Payal Rajput Birthday: Payal Rajput Childhood Photo Goes Viral - Sakshi
Sakshi News home page

Heroine Chilhood Pic: ఫస్ట్‌ సినిమాతోనే కుర్రాళ్ల మతిపోగొట్టిన ఈ చిన్నారి ఎవరో గుర్తుపట్టారా?

Dec 4 2021 9:36 PM | Updated on Dec 5 2021 12:31 PM

Payal Rajput Birthday: Payal Rajput Childhood Photo Goes Viral - Sakshi

ఈ మధ్య సెలబ్రెటీల చిన్ననాటి ఫొటోలు సోషల్‌ మీడియాలో తెగ వైరల్‌ అవుతున్నాయి. ఇక లాక్‌డౌన్‌లో ఇంటికే పరిమితమైన తారలంతా మధుర జ్ఞాపకాలను నెమరువేసుకుంటూ తమ త్రోబ్యాక్‌ ఫొటోలు షేర్‌ చేయడంతో ఫ్యాన్స్ వాటిని క్షణాల్లో వైరల్ చేసేస్తున్నారు. దీంతో నెట్టింట త్రోబ్యాక్ ఫోటోల ట్రెండ్ కొనసాగుతోంది. తాజా మరో హీరోయిన్‌ చిన్ననాటి ఫొటో ఒకటి నెట్టింట సందడి చేస్తుంది. గుర్తపట్టనంతగా ఉన్న ఈ చిన్నారి ఎవరో గుర్తించడం కొంచం కష్టంగా ఉన్న పట్టిపట్టి చూడగా ఆమె ఎవరో చెప్పేస్తున్నారు నెటిజన్లు.

చదవండి: సిరివెన్నెల అంత్యక్రియల్లో కనిపించని మంచు ఫ్యామిలీ, ఎందుకో తెలుసా?

ఇంతకి ఈ చిన్నారి ఎవరో మీరు గుర్తుపట్టరా? అయితే ఇక్కడే ఓ లుక్కేయండి. రెండు పిలకలు వేసుకుని చక్కగా ఫోటోకి పోజిస్తున్న ఈ చిన్నారి.. ఇప్పుడు తెలుగునాట క్రేజీ హీరోయిన్. తన అంద చందాలతో కుర్రాళ్ల మతి పోగొడుతోంది. మొదటి సినిమాతోనే అబ్బాయిల్లో పిచ్చ ఫాలోయింగ్ సంపాదించింది ఈమె. ఎవరో గుర్తుపట్టారా.? ఈమె నటించిన తొలి చిత్రానికి దర్శకుడు అజయ్ భూపతి.. కనిపెట్టేశారా.? ఆమెవరో కాదు పంజాబి భామ పాయల్ రాజ్‌పుత్. రేపు ఆమె బర్త్‌డే సందర్భంగా ఫ్యాన్స్‌ తన చిన్ననాటి ఫొటోలను షేర్‌ చేస్తూ బర్త్‌డే విషెస్‌ తెలుపుతున్నారు.

చదవండి: విషాదం... అఖండ మూవీ చూస్తూ బాలయ్య అభిమాని మృతి

కాగా ఆర్ఎక్స్ 100 సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన పాయల్ రాజ్‌పుత్.. ఆ సినిమాలో నటనకు గానూ మంచి మార్కులు కొట్టెసింది. అంతేకాకుండా బెస్ట్ ఫిమేల్ డెబ్యూ యాక్టరస్‌గా కూడా సైమా అవార్డు అందుకుంది. అయితే ఈ సినిమా తర్వాత ఆమె నటించిన ‘ఆర్డీఎక్స్ లవ్’, ‘వెంకీ మామ’, ‘డిస్కో రాజా’ సినిమాలు బాక్సాఫీస్ దగ్గర చెప్పుకోదగ్గ విజయాలు అందుకోలేదు. ఇదిలా ఉంటే.. ప్రస్తుతం పాయల్ రాజ్‌పుత్ తమిళ, పంజాబీ, కన్నడ, తెలుగు భాషల్లో పలు ప్రాజెక్ట్స్‌కు సంతకం చేసింది. 

Advertisement
 
Advertisement
Advertisement