హీరోయిన్‌ ఇంట్లో వేణుస్వామి సీక్రెట్‌ పూజలు.. బయటికొచ్చిన వీడియో | Nidhhi Agerwal Performing Secret Pooja With Astrologer Venu Swamy | Sakshi
Sakshi News home page

Venu Swamy- Nidhhi Agerwal : రష్మిక ఫార్ములానే నమ్ముకున్న 'ఇస్మార్ట్‌' బ్యూటీ.. వేణుస్వామితో పూజలు

Mar 28 2023 12:14 PM | Updated on Mar 28 2023 1:24 PM

Nidhhi Agerwal Performing Secret Pooja With Astrologer Venu Swamy - Sakshi

ప్రముఖ జ్యోతిష్కుడు వేణుస్వామి గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు. సెలబ్రిటీల జాతకాలు చెప్పి నిత్యం వార్తల్లో నిలిచే వేణుస్వామి నాగచైతన్య-సమంత డివర్స్‌ న్యూస్‌తో మరింత ఫేమస్‌ అయ్యాడు. వారిద్దరూ విడిపోతారంటూ పెళ్లికి ముందే చెప్పాడు. కట్‌చేస్తే పెళ్లైన నాలుగేళ్లకే వారు విడాకులు తీసుకోవడంతో వేణుస్వామి పాపులర్‌ అయ్యాడు.

ఇక కొన్నాళ్లుగా సక్సెస్‌ కోసం టాలీవుడ్‌ ప్రముఖులు వేణుస్వామి చుట్టూ తిరుగుతున్నారు. తాజాగా హీరోయిన్‌ నిధి ఆగ‌ర్వాల్ చేత వేణు స్వామి ప్ర‌త్యేక పూజ‌లు చేయించారు. దీనికి సంబంధించిన వీడియోలు, ఫోటోలు ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి. 2018లో స‌వ్య‌సాచి చిత్రంతో టాలీవుడ్‌ ఎంట్రీ ఇచ్చిన నిధి అగర్వాల్‌ తెలుగు, తమిళంలో పలు చిత్రాలు చేసినా ఆమె కెరీర్‌ ఆశించినంత సక్సెస్‌ఫుల్‌గా లేదు. దీంతో సినిమా అవకాశాల కోసం నిధి రాజ శ్యామల యాగం చేసింది.

ఇక గతంలో రష్మిక ఇంట్లో కూడా వేణుస్వామి ప్రత్యేక పూజలు నిర్వహించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆమె టాప్‌ హీరోయిన్‌గా దూసుకుపోతుంది. మరి వేణుస్వామిని నమ్ముకున్న నిధి అగర్వాల్‌కి కూడా లక్‌ కలిసొస్తుందా? అన్నది చూడాల్సి ఉంది. 

Advertisement
 
Advertisement
Advertisement