'బేబి' డైరెక్టర్‌కి షాకింగ్ ఎక్స్‌పీరియెన్స్.. పాపం అలా అనేసరికి! | Director Sai Rajesh Shares Shocking Lunch Experience, Post Goes Viral On Social Media | Sakshi
Sakshi News home page

Sai Rajesh: తెలుగు దర్శకుడికి వింత అనుభవం.. దెబ్బకు సైలెంట్!

Jul 6 2024 8:43 AM | Updated on Jul 6 2024 9:31 AM

Director Sai Rajesh Shares Shocking Lunch Experience

'బేబి' సినిమా గతేడాది ఎంత సెన్సేషన్ క్రియేట్ చేసిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. టీనేజ్ లవ్ స్టోరీతో దర్శకుడు సాయి రాజేశ్ బ్లాక్ బస్టర్ హిట్ కొట్టేశాడు. గతంలో పలు సినిమాలకు దర్శకుడు, నిర్మాతగా వ్యవహరించినప్పటికీ.. 'బేబి'తోనే అందరికీ బాగా పరిచయమయ్యాడు. ప్రస్తుతం కొత్త ప్రాజెక్టులతో బిజీగా ఉన్న ఇతడికి తాజాగా వింత అనుభవం ఎదురైంది. భోజనానికి పిలిచి మరీ షాకిచ్చారు. దీని గురించి స్వయంగా సాయి రాజేశ్ ఇన్ స్టాలో పోస్ట్ పెట్టాడు.

(ఇదీ చదవండి: పొరపాట్లు ఒప్పుకొన్న 'కల్కి' డైరెక్టర్.. ఆ మూడు విషయాల్లో!)

'నిన్న ఒక స్నేహితుడు బలవంతం మీద , తన ప్రాణ స్నేహితుడి ఇంటికి భోజనానికి వెళ్లాను, 'నీ సినిమా అంటే మా వాడికి ప్రాణం, 50 సార్లు చూసుంటాడు, ఇన్నేళ్ల మా స్నేహం లో ఏది ఆడగలేదు, నిన్ను భోజనానికి తీసుకు రమ్మన్నాడు' అన్నాడు. సర్లే మనకి ఈ చపాతీలు, రోటీలు మొహం మొత్తింది. హోమ్ ఫుడ్ తినొచ్చు అని వెళ్లాను. 10 రకాల వంటలు, అద్భుతమైన ఆతిథ్యం , ఎంత గొప్ప సినిమా సర్ అని వాళ్ల ఆవిడకి, పక్కింటి వాళ్లకి, గేట్ దగ్గర వాచ్ మాన్‌కి, కొరియర్ బాయ్‌కి, సార్‌తో సెల్ఫీ దిగండి, 'బేబీ సినిమా డైరెక్టర్' అని 30 ఫోటో లు ఇప్పించారు. ఒక గంట తర్వాత ప్లేట్‌లో గారెలు, నాటుకోడి పులుసు వడ్డించారు. 'మా అమ్మాయికి సమంత అంటే చాలా ఇష్టమండి, ఒక ఫొటో ఇప్పించండి, మళ్లీ ఎప్పడు చేస్తున్నారు ఆవిడతో' అని అన్నాడు. ఇంత జరిగినా గారెలు సిగ్గు లేకుండా లోపలకి వెళ్లిపోయినాయి. ఓ బేబీ' అని సాయి రాజేశ్ రాసుకొచ్చాడు.

గతంలో సమంత ప్రధాన పాత్రలో 'ఓ బేబీ' అనే సినిమా వచ్చింది. 'బేబి' పేరుతో సాయి రాజేశ్ ఓ మూవీ తీశాడు. ఈ రెండింటి విషయంలో పొరబడ్డ డైరెక్టర్ ఫ్రెండ్‌ ఫ్రెండ్ సాయి రాజేశ్ పెద్ద షాకిచ్చాడు. అక్కడ ఏం చెప్పాలో తెలీక ఇలా ఇన్ స్టాలో పోస్ట్ పెట్టి అందరినీ నవ్వించేస్తున్నాడు. ఏదేమైనా 'బేబి' పేరు ఎంత పనిచేసింది!

(ఇదీ చదవండి: ప్రభాస్ 'రాజాసాబ్'... ఆ వార్తలు నమ్మొద్దని టీమ్ ప్రకటన)

Advertisement
 
Advertisement
Advertisement