చిరుత హీరోయిన్ మిస్టరీ క్రైమ్ థ్రిల్లర్.. ట్రైలర్‌తోనే భయపెట్టేశారు! | Sakshi
Sakshi News home page

36 Days Trailer: ఓటీటీకి సరికొత్త క్రైమ్‌ థ్రిల్లర్‌..ట్రైలర్‌తోనే భయపెట్టేశారు!

Published Tue, May 28 2024 5:43 PM

Neha Sharma Latest Web Seried Trailer Out Now

ప్రస్తుతం అంతా ఓటీటీల యుగం నడుస్తోంది. అందుకు తగ్గట్టుగానే ‍సరికొత్త సిరీస్‌లు, సినిమాలు సినీ ప్రియులను అలరించేందుకు వస్తున్నాయి. ముఖ్యంగా హారర్‌, క్రైమ్‌ జానర్‌ లాంటి కథలు ఎక్కువగా ఆకట్టుకుంటున్నాయి. అలాంటి వాటికే ప్రేక్షకుల నుంచి ఆదరణ దక్కుతోంది. తాజాగా మరో మిస్టరీ క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ వచ్చేస్తోంది. నేహా శర్మ నటించిన తాజా వెబ్ సిరీస్‌ 36 డేస్‌ ఓటీటీలో సందడి చేయనుంది. తాజాగా ఈ సిరీస్‌ ట్రైలర్‌ను మేకర్స్‌ రిలీజ్ చేశారు.

తాజాగా రిలీజైన ట్రైలర్‌ చూస్తే మర్డర్‌ మిస్టరీగానే తెరకెక్కించినట్లు తెలుస్తోంది. ఈ సిరీస్‌కు 'సీక్రెట్స్ ఆర్ ఇంజూరియస్ టు హెల్త్' అనే క్యాప్షన్ కూడా ఇచ్చారు. ట్రైలర్‌లోనే ట్విస్టులు భయపెట్టేలా ఉ‍న్నాయి. ఇవాళ విడుదల చేసిన ట్రైలర్‌తో ఈ సిరీస్‌పై ప్రేక్షకుల్లో అంచనాలు పెంచేశారు. ఈ సిరీస్‌లో పూరబ్ కోహ్లి, శృతి సేఠ్, చందన్ రాయ్ సన్యాల్, షరీబ్ హష్మి, అమృతా ఖాన్విల్కర్ కీలక పాత్రల్లో నటించారు. అయితే మర్డర్‌ మిస్టరీ సిరీస్‌ ఎప్పటి నుంచి స్ట్రీమింగ్‌ అవుతుందనే విషయాన్ని మాత్రం వెల్లడించలేదు. త్వరలోనే సోనీలివ్‌లో స్ట్రీమింగ్ కానుంది. కాగా.. నేహా శర్మ టాలీవుడ్‌లో చిరుత మూవీలో హీరోయిన్‌గా నటించింది. ఈ చిత్రంలో రామ్ చరణ్ సరసన మెరిసింది. 

Advertisement
 
Advertisement
 
Advertisement