Pooja Hegde Buys Luxurious House In Mumbai - Sakshi
Sakshi News home page

Pooja Hegde: చిన్ననాటి కల నెరవేరింది

Dec 28 2022 6:56 AM | Updated on Dec 28 2022 9:17 AM

Pooja Hegde buys Luxurious flat in Mumbai - Sakshi

నటి పూజా హెగ్డే గురించి ఇప్పుడు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే సామాజిక మాధ్యమాల్లో ఎక్కడ చూసినా ఈమె అందాల ఆరబోత దృశ్యాలే. ఈమె చెప్పే కబుర్లే. తన గ్లామరస్‌ నటనతో జాతీయస్థాయిలో కుర్రకారును ఉర్రూతలూగిస్తున్న ఈ ముద్దుగుమ్మ తమిళంలో ఇంకా విజయాల ఖాతాను ప్రారంభించకపోయినా తెలుగులో అగ్ర నటిగా వెలిగి పోతోంది.

బాలీవుడ్‌లోనూ నిలదొక్కుకుంది. ఇందుకు కారణం లేకపోలేదు. దీపం ఉండగానే ఇల్లు చక్కదిద్దుకోవాలనే సామెతను ఈమె అక్షరాలా అమలుపరుచుకుంటోంది. అందులో భాగంగానే ముందుగా ఓ ఇంటిదైపోయింది. ఇటీవల ముంబైలో ఖరీదైన భవనాన్ని కొనుగోలు చేసింది. దీని గురించి పూజా హెగ్డే మాట్లాడుతూ.. చిన్ననాటి నుంచి తనకు సొంత ఇల్లు కొనుక్కోవాలనే కోరిక ఉండేదని తెలిపింది. ఆ కల ఇప్పటికి నెరవేరిందని పేర్కొంది.

ముంబైలో కొత్త ఇల్లు కొనుక్కొని దాన్ని తనకు కావాల్సిన విధంగా రూపొందించుకున్నానని చెప్పింది. వృత్తిపరంగా మనం ఎలాంటి మానసిక ఉద్రేకాలు గురైన ఇంటికి వస్తే అలాంటివన్నీ మటుమాయం అవుతాయంది. తన ఇంటిని ఆ విధంగా మార్చి అమర్చుకున్నారని చెప్పింది. మనల్ని మనలా ఉండేలా చేసేది సొంత ఇల్లు అని పేర్కొంది.

ఇంట్లో ప్రతి వస్తువు మన ప్రత్యేకత కనిపించేలా అమర్చుకోవాలనే అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది. తాను ఇంటిని తనకు నచ్చిన విధంగా డిజైన్‌ చేసుకున్నట్లు చెప్పింది. తాను నటిని కాబట్టి తన బెడ్‌ రూములో ఒక ప్రొజెక్టర్‌ ఏర్పాటు చేసుకున్నట్లు, అదే విధంగా వంటగది, హాల్‌ వంటివి తనకు నచ్చిన విధంగా మార్చుకున్నట్లు పూజా హెగ్డే పేర్కొంది.  

చదవండి: (అప్పుడు రిటైర్‌ అయిపోవాలి: చిరంజీవి) 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement