ప్లాంట్‌–మ్యాన్‌ని ఆదరిస్తున్నందుకు థ్యాంక్స్‌ | Sakshi
Sakshi News home page

ప్లాంట్‌–మ్యాన్‌ని ఆదరిస్తున్నందుకు థ్యాంక్స్‌

Published Mon, Jan 8 2024 2:15 AM

plant man movie success meet - Sakshi

‘‘డైరెక్టర్‌గా ‘కాలింగ్‌ బెల్, రాక్షసి’ వంటి సినిమాలు తీశాను. నిర్మాతగా నేను చేసిన మొదటి సినిమా ‘ప్లాంట్‌–మ్యాన్‌’. మా చిత్రాన్ని ఇంత బాగా ఆదరిస్తున్న ప్రేక్షకులకు ధన్యవాదాలు. ఇలాంటి స్పందన వస్తే ఏడాదికి రెండు చిన్న సినిమాలు చేసి కొత్త వారిని పరిచయం చేయాలని ఉంది’’ అని నిర్మాత పన్నారాయల్‌ అన్నారు.

చంద్రశేఖర్, సోనాలి జంటగా కె.సంతోష్‌బాబు దర్శకత్వం వహించిన చిత్రం ‘ప్లాంట్‌–మ్యాన్‌’. డీఎం యూనివర్సల్‌ స్టూడియోస్‌పై పన్నారాయల్‌ నిర్మించిన చిత్రం ‘ప్లాంట్‌–మ్యాన్‌’. ఇటీవల విడుదలైన ఈ సినిమా థ్యాంక్స్‌ మీట్‌లో కె.సంతోష్‌బాబు మాట్లాడుతూ–‘‘మా ‘ప్లాంట్‌–మ్యాన్‌’ సినిమాకి ఇంత పెద్ద విజయాన్ని అందించిన ప్రేక్షకులకు థ్యాంక్స్‌. నటీనటులు, సాంకేతిక నిపుణుల సహకారం వల్లే ఇంత మంచి సినిమా చేయగలిగాను’’ అన్నారు. ‘‘మా సినిమాని ఆదరిస్తున్న ప్రేక్షకులకు ధన్యవాదాలు. నాకు హీరోగా అవకాశం ఇచ్చిన పన్నాగారికి కృతజ్ఞతలు’’ అన్నారు చంద్రశేఖర్‌. ‘‘ఇలాంటి ఒక మంచి సినిమాలో భాగమైనందుకు సంతోషం’’ అన్నారు సోనాలి.

Advertisement
 
Advertisement