రూ. 100 కోట్లు ఇచ్చినా సరే ఆ హీరోతో మాత్రం నటించనన్న నయనతార | Sakshi
Sakshi News home page

నయనతార కోసం ఇంటి చుట్టూ ప్రతిరోజూ ప్రదక్షిణలు చేసిన హీరో

Published Sun, Feb 25 2024 11:40 AM

Nayanthara Rejected Bigg Remuneration Movie - Sakshi

సౌత్ ఇండియాలో అత్యధిక పారితోషికం తీసుకునే హీరోయిన్‌లలో నయనతార ఒకరు. ఒక్కో సినిమాకు ఆమె సుమారుగా రూ. 10 నుంచి 15 కోట్ల వరకు రెమ్యునరేషన్‌ తీసుకుంటారని ప్రచారం ఉంది. అయితే ఆమెకు  రెట్టింపు రెమ్యునరేషన్ ఆఫర్ చేసినప్పటికీ పలు సినిమాలను తిరస్కరించిన సందర్భాలు కూడా ఉన్నాయి. తమిళనాడు వ్యాపార దిగ్గజం లెజెండ్ శరవణన్ సినిమాను నయనతార తిరస్కరించినట్లు ఒక ప్రచారం జరుగుతుంది.

ఆయన హీరోగా నటించిన తొలి చిత్రం 'ది లెజెండ్'. ఈ సినిమా 2022లో విడుదలై బాక్సాఫీస్‌ వద్ద డిజాస్టర్‌గా మిగిలిపోయింది. ఉచితంగా టికెట్లు ఇచ్చినా కూడా సినిమాను ఎవడూ చూడలేని పరిస్థితి. ఈ మూవీకి నిర్మాత కూడా ఆయనే కావడంతో ఎలాంటి ఇబ్బంది లేకుండా పోయింది. ఇందులో బాలీవుడ్‌ హీరోయిన్‌ ఊర్వశి రౌటెలా ఆయనకు జోడీగా నటించింది. కానీ ఆయన మొదట తన సినిమాలో హీరోయిన్‌గా నయనతార ఉంటే బాగుంటుందని ముచ్చట పడ్డారట. తన సినిమాలో కథానాయికగా ఉండాలని నయనతారను ఒప్పించేందుకు ఆయన చేసిన ప్రయత్నాలు ఇప్పుడు అందరి దృష్టినీ ఆకర్షిస్తున్నాయి.

నయనతార ఇంటి ముందు ఎప్పుడూ రోల్స్‌ రాయిస్‌ కారు ఉండేదట.. ఆ కారు ఎవరిదో కాదట లెజెండ్‌ హీరో శరవణన్‌దే.. తన సినిమాలో హీరోయిన్‌గా నటించాలని పలుమార్లు ఆయన నయనతార ఇంటికి వెళ్లేవారట.. చెన్నైలో నయనతార ఉండే ప్రాంతం చాలా సెక్యూరిటితో నిండి ఉంటుందట.. అక్కడ ఎక్కువగా వీవీఐపీలు ఉండటంతో భారీగా భద్రతా వ్యవస్థ ఉంటుంది. అన్ని దాటుకుని ఆయన నయనతారతో మాట్లాడేందకు వెళ్లే వారట.. తన తొలి చిత్రంలో నయనతార జోడీగా నటించాలని ఆయన తీవ్రంగా కోరుకున్నారు.

అందు కోసం ఆమెకు డబుల్‌ రెమ్యునరేషన్‌ ఇస్తానని ఆఫర్‌ చేశారట.. అందుకు నయనతార నో చెప్పి.. రూ. 10 కోట్లు కాదు వంద కోట్లు ఇచ్చినా నేను నటించనని డైరెక్ట్‌గానే చెప్పేసిందట.. ఆ కోపంలోనే బాలీవుడ్ హీరోయిన్‌ ఊర్వశి రౌటేలాను శరవణన్‌ తీసుకొచ్చారని ప్రచారం ఉంది. బాలీవుడ్‌లో ఆమె తక్కువ రెమ్యునరేషన్‌ తీసుకుంటుంది.. కానీ లెజెండ్‌ సినిమా కోసం ఆమెకు భారీ మొత్తంలో శరవణన్‌ చెల్లించారట.

ఎవరీ శరవణన్‌..?
చెన్నైలో ఆయనొక బిగ్‌ బిజినెస్‌మేన్‌.. శరవణ స్టోర్స్‌ అంటే తమిళనాడులో ఈ పేరు వినని వారు లేరంటే అతిశయోక్తి కాదు. టెక్స్‌టైల్స్‌, జ్యువెలరీ స్టోర్స్‌తో పాటు, ఎలక్ట్రానిక్‌ ఉత్పత్తులు, నగలు ఇలా శరవణ స్టోర్స్‌లో దొరకనిదంటూ ఏమీ లేదు. ఈ రిటైల్‌స్టోర్స్‌ వ్యవస్థాపకుల్లో ఒకరైన శరవణన్‌ సెల్వరత్నమ్‌ కుమారుడే అరుళ్‌ శరవణన్‌. చిన్నప్పటి నుంచి నటించాలని కోరికతో ఆయన ఒక సినిమాను తీశారు. అందుకోసం చెన్నైలోని అడయార్‌ ఫిల్మ్‌ ఇనిస్టిట్యూట్‌లో కోర్సు కూడా పూర్తి చేశారు. ఆయన కేవలం వ్యాపారవేత్త మాత్రమే కాదు, మోడల్‌గానూ రాణించాడు. ‘శరవణ స్టోర్స్‌’కు ఆయనే బ్రాండ్‌ అంబాసిడర్‌గా వ్యవహరిస్తున్నారు.

Advertisement
 
Advertisement
 
Advertisement