‘ప్లాంట్‌ మ్యాన్‌’ను ఆదరిస్తున్న ప్రేక్షకులకు ధన్యవాదాలు: నిర్మాత | Sakshi
Sakshi News home page

‘ప్లాంట్‌ మ్యాన్‌’ను ఆదరిస్తున్న ప్రేక్షకులకు ధన్యవాదాలు: నిర్మాత

Published Sun, Jan 7 2024 5:15 PM

 Plant Man Movie Success Meet Highlights - Sakshi

చంద్రశేఖర్‌, సోనాలి జంటగా కె.సంతోష్‌బాబు దర్శకత్వంలో రూపొందిన సైంటిఫిక్‌ కామెడీ ఎంటర్‌టైనర్‌ ‘ఫ్లాంట్‌మ్యాన్‌’. జనవరి 5న విడుదలైన ఈ చిత్రానికి ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభించింది. ఈ నేపథ్యంలో తమ చిత్రానికి మంచి విజయాన్ని అందించిన ప్రేక్షకులకు కృతజ్ఞతలు తెలిపేందుకు విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేసింది చిత్ర యూనిట్‌.

ఈ సందర్భంగా నిర్మాత పన్నా రాయల్‌ మాట్లాడుతూ .. డైరెక్టర్‌గా నేను అందరికీ పరిచయమే. నిర్మాతగా నేను చేసిన మొదటి సినిమా ఇది. ఒక చిన్న సినిమాగా ‘ప్లాంట్‌ మ్యాన్‌’ను స్టార్ట్‌ చేశాము. కానీ, రిజల్ట్‌ మాత్రం అల్టిమేట్‌గా ఉంది. ఇలాంటి రెస్పాన్స్‌ వస్తే సంవత్సరానికి రెండు చిన్న సినిమాలు చేసి కొత్త వారిని ఇంట్రడ్యూస్‌ చెయ్యాలని ఉంది. ‘ప్లాంట్‌ మాన్‌’ చిత్రం ఇంత పెద్ద విజయాన్ని సాధించడానికి సినిమాలో నటించిన నటీనటులు, టెక్నీషియన్స్‌ ముఖ్య కారణం. సినిమాని ఇంత బాగా ఆదరిస్తున్న ప్రేక్షకులకు నా ధన్యవాదాలు’’ అన్నారు.

దర్శకుడు కె.సంతోష్‌బాబు మాట్లాడుతూ ‘‘మా ఈ చిన్న సినిమాకి ఇంత పెద్ద విజయాన్ని అందించిన ప్రేక్షకులకు థాంక్స్‌. ఈ సినిమా చేయడానికి నిర్మాత పన్నా రాయల్‌గారే కారణం. నేను చెప్పిన లైన్‌ నచ్చి ఈ సినిమా స్టార్ట్‌ చేశారు. ఈ సినిమా ఇంత పెద్ద సక్సెస్‌ అవ్వడానికి పన్నాగారు, డిఓపి కర్ణన్‌గారు, సాయినాథ్‌గారు కారణం. నటీనటులు, టెక్నీషియన్స్‌ అందించిన సపోర్ట్‌తో ఇంత మంచి సినిమా చేయగలిగాను’’ అన్నారు.

హీరో చంద్రశేఖర్‌ మాట్లాడుతూ ‘‘నెల క్రితం ఈ హాల్‌ బయట ఉండి చూసిన నన్ను ఇప్పుడు స్టేజ్‌ మీద కూర్చోబెట్టారు. పన్నాగారు కొత్తవారిని ఎంకరేజ్‌ చేయడంలో ఎప్పుడూ ముందుంటారు. ఈ సంక్రాంతి ఫెస్టివల్‌కి కుటుంబ సమేతంగా చూసి ఎంజాయ్‌ చేయదగ్గ సినిమా ఇది’’ అన్నారు. 

హీరోయిన్‌ సోనాలి మాట్లాడుతూ ‘‘ఈ సినిమాలో అవకాశం డిఓపి కర్ణన్‌గారి ద్వారా వచ్చింది. దానికి నిర్మాత పన్నాగారు ఎంతో సపోర్ట్‌ చేశారు. స్టార్టింగ్‌లో కొంత నెర్వస్‌గా ఉంది. అందరూ నన్ను ఎంతో ఎంకరేజ్‌ చేశారు. ఒక మంచి సినిమాలో నేను కూడా భాగమైనందుకు సంతోషంగా ఉంది. సినిమా థియేటర్లలో రన్‌ అవుతోంది. తప్పకుండా అందరూ చూడండి’’ అన్నారు.

 
Advertisement
 
Advertisement