దివాళీ పార్టీలో మెరిసిన హీరోయిన్.. ప్రెగ్నెన్సీపై క్రేజీ కామెంట్స్! | Netizens Comments On Sonakshi Sinha Is To Be Pregnant Goes Viral | Sakshi
Sakshi News home page

Sonakshi Sinha: ఇటీవలే ప్రియుడితో పెళ్లి.. ప్రెగ్నెన్సీపై నెటిజన్స్‌ కామెంట్స్!

Oct 28 2024 3:58 PM | Updated on Oct 28 2024 4:17 PM

Netizens Comments On Sonakshi Sinha Is To Be Pregnant Goes Viral

బాలీవుడ్ భామ సోనాక్షి సిన్హా ప్రస్తుతం కుటుంబంతో బిజీగా ఉన్నారు. ఈ ఏడాది వివాహబంధంలోకి అడుగుపెట్టిన ముద్దుగుమ్మ భర్తతో కలిసి దిపావళీ పార్టీలో తళుక్కున మెరిసింది. ముంబయిలో జరిగిన దివాళీ బాష్‌లో అనార్కలీ సూట్‌ ధరించి కనిపించింది. ఇద్దరు కలిసి తమ పెట్ డాగ్‌తో ఫోటోలకు పోజులిచ్చారు. దీనికి సంబంధించిన ఫోటోలను తన ఇన్‌స్టాలో షేర్ చేసింది. గెస్ దిస్‌ అంటూ సోనాక్షి క్యాప్షన్ కూడా ఇచ్చింది.

ఇది చూసిన నెటిజన్స్‌ సోనాక్షి సిన్హాను ఉద్దేశించి క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం సోనాక్షి బేబీ బంప్‌తో ఉందంటూ ఇన్‌స్టాలో రిప్లై ఇస్తున్నారు. తన భర్త జహీర్ ఇక్బాల్‌తో కలిసి త్వరలోనే మొదటి బిడ్డకు స్వాగతం పలకనున్నారని పోస్టులు పెడుతున్నారు. మరికొందరు ఏకంగా కంగ్రాట్స్‌ కూడా చెబుతున్నారు. ‍అయితే ప్రెగ్నెన్సీ గురించి ఇప్పటి వరకు సోనాక్షి నుంచి ఎలాంటి ప్రకటనైతే రాలేదు.

(ఇది చదవండి: పెళ్లి జరిగిన ఇంటిని అమ్మేస్తున్న స్టార్ హీరోయిన్)

కాగా.. ఈ ఏడాది జూన్  23న హీరోయిన్ సోనాక్షి సిన్హా పెళ్లి చేసుకుంది. తన ప్రియుడు జహీర్ ఇక్బాల్‌తో కొత్త జీవితాన్ని ప్రారంభించింది. వీరి పెళ్లి వేడుక ముంబయిలోని బాంద్రా ఏరియాలో ఉన్న సోనాక్షి అపార్ట్‌మెంట్‌లోనే జరిగింది. మరోవైపు సోనాక్షి  ది బుక్ ఆఫ్ డార్క్‌నెస్‌లో అనే చిత్రంలో కనిపించనుంది.

 

Advertisement
 
Advertisement
Advertisement