Is Neha Kakkar Pregnant Then Check Out This Viral Video- Sakshi
Sakshi News home page

Is Neha Kakkar Pregnant: నేహా కక్కర్‌ ప్రెగ్నెంటా? ఈ వైరల్‌ వీడియో చూస్తే సరి..

Nov 19 2021 6:03 PM | Updated on Nov 20 2021 1:07 PM

Is Neha Kakkar Pregnant Then Check Out This Viral Video - Sakshi

Is Neha Kakkar Pregnant Then Check Out This Viral Video: బాలీవుడ్‌ టౌన్‌లో మోస్ట్‌ పాపులర్‌ సింగర్‌ నేహా కక్కర్‌. ఈమె గత సంవత్సరం రోహన్‌ ప్రీత్‌ సింగ్‌ను వివాహం చేసుకున్నారు. ఆ వెంటనే బేబీ బంప్‌తో ఉన్న నేహా కక్కర్‌ ఫొటోలు వైరల్‌ అయ్యాయి. దీంతో నేహా గర్భం దాల్చిందని పుకార్లు తెగ చక్కర్లు కొట్టాయి. అకస్మాత్తుగా, ఆమె కుటుంబం నిర్వహించిన కొత్త షో 'లైఫ్‌ ఆఫ్‌ కక్కర్స్‌' యూట్యూబ్‌లో ప్రసారం చేసినప్పటినుంచి ఈ పుకార్లు పుట్టాయి. వీడియోలో ఆమె కడుపును చూసిన అభిమానులు నేహా గర్భం గురించి చర్చించడం మొదలుపెట్టారు. అయితే ఆ వీడియోలో నేహా, రోహన్‌ ప్రీత్‌ ఇద్దరూ ప్రెగ్నెన్సీ గురించి ప్రస్తావించారు. 

'ఇద్దరం చాలా  సరదాగా ఉండాలి, ఎంజాయ్‌ చేయాలి' అని రోహన్‌ప్రీత్‌ అంటే, ప్రస్తుతం కెరీర్‌లో చాలా బిజీగా ఉన్నానని, వచ్చే 2-3 సంవత్సరాలలో పిల్లలను కనే ఆలోచన లేదని నేహా కక్కర్‌ చెప్పారు. అలాగే 'నెల రోజుల్లో నా కడుపు లావైంది. కొంచెం పొట్ట వచ్చింది. నేహా కొంచెం బొద్దుగా మారింది. అది ప్రెగ్నెన్సీ కాదు. నేను మీకు ప్రేమగా మారానని అనుకుందాం.' అని నేహా తెలిపారు. ఇలా తన ప్రెగ్నెన్సీపై వచ్చిన పుకార్లను నేహా కొట్టిపారేశారు. ఆహారంపై తనకున్న ఇష్టం వల్లే కడుపు వచ్చిందన‍్నారు. ఇంకా 'ఖ్యాల్‌ రాఖ్యా కర్‌' అనే మ్యూజిక్‌ వీడియో కోసమే నేహా కక్కర్‌ బేబీ బంప్‌తో ఫొటోలు దిగిందని స్పష్టం చేశారు.
 చదవండి: ఒకప్పుడు ఇండియన్‌ ఐడల్‌లో పార్టిసిపెంట్‌..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement