మా నమ్మకం నిజమైంది: నాగవంశీ | Nagavamshi is happy with the collection of Jailor 2 | Sakshi
Sakshi News home page

మా నమ్మకం నిజమైంది: నాగవంశీ

Oct 18 2026 4:48 AM | Updated on Oct 18 2026 4:48 AM

Nagavamshi is happy with the collection of Jailor 2

‘‘జైలర్‌ 2’ సినిమా తెలుగు డిస్ట్రిబ్యూషన్ హక్కులను మేం భారీ రేటుకు తీసుకున్నామని చాలామంది భయపడ్డారు. ఆంధ్రా ఏరియాస్‌లో కొంత రిస్క్ అని మాకూ అనిపించింది. కానీ అక్టోబరు 15న సాయంత్రం షోస్‌కి వచ్చిన వసూళ్లు చూశాక కమిషన్‌ వస్తుందని డిస్ట్రిబ్యూటర్స్‌ చెప్పారు. రజనీకాంత్, నెల్సన్, అనిరుద్‌గార్లను నమ్మి, ‘జైలర్‌ 2’ విషయంలో రిస్క్‌ చేశాం. మా నమ్మకం నిజమైంది’’ అని నిర్మాత, డిస్ట్రిబ్యూటర్‌ నాగవంశీ చెప్పారు. 

రజనీకాంత్‌ హీరోగా నెల్సన్‌ దిలీప్‌కుమార్‌ దర్శకత్వంలో   ‘జైలర్‌’కు సీక్వెల్‌గా రూపొందిన సినిమా ‘జైలర్‌ 2’. ఈ చిత్రం అక్టోబరు 15న విడుదలైంది. తెలుగు రాష్ట్రాల్లో సూర్యదేవర నాగవంశీ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా శనివారం జరిగిన సమావేశంలో నాగవంశీ మాట్లాడుతూ– ‘‘మా బ్యానర్‌లో నెల్సన్‌గారితో ఒక సినిమా ఉంది. అది ఎన్టీఆర్‌గారితోనే అన్న విషయం నిర్మాతగా నేను చెప్పడం కంటే ఎన్టీఆర్‌గారే చెబితే బాగుంటుంది’’ అని తెలిపారు. 

‘‘సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌ సంస్థ ‘జైలర్‌ 2’ డిస్ట్రిబ్యూషన్‌ హక్కులను మాకు ఇవ్వడం సంతోషంగా ఉంది. మా మైత్రీ నిర్మాణంలోని ‘రణబాలి’ చిత్రం కూడా వచ్చింది. ‘గరివిడి లక్ష్మీ’ సినిమాను నైజాంలో మేమే డిస్ట్రిబ్యూట్‌ చేశాం’’ అని మైత్రీ డిస్ట్రిబ్యూటర్‌ శశి అన్నారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement