‘నేనే సరోజ’ విజయం సాధించాలి: ఎమ్మెల్యే ముఠా గోపాల్‌ | Nene Saroja teaser released by Telangana MLA Mutha Gopal | Sakshi
Sakshi News home page

‘నేనే సరోజ’ విజయం సాధించాలి: ఎమ్మెల్యే ముఠా గోపాల్‌

Sep 9 2023 12:42 AM | Updated on Sep 9 2023 12:44 PM

Nene Saroja teaser released by Telangana MLA Mutha Gopal - Sakshi

శాన్వీ మేఘన, కౌశిక్‌ బాబు జంటగా శ్రీమాన్‌ గుమ్మడవెల్లి దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘నేనే సరోజ: ఉరఫ్‌ కారం చాయ్‌’. గాళ్స్‌ సేవ్‌ గాళ్స్‌ కాన్సెప్ట్‌ ఆధారంగా ఎస్‌ 3 క్రియేషన్స్‌ పతాకంపై రచయిత డా. సదానంద్‌ శారద నిర్మించిన చిత్రం ఇది. తాజాగా ఈ సినిమా టీజర్‌ను విడుదల చేసిన శాసన సభ్యులు ముఠా గోపాల్‌ మాట్లాడుతూ– ‘‘ఉన్మాదులను ఎదిరించే కాలేజీ విద్యార్థిని పాత్రలో శాన్వీ మేఘన పవర్‌ఫుల్‌గా నటించారు.ఓ సామాజిక అంశాన్ని తీసుకుని ఈ తరహా సినిమాను నిర్మించిన దర్శక–నిర్మాతలను అభినందిస్తున్నాను. ఈ చిత్రం విజయం సాధించాలని కోరుకుంటున్నాను’’ అని అన్నారు.

‘‘ఆడపిల్ల మీద దాడి చేసే ఉన్మాదులకు, వివక్ష చూపించేవారికి తాగిస్తాం కారం చాయ్‌ అంటూ గుణపాఠం చెప్పేలా సరోజ పాత్ర ఉంటుంది. కుటుంబసమేతంగా చూడాల్సిన చిత్రం ఇది’’ అన్నారు శ్రీమాన్‌ గుమ్మడవెల్లి. ‘‘ఆలోచనాత్మక సంభాషణలు.. శాన్వి వీరోచిత పోరాటాలు, ఆర్‌. ఎస్‌. నంద హాస్యం.. ఈ చిత్రానికి ప్రత్యేక ఆకర్షణలు’’ అన్నారు రచయిత, నిర్మాత సదానంద్‌ శారద.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement