Saina's Biopic: Parineeti Chopra Is Carbon Copy Of Saina Nehwal In Her Biopic Movie - Sakshi
Sakshi News home page

'సైనా నెహ్వాల్‌కు కార్భన్‌ కాపీలా ఉంది'

Mar 18 2021 4:49 PM | Updated on Mar 18 2021 8:05 PM

Parineeti Chopra Is A Carbon Copy of Saina Nehwal In New Post - Sakshi

ప్రముఖ బ్యాడ్మింటన్‌ క్రీడాకారిణి సైనా నెహ్వాల్‌ జీవితం ఆధారంగా తీస్తున్నచిత్రం​ ‘సైనా’. బాలీవుడ్‌ నటి పరిణీతీ చోప్రా సైనా పాత్రలో నటించిన సంగతి తెలిసిందే. ఇప్పటికే విడుదలైన ట్రైలర్‌ సినిమాపై అంచనాలను పెంచేసింది. ఇక సైనా పాత్రలో నటించడానికి పరిణీతి చాలా సాధన చేసినట్లు ఈ ట్రైలర్‌ చూస్తే అర్థమవుతోంది. ప్రస్తుతం ఈ సినిమా ప్రమోషన్లలో ఉన్న పరిణీతి తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ ఫోటోను షేర్‌ చేసింది. ఇందులో సైనా నెహ్వాల్‌తో పాటు పరిణీతి కూడా ఉన్న ఫోటో కొలేజీని సోషల్‌ మీడియాలో పంచుకుంది. అయితే ఈ  ఫోటోలో ఇద్దరూ ఒకేలా కనిపించడం విశేషం.  శరీరాకృతి, డ్రెస్సింగ్‌, హెయిర్‌స్టయిల్‌ సహా సైనా మెడలోని చెయిన్‌తో సహా అచ్చం సైనాలానే పరిణీతి కనిపిస్తోంది. దీంతో సైనాకు కార్బన్‌ కాపీలా ఉంది, గ్రేట్‌ వర్క్‌ అంటూ పరిణీతిపై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు.  తన జీవితంలో నటిగా ఒక్కసారైనా ఇలాంటి పాత్ర పోషించినందుకు ఎంతో థ్రిల్లింగ్‌గా ఉందని పరిణీతి పేర్కొంది.

ఇక ఈ సినిమా కోసం బ్యాడ్మింటన్‌ ప్లేయర్‌గా తన ప్రయాణం ఎలా సాగిందో వివరిస్తూ ఇటీవలె పరిణీతి ఓ వీడియోను పంచుకుంది. ఇందులో తాను బ్యాడ్మింటన్‌ నేర్చుకొని సైనాలాగే మారడానికి ఎంత కష్టపడిందో వివరించింది.ఈ పాత్ర కోసం పొద్దున్నే నిద్రలేచి కోర్టులో ప్రాక్టీస్‌ చేసేదాన్ని. కేవలం లుక్స్‌ పరంగానే కాకుండా సైనాలాగా ఆడటంలో మెరుగులు నేర్చుకోకపోతే ఎప్పటికీ ఈ పాత్రకు న్యాయం చేయలేను అనిపించేది. ఒక్కోసారి అసలు నేను ఈ రోల్‌ చేయగలనా లేదా అని ఏడ్చిన రోజులు కూడా ఉన్నాయి' అని పరిణీతి పేర్కొంది. ఈ పాత్ర కోసం పరిణీతి చోప్రా బ్యాడ్మింటన్‌లో మెళకువలన్నీ నేర్చకోవడంతోపాటు సైనా, ఆమె కుటుంబంతో సమయం గడిపిన విషయం తెలిసిందే. అమోల్‌ గుప్తా దర్శకత్వం వహించిన ‘సైనా’ మూవీ మార్చి 26 ప్రేక్షకుల ముందకు రానుంది. 

చదవండి : (బ్యాడ్మింటన్‌కు టెన్నిస్‌కు తేడా తెలీదా?)
(నా భర్త వేధించాడు, పిల్లలే సాక్ష్యం: ప్రముఖ‌ నటి‌‌)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement