Om Bheem Bush: నో లాజిక్‌ ఓన్లీ మ్యాజిక్‌.. శ్రీవిష్ణు ఖాతాలో మరో హిట్‌? | Om Bheem Bush Censor Review | Sakshi
Sakshi News home page

Om Bheem Bush: నో లాజిక్‌ ఓన్లీ మ్యాజిక్‌.. శ్రీవిష్ణు ఖాతాలో మరో హిట్‌ పడ్డట్లేనా?

Mar 19 2024 2:50 PM | Updated on Mar 19 2024 3:26 PM

Om Bheem Bush Censor Review - Sakshi

తెలుగు తెరపై మరో కామెడీ సినిమా సందడి చేయబోతుంది. అదే ఓమ్‌ బీమ్‌ బుష్‌. శ్రీవిష్ణు, ప్రియదర్శి, రాహుల్‌ రామకృష్ణ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రం మార్చి 22న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. తాజాగా ఈ మూవీ సెన్సార్‌ కార్యక్రమాలు పూర్తి చేసుకుంది. సెన్సార్‌ బోర్డు ఈ చిత్రానికి యూ/ఏ(U/A) సర్టిఫికేట్‌ జారీ చేశారు. సినిమా చూస్తున్నంతసేపు సెన్సార్‌ సభ్యులు నవ్వుతూనే ఉన్నారట. కామెడీతో పాటు మంచి ఎమోషన్స్‌ కూడా ఈ చిత్రంలో ఉన్నట్లు తెలుస్తోంది.

ఇక శ్రీవిష్ణు, ప్రియదర్శి, రాహుల్‌ రామకృష్ణ ముగ్గురూ పోటీపడి నటించారట. శ్రీవిష్ణు అద్భుతమైన కామెడీ టైమింగ్‌తో ఆకట్టుకుంటే.. ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ స్పాంటేనియస్ డైలాగ్స్‌తో అదరగొట్టారట.  క్లైమాక్స్ లో భారీ ఎమోషన్‌ తో ఊహించని ట్విస్ట్‌లు ఉంటాయట. సెన్సార్‌ సభ్యుల మాదిరే థియేటర్స్‌లో సినిమా చూసిన ప్రతి ఒక్క ప్రేక్షకుడు నవ్వుతూ బయటకు వెళ్లిపోతాడని మేకర్స్‌ నమ్మకంగా చెబుతున్నారు.

శ్రీవిష్ణు ఖాతాలో మరో హిట్‌?
సామజవరగమన తర్వాత శ్రీవిష్ణు నటించిన ఫుల్‌లెన్త్‌ కామెడీ ఎంటర్‌టైనర్‌ ఓమ్‌ బీమ్‌ బుష్‌. డైరెక్టర్‌ శ్రీ హర్ష కొనుగంటి ఈ కథకి హారర్‌ టచ్‌ ఇవ్వడంతో కొన్ని సర్‌ప్రైజింగ్‌ ఎలిమెంట్స్‌ని జతచేశారు. ఇప్పటికే విడుదలైన ట్రైలర్‌.. సినిమాపై అంచనాలు పెంచేసింది. సెన్సార్‌ సభ్యులు ప్రశంసలు.. ట్రైలర్‌కు వచ్చిన రెస్పాన్స్‌ చుస్తుంటే శ్రీవిష్ణు ఖాతాలో కచ్చితంగా మరో హిట్‌ పడేలా ఉంది. మరి జాతిరత్నాలు మాదిరే ‘ఓమ్‌ బీమ్‌ బుష్‌’ కూడా భారీ బ్లాక్‌ బస్టర్‌ అవుతుందా లేదా అనేది మరో మూడు రోజుల్లో తెలిసిపోతుంది.

Advertisement
 
Advertisement
Advertisement