విజయ్‌ ‘బీస్ట్‌’ మూవీకి గుడ్‌బై చెప్పిన పూజా హెగ్డే | Pooja Hegde Wrap Up Her Beast Movie Shooting | Sakshi
Sakshi News home page

Pooja Hegde: విజయ్‌ ‘బీస్ట్‌’ మూవీకి గుడ్‌బై చెప్పిన పూజా హెగ్డే

Dec 12 2021 8:59 AM | Updated on Dec 12 2021 9:08 AM

Pooja Hegde Wrap Up Her Beast Movie Shooting - Sakshi

విజయ్, పూజా హెగ్డే జంటగా నెల్సన్‌ కుమార్‌ దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా ‘బీస్ట్‌’. ఇందులో దర్శకుడు సెల్వరాఘవన్‌ ఓ కీలక పాత్ర చేస్తున్నారు. తాజాగా ‘బీస్ట్‌’ చిత్రంలో విజయ్, పూజా తమ వంతు షూటింగ్‌ పార్ట్స్‌ను పూర్తి చేశారు.

‘‘బీస్ట్‌’ సినిమా షూటింగ్‌ నాకు మంచి ఆనందాన్ని ఇచ్చింది. హాయిగా నవ్వుకుంటూ, హ్యాపీగా షూటింగ్‌ పూర్తి చేశాం.. నాకైతే షూటింగ్‌ చేసినన్ని రోజులూ ఏదో వెకేషన్‌లో ఉన్నట్లే అనిపించింది. హీరో విజయ్‌ స్టైలిష్‌ యాక్షన్, దర్శకుడు నెల్సన్‌ స్టైల్‌ ఆఫ్‌ మేకింగ్‌ ‘బీస్ట్‌’ చిత్రాన్ని నెక్ట్స్‌ లెవల్‌కు తీసుకుని వెళతాయి’’ అని పూజా హెగ్డే పేర్కొన్నారు. ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది విడుదల చేయాలనుకుంటున్నారు. 

Advertisement
 
Advertisement
Advertisement