‘అల్లరి’ నరేశ్, కాజల్ చౌదరి హీరో హీరోయిన్లుగా ప్రదీప్ మద్దాలి దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా ‘కనకదుర్గ’. అనన్య బిర్లా, ప్రీతి షహానీ, అజిత్ ఠాకూర్, బీవీఎస్ రవి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. దేవి నవరాత్రుల సందర్భంగా ఈ సినిమాలోని ‘‘అమ్మా... కనకదుర్గా... మమ్ము కాచే తల్లి కనకదుర్గ...’ పాట లిరికల్ వీడియోను శనివారం విడుదల చేశారు.
‘‘లోకాలనేలేటి మాయమ్మ దుర్గమ్మ చిత్తమున నిన్ను నిలుపించినామమ్మా.., కష్టాలు నష్టాలు తొలగించి మాయమ్మ ఇంద్ర కీలమున నిలిచి ఉన్నావమ్మా...’ వంటి లిరిక్స్తో ఈ పాట సాగుతుంది. సంగీత దర్శకుడు తమన్ స్వరకల్పనలో ఈ పాటకు భాస్కరభట్ల, సిరాశ్రీ సాహిత్యం అందించారు.


