Parineeti Chopra: ఆప్‌ నేతతో డేటింగ్‌లో పరిణితీ చోప్రా.. సోషల్ మీడియాలో వైరల్

Parineeti Chopra Getting Dating Rumours With Politician - Sakshi

బాలీవుడ్ నటి పరిణీతి చోప్రా పరిచయం అక్కర్లేని పేరు. ప్రియాంక చోప్రా సోదరిగా బాలీవుడ్‌లోకి అడుగు పెట్టిన ఈ పంజాబీ బ్యూటీ. 2011లో లేడీస్ వర్సెస్ రికీ బహ్ల్ సినిమాతో నటిగా ఎంట్రీ ఇచ్చారు. తొలి సినిమాతోనే ఫిలింఫేర్ ఉత్తమ నటి డెబ్యూ అవార్డ్ దక్కింది. ఇప్పటికే పలు హిట్ చిత్రాలతో అభిమానులను అలరించింది. తాజాగా ఈ ముద్దుగుమ్మకు సంబంధించిన ఓ వార్త తెగ వైరలవుతోంది. ప్రస్తుతం పరిణితీ డేటింగ్‌లో ఉన్నట్లు రూమర్స్ చక్కర్లు కొడుతున్నాయి. 

తాజాగా పరిణీతి ఆప్‌ పార్టీకి చెందిన పొలిటిషియన్‌తో డేటింగ్‌లో ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. ఆమ్ ఆద్మీ పార్టీకి చెందిన  రాఘవ చద్దా అనే వ్యక్తితో కలిసి ముంబయిలో కెమెరాలకు చిక్కింది.  నగరంలోని ఒక రెస్టారెంట్ నుంచి బయటకు వస్తుండగా ఈ జంట కెమెరాల కంటపడ్డారు. దీంతో డేటింగ్ రూమర్స్ ఊపందుకున్నాయి. పరిణితీ, రాఘవకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో హల్‌చల్‌ చేస్తున్నాయి. కాగా.. గతంలో పరిణితీ చోప్రాపై చాలా సార్లు  డేటింగ్‌లో ఉన్నట్లు రూమర్స్ వచ్చాయి.

కాగా.. ప్రస్తుతం పరిణీతి తదుపరి చిత్రం చమ్కిలాలో కనిపించనుంది. ఈ చిత్రంలో పరిణీతితో దిల్జిత్ దోసాంజ్ నటిస్తున్నారు. పరిణీతి చివరిసారిగా అమితాబ్ బచ్చన్, అనుపమ్ ఖేర్, బోమన్ ఇరానీ, నీనా గుప్తా నటించిన ఉంఛాయి చిత్రంలో కనిపించింది.
 

మరిన్ని వార్తలు :

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top