కన్నడ రాక్‌స్టార్‌ యశ్‌ జంటగా పూజా హెగ్డే? | Is Pooja Hegde Team Up With Yash, Director Narthan For A Movie | Sakshi
Sakshi News home page

Pooja Hegde: కన్నడ రాక్‌స్టార్‌ యశ్‌ జంటగా పూజా హెగ్డే?

Jun 18 2022 8:53 AM | Updated on Jun 18 2022 8:53 AM

Is Pooja Hegde Team Up With Yash, Director Narthan For A Movie - Sakshi

దక్షిణాది స్టార్‌ హీరోయిన్లలో కన్నడ బ్యూటీ పూజా హెగ్డే ఒకరు. తెలుగు, తమిళంలో మంచి స్టార్‌డమ్‌ను సంపాదించుకున్న పూజ ఇప్పటి వరకు తన మాతృభాష కన్నడంలో తెరంగేట్రం చేయలేదు. ఈ నేపథ్యంలో తాజాగా పూజా కన్నడ అరంగేట్రానికి సిద్ధమవుతున్నట్లు తెలిసింది. వివరాల్లోకి వెళితే.. ‘కేజీఎఫ్‌’ మూవీ తర్వాత హీరో యశ్‌ తదుపరి చిత్రానికి సన్నాహాలు జరుగుతున్నాయి. కన్నడ ‘మఫ్తీ’ ఫేమ్‌ నార్తన్‌-యశ్‌ కాంబినేషన్‌లో ఓ సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే.

చదవండి: ఆ వార్తల్లో నిజం లేదు: ‘ప్రాజెక్ట్‌ కె’ టీం క్లారిటీ

ఇటీవల ఈ సినిమా స్క్రిప్ట్‌ పూర్తి చేసిన నార్తన్‌ కథానాయిక, ఇతర నటీనటుల ఎంపికపై దృష్టి సారించారట. ఇందులో భాగంగానే హీరోయిన్‌ పాత్ర కోసం పూజా హెగ్డేను సంప్రదించిందట చిత్రబృందం. తెలుగు, తమిళ, హిందీ భాషల్లో సినిమాలు చేస్తున్న పూజ ఇప్పటివరకు కన్నడంలో మాత్రం చేయలేదు. మరి.. యశ్‌ సినిమాతో ఆమె శాండల్‌వుడ్‌కి పరిచయం అవుతుందా? లేదా? అనేది చూడాలి. ఇక ప్రస్తుతం సల్మాన్‌ ఖాన్‌ ‘కబీ ఈద్‌ కబీ దీవాలి’, రణ్‌వీర్‌ సింగ్‌ ‘సర్కస్‌’, విజయ్‌ దేవరకొండ ‘జేఎస్‌ఎమ్‌’ చిత్రాలతో బిజీగా ఉంది పూజా హెగ్డే. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement