నేచురల్ స్టార్ నాని హీరోగా శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో వచ్చిన సినిమా ’ ది ప్యారడైజ్. సెప్టెంబర్ 24న వచ్చిన ఈ సినిమా మిశ్రమ స్పందన అందుకుంది. అయినప్పటికీ బాక్సాఫీస్ వద్ద మాత్రం మంచి వసూళ్లను సాధించింది. ఇప్పుడు ఈ సినిమా ఓటీటీ విడుదలపై ఆసక్తికరమైన వార్తలు వినిపిస్తున్నాయి. థియేటర్లలో విడుదలైనప్పుడు ప్రేక్షకుల నుంచి వచ్చిన విమర్శలను దృష్టిలో పెట్టుకుని ఓటీటీ వెర్షన్‌లో కొన్ని మార్పులు చేయాలని నాని భావిస్తున్నట్లు తెలుస్తోంది. మరి ఆ మార్పులేంటి? ఈ సినిమా ఓటీటీలోకి ఎప్పుడు రానుంది?
బాక్సాఫీస్ వద్ద రూ.171 కోట్లకు పైగా వసూళ్లు
నాని, శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్‌లో వచ్చిన ‘ది ప్యారడైజ్’ సినిమాపై విడుదలకు ముందు భారీ అంచనాలు నెలకొన్నాయి. అయితే థియేటర్లలోకి వచ్చిన తర్వాత సినిమాపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. అయితే వసూళ్ల పరంగా సుమారు రూ. 171 కోట్ల పైగానే రాబెట్టినట్లు తెలుస్తోంది.
‘ది ప్యారడైజ్’ ఓటీటీలోకి ఎప్పుడంటే?
‘ది ప్యారడైజ్’ డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను నెట్‌ఫ్లిక్స్ సుమారు రూ.65 కోట్లకు దక్కించుకున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాను అక్టోబర్ 23న నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్‌కు తీసుకురావాలని ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. థియేటర్లలో చూపించని ఓ పాటను ఓటీటీ వెర్షన్‌లో చేర్చనున్నట్లు టాక్. అంతేకాకుండా ప్రేక్షకుల నుంచి విమర్శలు ఎదుర్కొన్న కొన్ని సన్నివేశాలను కూడా తిరిగి ఎడిట్ చేయనున్నట్లు సమాచారం. అయితే ఈ మార్పులపై చిత్రబృందం నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. అయితే స్ట్రీమింగ్ తేదీ, ఓటీటీ వెర్షన్‌లో చేయనున్న మార్పులపై అధికారిక స్పష్టత రావాల్సి ఉంది. నిజంగానే అదనపు పాటతో పాటు సన్నివేశాల్లోనూ మార్పులు చేస్తే.. ఓటీటీ ప్రేక్షకుల నుంచి ఎలాంటి స్పందన వస్తుందో చూడాలి.
(ఇదీ చదవండి: రాజమౌళికి సిగ్గు ఎక్కువ.. మా ప్రేమ అలా మొదలైంది: రామా రాజమౌళి)


