నవ్వులే నవ్వులు  | Om Bheem Bush Trailer Launch | Sakshi
Sakshi News home page

నవ్వులే నవ్వులు 

Mar 16 2024 1:24 AM | Updated on Mar 16 2024 1:24 AM

Om Bheem Bush Trailer Launch - Sakshi

శ్రీహర్ష, శ్రీవిష్ణు 

‘‘ప్రేక్షకులను నవ్వించాలనే ఉద్దేశంతోనే ‘ఓం భీమ్‌ బుష్‌’ సినిమా చేశాం. రెండు వందల శాతం ఆడియన్స్‌ పిచ్చి పిచ్చిగా నవ్వుతారు. ప్రేక్షకుల నవ్వులతో థియేటర్స్‌ బద్దలైపోతాయి’’ అని హీరో శ్రీవిష్ణు అన్నారు. శ్రీవిష్ణు, ప్రీతీ ముకుందన్‌ జంటగా, ప్రియదర్శి, రాహుల్‌ రామకృష్ణ, అయేషా ఖాన్, ప్రియా వడ్లమాని, శ్రీకాంత్‌ అయ్యంగార్‌ ముఖ్య పాత్రల్లో నటించిన ఈ సినిమాకు శ్రీహర్ష కొనుగంటి దర్శకత్వం వహించారు.

యూవీ క్రియేషన్స్, వీ సెల్యూలాయిడ్‌ పతాకాలపై సునీల్‌ బలుసు నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 22న విడుదల కానుంది. ఈ సందర్భంగా శుక్రవారం హైదరాబాద్‌లో జరిగిన ఈ సినిమా ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌లో శ్రీవిష్ణు మాట్లాడుతూ– ‘‘దర్శకుడు హర్ష ఈ సినిమాను హిలేరియస్‌గా తీశాడు. అవకాశం ఇచ్చిన యూవీ వంశీ అన్న, సునీల్‌గారికి ధన్యవాదాలు’’ అన్నారు. ‘‘ట్రైలర్‌లో ఉన్న ఎనర్జీ కంటే సినిమాలో వంద రెట్లు ఎనర్జీ ఉంది’’ అన్నారు శ్రీహర్ష. ‘‘ఈ సినిమాతో డబుల్‌ డోస్‌ ఎంటర్‌టైన్మెంట్‌ ఇస్తామని ప్రామిస్‌ చేస్తున్నాం’’ అన్నారు ప్రియదర్శి. ‘‘ఓం భీమ్‌ బుష్‌’ ప్రేక్షకులను అలరిస్తుంది’’ అన్నారు సునీల్‌.

Advertisement
 
Advertisement
Advertisement