ఓటీటీలోకి వచ్చేస్తున్న నితిన్‌ కొత్త సినిమా..స్ట్రీమింగ్‌ అప్పుడే! | Nithiin Latest Movie Extra Ordinary Man OTT Release Date Details | Sakshi
Sakshi News home page

Extra Ordinary Man: ఓటీటీలోకి వచ్చేస్తున్న నితిన్‌ కొత్త సినిమా..స్ట్రీమింగ్‌ అప్పుడేనా?

Dec 19 2023 11:20 AM | Updated on Dec 19 2023 11:42 AM

Nitin Latest Movie Extra Ordinary Man OTT Release Date Details - Sakshi

నితిన్‌ హీరోగా నటించిన తాజా చిత్రం ‘ఎక్స్‌ట్రా ఆర్డినరీ మ్యాన్‌’. వక్కంతం వంశీ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో శ్రీలీల హీరోయిన్‌గా నటించగా, సీనియర్‌ హీరో రాజశేఖర్‌ కీలక పాత్ర పోషించాడు. డిసెంబర్‌ 8న థియేటర్స్‌లో రిలీజై ఆశించిన స్థాయిలో విజయాన్ని అందుకోలేకపోయింది. రిలీజ్‌కు ముందు విడుదలైన పాటలు, ట్రైలర్‌ సినిమాపై హైప్‌ని క్రియేట్‌ చేశాయి. దర్శకుడు వక్కంతం వంశీ కమర్షియల్స్‌ ఎలిమెంట్స్‌ మెండుగా ఉండేలా జాగ్రత్త పడ్డప్పటికీ.. ప్రేక్షకులను పూర్తి స్థాయిలో మెప్పించలేకపోయాడు. కామెడీ బాగున్నా.. కథనం మాత్రం అంతగా ఆకట్టుకోలేకపోయింది. దీంతో బాక్సాఫీస్‌ వద్ద ‘ఎక్స్‌ట్రా ఆర్డినరీ మ్యాన్‌’ ఆశించిన స్థాయిలో విజయాన్ని అందుకోలేకయింది. 

ఓటీటీలోకి వచ్చేది అప్పుడే
ఈ సినిమా ఓటీటీ హక్కులను ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్‌ సొంతం చేసుకుంది. జనవరి చివరివారం లేదా సంక్రాంతికి ఈ చిత్రాన్ని రిలీజ్‌ చేయాలని తొలుత భావించారట. కానీ సినిమాకు హిట్‌ టాక్‌ రాకపోవడంతో.. అనుకున్న డేట్‌ కంటే ముందే ఓటీటీలో రిలీజ్‌ చేయాలని భావిస్తున్నారు. సంక్రాంతి కానుకగా జనవరి మొదటి వారంలోనే ఈచిత్రాన్ని స్ట్రీమింగ్‌ చేయబోతున్నట్లు తెలుస్తోంది. సంక్రాంతి వీక్‌ ప్రారంభంలో ఈ సినిమా ఓటీటీలో సందడి చేయనుందని వార్తలు వస్తున్నాయి. త్వరలోనే చిత్ర యూనిట్‌ దీనిపై అధికారిక ప్రకటన చేసే అవకాశాలు ఉన్నాయి. 

Advertisement
 
Advertisement
Advertisement