిళనాడుకు చెందిన దేవా పూర్తి పేరు దేవనేశన్ చొక్కలింగం. 1950 నవంబర్ 20న పుట్టిన ఈయన.. సంగీత దర్శకుడిగా, గాయకుడిగా దక్షిణాది చిత్ర పరిశ్రమల్లో సేవలందించారు. ప్రధానంగా తమిళ సినిమాలకు సంగీతం అందించిన ఆయన.. తెలుగు, కన్నడ, మలయాళ చిత్రాలకు కూడా పనిచేశారు. 

(ఇదీ చదవండి: ‘రణబాలి’ తొలి రోజు కలెక్షన్స్‌ ఎంతంటే..?)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement