breaking news
Plant Man Movie
-
ప్లాంట్–మ్యాన్ని ఆదరిస్తున్నందుకు థ్యాంక్స్
‘‘డైరెక్టర్‌గా ‘కాలింగ్ బెల్, రాక్షసి’ వంటి సినిమాలు తీశాను. నిర్మాతగా నేను చేసిన మొదటి సినిమా ‘ప్లాంట్–మ్యాన్’. మా చిత్రాన్ని ఇంత బాగా ఆదరిస్తున్న ప్రేక్షకులకు ధన్యవాదాలు. ఇలాంటి స్పందన వస్తే ఏడాదికి రెండు చిన్న సినిమాలు చేసి కొత్త వారిని పరిచయం చేయాలని ఉంది’’ అని నిర్మాత పన్నారాయల్ అన్నారు. చంద్రశేఖర్, సోనాలి జంటగా కె.సంతోష్‌బాబు దర్శకత్వం వహించిన చిత్రం ‘ప్లాంట్–మ్యాన్’. డీఎం యూనివర్సల్ స్టూడియోస్‌పై పన్నారాయల్ నిర్మించిన చిత్రం ‘ప్లాంట్–మ్యాన్’. ఇటీవల విడుదలైన ఈ సినిమా థ్యాంక్స్ మీట్లో కె.సంతోష్‌బాబు మాట్లాడుతూ–‘‘మా ‘ప్లాంట్–మ్యాన్’ సినిమాకి ఇంత పెద్ద విజయాన్ని అందించిన ప్రేక్షకులకు థ్యాంక్స్. నటీనటులు, సాంకేతిక నిపుణుల సహకారం వల్లే ఇంత మంచి సినిమా చేయగలిగాను’’ అన్నారు. ‘‘మా సినిమాని ఆదరిస్తున్న ప్రేక్షకులకు ధన్యవాదాలు. నాకు హీరోగా అవకాశం ఇచ్చిన పన్నాగారికి కృతజ్ఞతలు’’ అన్నారు చంద్రశేఖర్. ‘‘ఇలాంటి ఒక మంచి సినిమాలో భాగమైనందుకు సంతోషం’’ అన్నారు సోనాలి. -
‘ప్లాంట్ మ్యాన్’ను ఆదరిస్తున్న ప్రేక్షకులకు ధన్యవాదాలు: నిర్మాత
చంద్రశేఖర్, సోనాలి జంటగా కె.సంతోష్‌బాబు దర్శకత్వంలో రూపొందిన సైంటిఫిక్ కామెడీ ఎంటర్టైనర్ ‘ఫ్లాంట్మ్యాన్’. జనవరి 5న విడుదలైన ఈ చిత్రానికి ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభించింది. ఈ నేపథ్యంలో తమ చిత్రానికి మంచి విజయాన్ని అందించిన ప్రేక్షకులకు కృతజ్ఞతలు తెలిపేందుకు విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేసింది చిత్ర యూనిట్. ఈ సందర్భంగా నిర్మాత పన్నా రాయల్ మాట్లాడుతూ .. డైరెక్టర్‌గా నేను అందరికీ పరిచయమే. నిర్మాతగా నేను చేసిన మొదటి సినిమా ఇది. ఒక చిన్న సినిమాగా ‘ప్లాంట్ మ్యాన్’ను స్టార్ట్ చేశాము. కానీ, రిజల్ట్ మాత్రం అల్టిమేట్‌గా ఉంది. ఇలాంటి రెస్పాన్స్ వస్తే సంవత్సరానికి రెండు చిన్న సినిమాలు చేసి కొత్త వారిని ఇంట్రడ్యూస్ చెయ్యాలని ఉంది. ‘ప్లాంట్ మాన్’ చిత్రం ఇంత పెద్ద విజయాన్ని సాధించడానికి సినిమాలో నటించిన నటీనటులు, టెక్నీషియన్స్ ముఖ్య కారణం. సినిమాని ఇంత బాగా ఆదరిస్తున్న ప్రేక్షకులకు నా ధన్యవాదాలు’’ అన్నారు. దర్శకుడు కె.సంతోష్‌బాబు మాట్లాడుతూ ‘‘మా ఈ చిన్న సినిమాకి ఇంత పెద్ద విజయాన్ని అందించిన ప్రేక్షకులకు థాంక్స్. ఈ సినిమా చేయడానికి నిర్మాత పన్నా రాయల్గారే కారణం. నేను చెప్పిన లైన్ నచ్చి ఈ సినిమా స్టార్ట్ చేశారు. ఈ సినిమా ఇంత పెద్ద సక్సెస్ అవ్వడానికి పన్నాగారు, డిఓపి కర్ణన్‌గారు, సాయినాథ్‌గారు కారణం. నటీనటులు, టెక్నీషియన్స్ అందించిన సపోర్ట్‌తో ఇంత మంచి సినిమా చేయగలిగాను’’ అన్నారు. హీరో చంద్రశేఖర్ మాట్లాడుతూ ‘‘నెల క్రితం ఈ హాల్ బయట ఉండి చూసిన నన్ను ఇప్పుడు స్టేజ్ మీద కూర్చోబెట్టారు. పన్నాగారు కొత్తవారిని ఎంకరేజ్ చేయడంలో ఎప్పుడూ ముందుంటారు. ఈ సంక్రాంతి ఫెస్టివల్‌కి కుటుంబ సమేతంగా చూసి ఎంజాయ్ చేయదగ్గ సినిమా ఇది’’ అన్నారు. హీరోయిన్ సోనాలి మాట్లాడుతూ ‘‘ఈ సినిమాలో అవకాశం డిఓపి కర్ణన్‌గారి ద్వారా వచ్చింది. దానికి నిర్మాత పన్నాగారు ఎంతో సపోర్ట్ చేశారు. స్టార్టింగ్‌లో కొంత నెర్వస్‌గా ఉంది. అందరూ నన్ను ఎంతో ఎంకరేజ్ చేశారు. ఒక మంచి సినిమాలో నేను కూడా భాగమైనందుకు సంతోషంగా ఉంది. సినిమా థియేటర్లలో రన్ అవుతోంది. తప్పకుండా అందరూ చూడండి’’ అన్నారు. -
‘ప్లాంట్ మ్యాన్’ మూవీ రివ్యూ
టైటిల్: ‘ప్లాంట్ మ్యాన్’ నటీనటులు: చంద్రశేఖర్, సోనాలి పాణిగ్రాహి, అశోక్ వర్థన్, బేబీ ప్రేక్షిత, అక్కం బాలరాజు, చలపతిరావు, తడివేలు, బాలరాజ్, లక్ష్మీకిరణ్, శేఖర్, వీరభద్రం, శ్రీకుమారి, మురళీకృష్ణ, వాణిశ్రీ, బిందు, సరస్వతి, జగపతి తదితరులు నిర్మాణ సంస్థ: డి.ఎం. యూనివర్సల్ స్టూడియోస్ నిర్మాత-దర్శకత్వ పర్యవేక్షణ: పన్నా రాయల్ దర్శకత్వం: కె.సంతోష్‌బాబు సంగీతం: ఆనంద బాలాజీ విడుదల తేది: జనవరి 5, 2023 ప్లాంట్ మ్యాన్ కథేంటంటే.. చారి (చందు)కి ఓ ప్రైవేట్ కంపెనీలో పాతిక లక్షల ప్యాకేజీతో ఉద్యోగం వస్తుంది. అయినా కూడా ఆ ఉద్యోగాన్ని వదులుకొని తనకెంతో ఇష్టమైన ఆర్గానిక్ వెజిటబుల్స్ బిజినెస్ రన్ చేస్తుంటాడు. కొడుక్కి పెళ్లి చేయాలని చారి పెరెంట్స్ తెగ ప్రయత్నాలు చేస్తారు. అయితే చారి మాత్రం తన పెళ్లిని ఎప్పటికప్పుడు వాయిదా వేస్తూ ఉంటాడు. చివరకు ఓ పెళ్లి చూపులకెళ్లి చందు(సోనాలి)ని ఇష్టపడతాడు. చందు కూడా చారిని ఇష్టపడుతుంది. దీంతో ఇరుకుటుంబాలు కలిసి త్వరలోనే పెళ్లి జరిపించాలకుంటారు. అయితే చందు చిన్ననాటి స్నేహితుడు చింటు(అక్కం బాలరాజు)కి ఆమె అంటే చాలా ఇష్టం. ప్రేమ విషయాన్ని చెప్పలేక చందుకు వచ్చి పెళ్లి సంబంధాలన్నీ చెడగొడుతుంటాడు. చారిని కూడా అలానే బెదిరించేందుకు ప్రయత్నిస్తాడు కానీ అది వర్కౌట్ కాదు. ఎలాగైన చందు, చారిల పెళ్లి చెడగొట్టాలని ట్రై చేస్తాడు. కట్ చేస్తే.. చింటూ తండ్రి ఓ సైంటిస్ట్ . ఎడారిలో సైతం మొక్కలు మొలిపించేందుకు 30 ఏళ్లుగా పరిశోధనలు చేస్తుంటాడు. ఓరోజు అతని పరిశోధన విజయవంతమై ఓ మందు కనుగొంటాడు. ఆ రసాయనం నేల మీద జల్లితే నిమిషాల్లో మొక్కలు పుట్టుకొస్తాయి. అది తెలుసుకున్న చింటూ ఆ మందును చారి మీద ప్రయోగిస్తాడు. దాంతో చారికి ఒళ్ళంతా మొక్కలు వచ్చేస్తాయి. ఆ తర్వాత ఏం జరిగింది? ప్లాంట్ మ్యాన్‌గా మారిన చారికి ఎదురైన సమస్యలు ఏంటి? ఒంటి నిండా వచ్చిన మొక్కలతో అతను ఎలాంటి ఇబ్బందులు పడ్డాడు? చివరికి అతను ఆ సమస్య నుంచి ఎలా బయటపడి మామూలు మనిషిగా మారాడు? చందుతో పెళ్లి సంగతి ఏమైంది? తదితర విషయాలు తెలియాలంటే ప్లాంట్ మ్యాన్ సినిమా చూడాల్సిందే. ఎలా ఉందంటే.. ఓ వ్యక్తి శరీరంపై మొక్కలు మొలకెత్తుతే ఎలా ఉంటుంది? ఇది వినడానికే విచత్రంగా ఉంది కదా? అలాంటి సరికొత్త పాయింట్‌తో తెరకెక్కిన సినిమానే ‘ప్లాంట్ మ్యాన్’. దర్శకుడు కె.సంతోష్‌బాబు ఇప్పటివరకు తెలుగు తెరపై చూడని సరికొత్త పాయింట్‌ని ఎంచుకున్నాడు..కానీ దాన్ని అంతే కొత్తగా, ఆసక్తికరంగా చూపించడంలో కాస్త తడబడ్డాడు. సినిమా మొత్తాన్ని కామెడీ వేలోనే నడించాడు. హీరో మూములు మనిషి నుంచి ప్లాంట్ మ్యాన్‌గా మారడం, ఆ ప్రాసెస్‌లో జరిగే ఇన్సిడెంట్స్‌ని ఇవన్నీ ఫన్నీగా సాగుతాయి. హద్దు మీరని హాస్యంతో ఫ్యామిలీ అంతా చూసి ఎంజాయ్ చేసే విధంగా ఈ చిత్రాన్ని తీర్చిదిద్దాడు దర్శకుడు. ప్రతి సన్నివేశం అందరూ నవ్వుకునేలా తియ్యడంలో దర్శకుడు సక్సెస్ అయ్యాడు కానీ ఎమోషనల్ సీన్స్‌ని ఆకట్టుకునేలా తీర్చిదిద్దలేకపోయాడు. కథ ప్రారంభం కాస్త నెమ్మదిగా ఉంటుంది. హీరోహీరోయిన్ల పెళ్లి చూపుల తర్వాత ఆసక్తికరంగా సాగుతుంది. హీరో ఫ్రెండ్ చేసే వాట్సాప్ చాటింగ్ నవ్వులు పూయిస్తుంది. ఒకవైపు హీరోహీరోయిన్ల లవ్‌స్టోరీ..మరోవైపు మొక్కలపై సైంటిస్ట్ చేసే ప్రయోగాన్ని చూపిస్తూ..ఈ రెండింటికి ఎక్కడో లింక్ ఉంటుందనే క్యూరియాసిటీని ప్రేక్షకుల్లో కలిగించేలా చేశాడు. ఫస్టాఫ్‌లో కథ పెద్దగా ఉండదు కానీ ఎంటర్టైన్ చేస్తుంది. అసలు కథంతా సెకండాఫ్‌లోనే ఉంటుంది. హీరో ఒంటినిండా మొక్కలు మొలకెత్తడం.. దాని వల్ల అతనికి ఎదురయ్యే సమస్యలు అన్నీ హ్యాస్యాన్ని పంచడంతో పాటు ఆలోచింపజేస్తాయి. ఈ సినిమాలో అంతర్లీనంగా మొక్కలు అనేవి మానవ జీవితానికి ఎంతో అవసరం అనే సందేశం కూడా ఉంది. అయితే పేరున్న నటీనటులు ఉండి ఉంటే సినిమా ఫలితం మరోలా ఉండేది. ఎవరెలా చేశారంటే.. హీరోహీరోయిన్లుగా నటించిన చందు, సోనాలికి ఇది తొలి సినిమానే అయినా ఎక్కడా తడబాటు లేకుండా చక్కగా నటించారు.కామెడీ, ఎమోషనల్ సీన్స్‌లో కూడా తమ నటనతో మంచి మార్కులు తెచ్చుకున్నారు. హీరో ఫ్రెండ్‌గా నటించిన అశోక్‌వర్థన్ వేసిన పంచ్‌లు బాగా పేలాయి. అతను తన క్యారెక్టర్‌కి పూర్తి న్యాయం చేశాడు. చైల్డ్ ఆర్టిస్ట్ ప్రేక్షిత రాయలసీమ యాసలో చెప్పిన డైలాగ్స్ అందర్నీ నవ్వించాయి. ఇక యూట్యూబ్‌లో ఎంతో పాపులర్ అయిన అక్కం బాలరాజు కూడా తనదైన శైలిలో హాస్యాన్ని పండిరచాడు. మిగతా క్యారెక్టర్స్‌లో నటించిన నటీనటులు కూడా వారి పరిధి మేరకు బాగానే చేశారు. సాంకేతిక విషయాలకొస్తే.. మణికర్ణన్ అందించిన ఫోటోగ్రఫీ బాగుంది. వినోద్ యాజమన్య అందించిన బీజీఎం, ఆనంద బాలాజీ అందించిన మెలోడీ సాంగ్స్ సినిమాకు ప్లస్. ఎడిటింగ్ పర్వాలేదు. నిర్మాణ విలువలు బాగున్నాయి.