'సినిమా చూస్తున్నంతసేపు..కనీసం మొభైల్‌ కూడా చూడరు' | Plan-B Flim Going To Release On April 23 | Sakshi
Sakshi News home page

ఏప్రిల్ 23 న విడుదల అవుతున్న ప్లాన్ బి 

Mar 20 2021 8:55 PM | Updated on Mar 20 2021 8:55 PM

Plan-B Flim Going To Release On April 23 - Sakshi

హాస్య నటుడు శ్రీనివాసరెడ్డి కథానాయకుడిగా నటిస్తున్న క్రైమ్ సస్పెన్స్ థ్రిల్లర్ చిత్రం ‘ప్లాన్‌ బి’. ఎవిఆర్ మూవీ వండర్స్ పతాకం పై కెవి రాజమహి ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తు‍న్నారు.  ఎవిఆర్ ఈ సినిమాను నిర్మిస్తున్న ఈ చిత్రం​ ఏప్రిల్‌ 23న విడుదల కానుంది. ఈ సందర్భంగా చిత్ర దర్శకుడు కెవి రాజమహి మాట్లాడుతూ "ప్లాన్ బి చిత్రం ఒక సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్. ఆద్యంతం ఉత్కంఠం తో థ్రిల్లింగ్ అంశాలతో  సాగె కథ ఇది. సినిమా చూస్తున్న ప్రేక్షకుడు కనీసం తన మొబైల్ ఫోన్ చూసే అవకాశం కూడా ఉండదు అంత ఉత్కంఠంగా ఉంటుంది. మా చిత్రాన్ని సెన్సార్ వారు చూసి  సినిమా అద్భుతంగా ఉంది, ఇలాంటి కథని మేము ఎప్పుడు చూడలేదు అని ప్రశంసించి యు/ఎ సర్టిఫికెట్ ఇచ్చారు. సినిమా చాలా కొత్తగా ఉంటుంది. శ్రీనివాస్ రెడ్డి గారు, మురళి శర్మ గారు, సూర్య వశిష్ఠ, రవిప్రకాష్, అభినవ్ సర్దార్ వీళ్లందరి నటన మా చిత్రానికే ఒక హైలైట్. మా చిత్రాన్ని ఏప్రిల్ 23 న విడుదల చేస్తున్నాము" అని తెలిపారు. 

నిర్మాత ఎవిఆర్ మాట్లాడుతూ "మా ప్లాన్ బి చిత్రం సెన్సార్ పూర్తీ అయ్యింది, యు/ఎ సర్టిఫికెట్ ఇచ్చారని, కథ చాలా అద్భుతంగా వచ్చిందన్నారు. 'ఫస్ట్ సినిమా అయినా కూడా ఎంతో అనుభవం ఉన్న దర్శకుడిగా రాజమహి రూపొందించాడు. ఈ సినిమా విడుదల కి ముందే  మా దర్శకుడికి మరో రెండు సినిమా అవకాశాలు వచ్చాయి. ఇప్పటివరకు తెలుగు స్క్రీన్ పై రాని ఉత్కంఠ భరితమైన సన్నివేశాలు ఈ చిత్రంలో ఉన్నాయి.  ఏప్రిల్ 23 న విడుదల చేస్తున్నాం' అని తెలిపారు. ఈ చిత్రంలో శ్రీనివాస్ రెడ్డి, సూర్య వశిష్ఠ, డింపుల్, మురళి శర్మ, రవిప్రకాష్, నవీనారెడ్డి, అభినవ్ సర్దార్, చిత్రం శీను, షాని, తదితరులు  ముఖ్య పాత్రల్లో నటించారు. 

Advertisement
 
Advertisement
Advertisement