ఆ వీడియోలను వెంటనే డిలీట్‌ చేయండి..ఇబ్బందులు తప్పవు : నటి నేహా శర్మ | Neha Sharma Warns Against AI-Generated Videos Using Her Face | Sakshi
Sakshi News home page

వారిని అస్సలు వదిలిపెట్టను..నటి నేహా శర్మ సీరియస్‌ వార్నింగ్‌

Oct 18 2026 8:25 AM | Updated on Oct 18 2026 8:29 AM

Neha Sharma Warns Against AI-Generated Videos Using Her Face

ఏఐ టెక్నాలజీ అందుబాటులోకి వచ్చాక ఏది నిజమైన ఫొటో.. ఏది నకిలీ వీడియోనో గుర్తించడం కష్టంగా మారుతోంది. ముఖ్యంగా సినీ తారలను టార్గెట్‌ చేస్తూ కొందరు ఏఐతో అసభ్యకరమైన ఫొటోలు, వీడియోలు సృష్టించి సోషల్‌ మీడియాలో వైరల్‌ చేస్తున్నారు. ఇప్పటికే ఇలాంటి ఘటనలపై జాన్వీ కపూర్‌తో పాటు పలువురు నటీమణులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తాజాగా నటి నేహా శర్మ కూడా ఈ వ్యవహారంపై స్పందించింది. 

(చదవండి: ‘రణబాలి’పై సందీప్‌ రెడ్డి వంగా రివ్యూ)

తన ఫొటోలు, వీడియోలను మార్ఫింగ్‌ చేస్తున్నవారికి గట్టి హెచ్చరిక జారీ చేసింది.సోషల్‌ మీడియాలో ఇప్పటికే అలాంటి అసభ్యకర కంటెంట్‌ పోస్ట్‌చేసిన వారు వెంటనే డిలీట్‌  చేయాలని..లేదంటే తివ్ర ఇబ్బందులు ఎదుర్కొంటారని వార్నింగ్‌  ఇచ్చారు. ఈ మేరకు తన ఇన్‌స్టాగ్రామ్‌  ఖాతాలో ఓ పోస్ట్‌ పెట్టారు.

‘నా అనుమతి లేకుండా ఏఐ సాయంతో ఫోటోలు, వీడియోలు క్రియేట్‌  చేస్తున్నవారికి సీరియస్‌ వార్నింగ్‌ ఇస్తున్నా. వెంటనే ఆపేయండి. నా ప్రతిష్ఠకు భంగం కలిగించేలా ఉండే ఫోటోలను, వీడియోలను క్రియేట్‌ చేస్తున్నవారితో పాటు షేర్‌ చేసిన వాళ్లను కూడా వదిలిపెట్టను. దీని వెనుక ఉన్న ప్రతి ఒక్కరిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటాను. ఫేక్ అకౌంట్ల వెనుక దాక్కున్నా సరే ఎవరూ తప్పించుకోలేరు’ అని నేహాశర్మ రాసుకొచ్చింది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement