కొత్త తరం ప్రేమకథ | Sakshi
Sakshi News home page

కొత్త తరం ప్రేమకథ

Published Thu, Feb 16 2023 2:06 AM

A new generation love story - Sakshi

‘అతడు, ఆర్య, ΄పౌర్ణమి, భద్ర’ వంటి చిత్రాల్లో బాలనటుడిగా నటించిన దీపక్‌ సరోజ్‌ హీరోగా నటిస్తున్న చిత్రం ‘సిద్ధార్థ్‌ రాయ్‌’. వి. యశస్వి దర్శకత్వంలో జయ ఆడపాక, ప్రదీప్‌ పూడి, సుధాకర్‌ బోయిన నిర్మించారు. ప్రస్తుతం నిర్మాణానంతర పనులు జరుగుతున్నాయి. ఈ సినిమా కాన్సెప్ట్‌ పో స్టర్‌ను డైరెక్టర్‌ హరీష్‌ శంకర్‌ ఆవిష్కరించగా, నిర్మాత అల్లు అరవింద్‌ ఫస్ట్‌ లుక్‌ను రిలీజ్‌ చేశారు.

‘‘కొత్త తరం ప్రేమకథగా రూపొందిన చిత్రం ఇది. ఈ వేసవిలో రిలీజ్‌ చేయాలనుకుంటున్నాం’’ అని చిత్ర యూనిట్‌ పేర్కొంది. తన్వి నేగి, నాదిని, ఆనంద్, కల్యాణీ నటరాజన్, మాథ్యూ వర్గీస్‌ తదితరులు నటించిన ఈ చిత్రానికి సంగీతం: రథన్, కెమెరా: శ్యామ్‌ కె. నాయుడు, లైన్‌ప్రొ డ్యూసర్‌: బి. శ్యామ్‌కుమార్‌. 

Advertisement
 
Advertisement
 
Advertisement