తెలుగులో ఒక్కటే సినిమా, అదీ పవన్‌తో.. ఈ హీరోయిన్‌ ఎవరో గుర్తుపట్టారా? | Panja Movie Actress Sarah Jane Dias Present Situation, Latest Look And Rare Facts Goes Viral | Sakshi
Sakshi News home page

Guess The Actress: గుర్తుపట్టలేనంతగా బక్కచిక్కిపోయిన టాలీవుడ్ హీరోయిన్

Jul 6 2024 1:22 PM | Updated on Jul 6 2024 3:35 PM

Panja Movie Actress Sarah Jane Dias Latest News And Pic

తెలుగు సినిమాల్లోకి కొత్త హీరోయిన్లు వెల్లువలా వస్తూనే ఉంటారు. సీనియర్ బ్యూటీస్ సైలెంట్‌గా సైడ్ అయిపోతుంటారు. కొన్నిసార్లు స్టార్ హీరోలతో కలిసి మూవీస్ చేసినప్పటికీ కొందరికి అదృష్టం కలిసి రాదంతే! ఈ హీరోయిన్‌ది కూడా సేమ్ అలాంటి పరిస్థితే. ఏకంగా పవన్ కల్యాణ్ పక్కన హీరోయిన్‌గా చేసింది. కానీ ఈమెకు ఛాన్సులు రాలేదు. మరి ఇంతలా చెప్పాం కదా ఈమె ఎవరో గుర్తుపట్టారా? మమ్మల్నే చెప్పేయమంటారా?

పైన ఫొటోలో కనిపిస్తున్న బ్యూటీ పేరు సారా జేన్ డయాస్. బహుశా ఈమెని కొందరు చూసుంటారు. మరికొందరూ పూర్తిగా చూసుండకపోవచ్చు. ఎందుకంటే అప్పుడెప్పుడో 2011లో వచ్చిన పవన్ కల్యాణ్ 'పంజా' మూవీలో ఓ హీరోయిన్‌గా చేసింది. అప్పుడేమో ముద్దుగా కాస్త అందంగా ఉన్న ఈ భామ.. ఇప్పుడు ఏమైందో ఏమో గానీ కాస్త బక్కచిక్కిపోయి కనిపించింది. సడన్‌గా చూసి ఈమెని గుర్తుపట్టడమే కష్టమైపోయింది.

(ఇదీ చదవండి: డైరెక్టర్ రాజమౌళి జీవితంపై మూవీ.. ఓటీటీలో నేరుగా రిలీజ్)

ఇకపోతే సారా జేన్‌ది మన దేశం కాదు. ఒమన్‌లో పుట్టి పెరిగింది. మిస్ ఇండియా ఒమన్, మిస్ ఇండియా వరల్డ్ టైటిల్స్ గెలుచుకుని మోడలింగ్‌లో ఓ మాదిరి గుర్తింపు సొంతం చేసుకుంది. ఇక సినిమా అవకాశాల కోసం ముంబైలో అడుగుపెట్టి టీవీ షోల్లో తళుక్కుమంది. అలా ఓ తమిళ సినిమాలో హీరోయిన్ ఛాన్స్ దక్కించుకుంది. ఆ తర్వాత ఆరేళ్ల పాటు సినిమాలు చేసింది. తెలుగులో 'పంజా'లో కనిపించగా.. మిగతావన్నీ హిందీ మూవీసే.

2017లో చివరగా సినిమాలు చేసిన సారా జేన్.. ఆ తర్వాత ఓటీటీల్లో వెబ్ సిరీసుల్లో నటిస్తూ వస్తోంది. గతేడాది వచ్చిన మేడ్ ఇన్ హెవెన్, ద ఫ్రీలాన్సర్ సిరీసుల్లో కనిపించింది. వ్యక్తిగత జీవితం విషయానికొస్తే.. 41 ఏళ్ల వయసొచ్చినా సరే ఇంకా సింగిల్‌గానే ఉంటోంది. ఏదేమైనా చాన్నాళ్ల తర్వాత షాకింగ్ లుక్‌లో కనిపించి మరోసారి వార్తల్లో నిలిచింది.

(ఇదీ చదవండి: 'బేబి' డైరెక్టర్‌కి షాకింగ్ ఎక్స్‌పీరియెన్స్.. భోజనం కోసం ఇంటికి పిలిచి..)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement