Sakshi: Telugu Breaking News | Latest Telugu News | తెలుగు వార్తలు | Online Telugu News Today
Sakshi News home page

Top Stories

Advertisement

ప్రధాన వార్తలు

పోలింగ్‌ రోజున నరసరావుపేటలో వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే గోపిరెడ్డి ఇంటిపై దాడి చేసి కార్లను  ధ్వంసం చేస్తున్న టీడీపీ గూండాలు..  (ఇన్‌సెట్‌లో) సర్వశ్రేష్ఠ త్రిపాఠి
కూటమి సేవలో 'ఘనాపాఠి'

సాక్షి, అమరావతి: సర్వ శ్రేష్ఠుడు అంటే అందరికంటే సమర్థుడు అని అర్థం. కానీ ఆ సమర్థత విధి నిర్వహణలో కాకుండా చంద్రబాబు కుట్రలకు వత్తాసు పలకడంలో చూపించిన ఘనాపాఠి గుంటూరు ఐజీ సర్వ శ్రేష్ఠ త్రిపాఠి! ఎన్నికల సందర్భంగా పల్నాడులో టీడీపీ మూకలు బరితెగించి సాగించిన విధ్వంసకాండకు ఆయన వెన్నుదన్నుగా నిలిచారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలు, మహిళలు ఓటింగ్‌లో పాల్గొనకుండా భయానక వాతావరణం సృష్టించిన టీడీపీ గూండాలకు పోలీసు లాఠీని అందించారు. వైఎస్సార్‌సీపీ ఏజెంట్లు పోలింగ్‌ బూత్‌లలో లేకుండా దాడులకు తెగబడ్డ పచ్చ ముఠాలకు ఈ ఖాకీ కొమ్ము కాశారు. పోలింగ్‌ అక్రమాలకు పాల్పడ్డ టీడీపీ రౌడీమూకలు రోడ్లపై దర్జాగా తిరుగుతున్నా వారిని అరెస్ట్‌ చేయకుండా పోలీసు యంత్రాంగం చేతులు కట్టేశారు. ఓట్ల లెక్కింపు రోజు టీడీపీ గూండాలు మరోసారి అరాచకం సృష్టించేందుకు రంగం సిద్ధం చేయిస్తు­న్నారు. ఎన్నికల అక్రమాలకు సహకారం అందించేందుకు చంద్రబాబు, పురందేశ్వరి పక్కా పన్నాగంతో పల్నాడులో ప్రవేశపెట్టిన ఐజీ సర్వశ్రేష్ఠ త్రిపాఠి వారి­ద్దరి నమ్మకాన్ని వమ్ము చేయలేదనే ఏకాభిప్రాయం వ్యక్తమవుతోంది. పోలీసు వ్యవస్థ రాజకీయ బురద పులుముకుంటే ప్రజాస్వామ్యానికి ఎంత చేటు కలుగుతుందో చెప్పేందుకు ఈ ‘పచ్చ’ ఖాకీ కథే నిదర్శనం!పోలింగ్‌కు ముందు పల్నాడులో పచ్చ జట్టు పల్నాడులో టీడీపీ పరిస్థితి దయనీయంగా ఉందని గుర్తించిన చంద్రబాబు ఎన్నికల షెడ్యూల్‌ విడుదల కాగానే కుట్రకు తెరతీశారు. ఉమ్మడి గుంటూరు జిల్లాలో ప్రశాంతంగా పోలింగ్‌ నిర్వహణకు పూర్తిస్థాయిలో సన్నద్ధమైన పోలీసు అధికారులను లక్ష్యంగా చేసుకుని పావులు కదిపారు. గుంటూరు డీఐజీ పాలరాజు, పల్నాడు ఎస్పీ శివశంకర్‌రెడ్డితోపాటు క్షేత్రస్థాయిలో కీలకమైన డీఎస్పీలు, సీఐలపై అసత్య ఆరోపణలతో ఎన్నికల కమిషన్‌(ఈసీ)కి ఫిర్యాదులు చేశారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి ద్వారా కథ నడిపించారు. టీడీపీ ఆరోపణలు చేసిన పోలీసు అధికారులపైనే ఆమె ఫిర్యాదు చేయడం గమనార్హం. అంతేకాదు.. ఆ అధికారుల స్థానాల్లో ఎవర్ని నియమించాలో సూచిస్తూ ఆమె ఏకంగా జాబితా సమర్పించడం గమనార్హం. అంటే ఈసీ అధికార పరిధిలో పురందేశ్వరి జోక్యం చేసుకున్నట్లు స్పష్టమవుతోంది. టీడీపీ, బీజేపీ ఒత్తిడికి ఈసీ తలొగ్గినట్టు అనంతరం పరిణామాలు స్పష్టం చేస్తున్నాయి. రాజకీయ ఒత్తిళ్లతో గుంటూరు డీఐజీ పాలరాజు, పల్నాడు ఎస్పీ రవిశంకర్‌రెడ్డిని ఈసీ ఆకస్మికంగా బదిలీ చేసింది. వారి స్థానాల్లో టీడీపీ అనుకూలురైన పోలీసు అధికారులు నియమితులయ్యారు. గుంటూరు ఐజీగా సర్వశ్రేష్ఠ త్రిపాఠీ, ఎస్పీగా గరికపాటి బిందు మాధవ్‌ బాధ్యతలు చేపట్టారు.జాబితా పంపిన నిమ్మగడ్డ, వర్లచంద్రబాబుకు నమ్మిన బంటు అయిన వివాదాస్పద ఐపీఎస్‌ అధికారి ఏబీ వెంకటేశ్వరరావుకు ఐజీ సర్వశ్రేష్ఠ త్రిపాఠి అత్యంత సన్నిహితుడు. ఎస్పీగా నియమించిన గరికపాటి బిందు మాధవ్‌ నరసరావుపేట టీడీపీ ఎంపీ అభ్యర్థి లావు శ్రీకృష్ణదేవరాయులుకు బంధువు. ఐజీగా రాగానే త్రిపాఠి టీడీపీ కుట్రలను అమలు చేశారు. పోలింగ్‌కు కేవలం రెండు రోజుల ముందు మాచర్ల టౌన్‌ సీఐ పి.శరత్‌బాబు, కారంపూడి సీఐ చిన్నమల్లయ్య, గురజాల సీఐ పల్లపురాజు, ఎస్సై ఎం.రామాంజనేయులును బదిలీ చేయడం గమనార్హం. వారి స్థానాల్లో నియమించాల్సిన అధికారుల జాబితాను సైతం ఆయనే పంపించారు. చంద్రబాబుకు అత్యంత సన్నిహితుడైన మాజీ ఎస్‌ఈసీ నిమ్మగడ్డ రమేష్, టీడీపీ అధికార ప్రతినిధి వర్ల రామయ్య ఇచ్చిన జాబితాలనే ఆయన పంపడం గమనార్హం. టీడీపీకి అనుకూలురైన కోటేశ్వరరావు మాచర్ల టౌన్‌ సీఐగా, కారంపూడి సీఐగా నారాయణస్వామి నియమితులయ్యారు. రెంటచింతల మండలానికి చెందిన నారాయణస్వామి టీడీపీ గురజాల ఎమ్మెల్యే అభ్యర్థి యరపతినేని శ్రీనివాసరావుకు సన్నిహితుడు.పోలీసులను కట్టడి చేసి..పల్నాడు అంతా టీడీపీ అనుకూల పోలీసు అధికారుల ద్వారా తమ గుప్పిట్లోకి వచ్చిన తరువాత చంద్రబాబు తన రెండో దశ కుట్రను అమలు చేశారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ముస్లిం, పేద వర్గాలకు చెందిన ఓటర్లను బెంబేలెత్తించి వారు ఓట్లు వేయకుండా అడ్డుకోవాలన్న పచ్చ పన్నాగానికి ఐజీ త్రిపాఠి కొమ్ము కాశారు. జిల్లాలో డీఎస్పీలు, సీఐలు, ఎస్సైలు తనకు చెప్పకుండా కాలు కదపటానికి వీల్లేదని ఆదేశించారు. ఎక్కడైనా హింసాత్మక సంఘటనలు జరుగుతున్నట్లు సమాచారం అందినా సరే తాను అనుమతిస్తేనే వెళ్లాలని స్పష్టం చేశారు. టీడీపీ మూకలు దౌర్జన్యాలకు పాల్పడ్డ ప్రాంతాల వైపు పోలీసులు కన్నెత్తి చూడకుండా ఉండేందుకే త్రిపాఠి ఇలా వ్యవహరించినట్లు స్పష్టమవుతోంది.అరాచకాలకు అండదండలు⇒ పోలింగ్‌కు మూడు రోజుల ముందు మాచర్ల వైఎస్సార్‌సీపీ అభ్యర్థి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి సతీమణి, మాజీ ఎంపీపీ వెల్దుర్తిలో ప్రచారం నిర్వహిస్తుండగా టీడీపీ మూకలు దాడి చేసి తీవ్రంగా గాయపరిచాయి. విధి నిర్వహణలో ఉన్న ఎస్సై, కానిస్టేబుళ్లపై కూడా పచ్చమూకలు దాడి చేయడం గమనార్హం. దీనిపై వైఎస్సార్‌సీపీ నేతలు ఫిర్యాదు చేసినా పోలీసులు పట్టించుకోలేదు. దాడికి పాల్పడిన వారిని కనీసం స్టేషన్‌కు పిలిచి కూడా మాట్లాడలేదు.⇒ నరసరావుపేట టీడీపీ ఎంపీ అభ్యర్థి లావు శ్రీకృష్ణదేవరాయలు విద్యా సంస్థలకు చెందిన బస్సులో టీడీపీ కార్యకర్తలు హోలోగ్రామ్‌లు ముద్రించిన ఓటర్ల స్లిప్పులు, డబ్బులు తరలిస్తుండగా పోలీసులు పట్టుకున్నారు. ఐజీ త్రిపాఠి ఆదేశాలతో వాటిని జప్తు చేయకుండా వదిలేశారు. ⇒ పోలింగ్‌కు రెండు రోజుల ముందు అంటే మే 11న రెంటచింతలలో టీడీపీ వర్గీయులతో సమావేశమైన సీఐ నారాయణస్వామి.. ఎన్నికల్లో అక్రమాలకు పాల్పడినా తాము పట్టించుకోబోమని భరోసానిచ్చారు. అదే రోజు కారంపూడి మండల వైఎస్సార్‌సీపీ జేసీఎస్‌ కన్వీనర్‌ వెంకటేశ్వరరెడ్డిని ఆయన కాలితో తన్నారు. వెంకటపల్లిలో టీడీపీ వర్గీయులు వైఎస్సార్‌సీపీ కార్యకర్తలపై దాడి చేసినట్లు సమాచారం అందినా ఒక్క కానిస్టేబుల్‌ను అక్కడకు పంపారు. అనంతరం ఆయనే ఆ గ్రామానికి వెళ్లి బాధితుడైన మహేశ్‌ను ఓ విద్యుత్‌ స్తంభానికి కట్టేసి కొట్టారు. ⇒ మే 12న సీఐ నారాయణస్వామి టీడీపీ వర్గీయులతో కలసి రెంటచింతల వెళ్లారు. దాదాపు 200 మంది టీడీపీ కార్యకర్తలు వైఎస్సార్‌సీపీకి చెందిన మోర్తల ఉమామహేశ్వరరెడ్డి, ఆయన అనుచరులపై దాడికి తెగబడ్డా నిలువరించే ప్రయత్నం చేయలేదు. ఐజీ త్రిపాఠి ఆదేశాలతో ఉదాశీనంగా వ్యవహరించారు. తద్వారా దాడులకు తెగబడ్డా, ఓటర్లను బెదిరించినా పట్టించుకోబోమని టీడీపీ శ్రేణులకు సంకేతాలిచ్చారు.కుట్రలకు సహకారం..కీలకమైన పోలింగ్‌ రోజు ఐజీ సర్వశ్రేష్ఠ త్రిపాఠి తానో పోలీస్‌ ఉన్నతాధికారిననే విషయాన్ని విస్మరించి టీడీపీ కార్యకర్త తరహాలో చెలరేగిపోయారు. పోలింగ్‌ ప్రశాంతంగా నిర్వహించాల్సిన ఆయన ఓ వర్గానికి వత్తాసు పలికారు. స్వయంగా పల్నాడులో తిష్ట వేసి మరీ టీడీపీ రిగ్గింగ్‌కు కొమ్ము కాయడం విభ్రాంతి కలిగిస్తోంది. మాచర్లలోని కేసీపీ సిమెంట్స్‌ గెస్ట్‌ హౌస్, జిల్లా కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌ కేంద్రంగా టీడీపీ కుట్రలకు సంపూర్ణ సహకారం అందించారు. ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి స్వగ్రామం కండ్లకుంటతోపాటు పరిసర గ్రామాల్లో టీడీపీ ఏజెంట్లను ఐజీ త్రిపాఠీనే నియమించడం గమనార్హం. అంతేకాదు.. ఆయనతోపాటు ఎస్పీ బిందుమాధవ్‌ ఆ గ్రామాల్లోనే ఉన్నారు. ఒక అదనపు ఎస్పీ, ఒక ట్రైనీ ఐపీఎస్, డీఎస్పీ, ఇద్దరు సీఐలను అక్కడ నియమించారు. అదే త్రిపాఠీకి టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి జూలకంటి బ్రహ్మారెడ్డి స్వగ్రామం వెల్దుర్తిలో అన్ని పార్టీల ఏజెంట్లు ఉన్నారో లేదో చూడాలని కూడా అనిపించలేదు.రిగ్గింగ్‌ నిరోధించాలని పిన్నెల్లి మొర పెట్టుకున్నా.. టీడీపీ వర్గీయులు కొత్తూరు, కంభంపాడు, భైరవునిపాడు, రెంటాల, జెట్టిపాలెం, పాల్వాయి గేటు, గోలి, మిట్టగుడిపాడు, కారంపూడి, ఒప్పిచర్ల, పేట సన్నెగండ్ల, చింతపల్లి, ముటుకూరు, అడిగొప్పుల, పోలేపల్లి, వెల్దుర్తి, లోయపల్లి, వజ్రాలపాడు, గొట్టిపాడు, నర్సపెంట గ్రామాల్లో రిగ్గింగ్‌కు కుట్ర చేస్తున్నట్లు వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి హైకోర్టును ఆశ్రయించారు. ఆ 20 గ్రామాల్లో సక్రమంగా పోలింగ్‌ జరిగేలా పోలీసులను ఆదేశించాలని కోరారు. ఆ కాపీని ఐజీ త్రిపాఠీకి అందచేసి టీడీపీ రిగ్గింగ్‌కు పాల్పడకుండా కట్టడి చేయాలని కోరినా నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించారు. వెల్దుర్తితోపాటు ఆ 20 గ్రామాల్లో వైఎస్సార్‌సీపీ ఏజెంట్లపై టీడీపీ గూండాలు దాడి చేసి చితకబాది బూత్‌ల నుంచి వెళ్లగొట్టినా స్పందించలేదు. టీడీపీ రౌడీమూకలు ఆరు కేంద్రాల్లో ఈవీఎంలను ధ్వంసం చేశాయి. దీనిపై సమాచారం అందినా ఆ పోలింగ్‌ కేంద్రాల వద్దకు ఒక డీఎస్పీని కూడా పంపలేదు. త్రిపాఠి ఆ పోలింగ్‌ కేంద్రాలను కనీసం సందర్శించ లేదు.పదేపదే ఫోన్లు చేసినా..పల్నాడు అంతటా టీడీపీ శ్రేణులు దాడులు, దౌర్జన్యాలకు పాల్పడినా పట్టించుకోవద్దని సంకేతాలిచ్చి ఐజీ త్రిపాఠి పోలీసుల చేతులు కట్టేశారు. అదే అదనుగా అల్లరి మూకలు కర్రలు, కత్తులు, రాడ్లు పట్టుకుని స్వైర విహారం చేస్తున్నా పోలీసు యంత్రాంగం చోద్యం చూస్తుండి పోయింది. పోలింగ్‌ రోజు ఉదయం 9 గంటలలోపే యథేచ్చగా రిగ్గింగ్‌ పాల్పడాలన్న టీడీపీ కుట్రకు త్రిపాఠి కొమ్ము కాశారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ముస్లిం వర్గాలు అత్యధికంగా ఉన్న పోలింగ్‌ బూత్‌ల వద్ద టీడీపీ విధ్వంసకాండ సృష్టించింది. మాచర్ల, రెంటచింతల, వెల్దుర్తి, కారంపూడి, దుర్గి, గురజాల, నరసరావుపేట, సత్తెనపల్లి, వినుకొండ, పెదకూరపాడు... ఇలా పల్నాడు అంతటా పచ్చ ముఠాలు బరితెగించి అక్రమాలకు పాల్పడ్డాయి. పోలింగ్‌ బూత్‌లలో వైఎస్సార్‌సీపీ ఏజెంట్లపై దాడి చేసి బయటకు వెళ్లగొట్టినా, ఓటర్లను బెదిరించి పోలింగ్‌ కేంద్రాలకు రాకుండా అడ్డుకున్నా, టీడీపీ కార్యకర్తలు రిగ్గింగ్‌ చేస్తున్నా పోలీసులు మౌనముద్ర దాల్చారు. దీనిపై ఐజీ త్రిపాఠి, ఎస్పీ బిందు మాధవ్‌లకు వైఎస్సార్‌సీపీ నేతలు పదేపదే ఫోన్లు చేసినా పట్టించుకోలేదు. దీంతో ఎన్నికల కమిషన్, ఇతర ఉన్నతాధికారులకు ఫోన్ల మీద ఫోన్లు చేయడంతో ఉదయం 9 గంటల తరువాత వైఎస్సార్‌సీపీ పోలింగ్‌ ఏజెంట్లను అనుమతించారు.కౌంటింగ్‌ రోజు అక్రమాలకు అభయం!ఐజీ సర్వశ్రేష్ఠ త్రిపాఠి దన్నుతో పల్నాడులో భయానక వాతావరణం సృష్టించిన పచ్చ ముఠాలు ఓట్ల లెక్కింపు రోజైన జూన్‌ 4న మరోసారి దాడులకు తెగబడాలని పథకం రచిస్తున్నాయి. కౌంటింగ్‌ కేంద్రాల వద్ద వైఎస్సార్‌సీపీ నేతలు, కార్యకర్తలు లేకుండా చేసి ఓట్ల లెక్కింపులో అక్రమాలకు పాల్పడాలని పన్నాగం వేశాయి. దీనిపై నిఘా వర్గాలు స్పష్టమైన నివేదిక ఇచ్చినా ఐజీ త్రిపాఠి నిర్లిప్తంగా వ్యవహరించడం అనుమానాలకు తావిస్తోంది. పోలింగ్‌ సందర్భంగా దాడులకు పాల్పడిన రౌడీమూకలను ఇప్పటివరకు గుర్తించకపోవడం గమనార్హం. పల్నాడు జిల్లాలో 581 మంది దాడుల్లో పాల్గొన్నట్టు నిర్థారించగా ఇప్పటివరకు 274 మందినే గుర్తించారు. మరో 307 మందిని ఇంతవరకు గుర్తించలేదు. వీరిలో అత్యధికంగా మాచర్ల నియోజకవర్గానికి చెందినవారే 245 మంది ఉండటం ఆందోళన కలిగిస్తోంది. నరసరావుపేట నియోజకవర్గానికి చెందినవారు 62 మంది ఉన్నారు. ఇప్పటివరకు గుర్తించిన వారిలో కేవలం 19 మందినే పోలీసులు అరెస్ట్‌ చేశారు. వీరంతా గురజాల నియోజకవర్గానికి చెందినవారే. మాచర్ల, నరసరావుపేట నియోకజవర్గాల్లో పోలింగ్‌ రోజు దాడులకు పాల్పడ్డ వారిలో ఒక్కరిని కూడా అరెస్ట్‌ చేయలేదంటే ఐజీ త్రిపాఠి నేతృత్వంలో పోలీసు యంత్రాంగం ఎంత చేష్టలుడిగి చూస్తోందో అర్థమవుతోంది. టీడీపీ గూండాల దాడులపై వీడియోలతో స్పష్టమైన ఆధారాలున్నా అరెస్ట్‌ చేయకపోవడం వెనుక టీడీపీ ఒత్తిళ్లు ఉన్నట్లు వెల్లడవుతోంది. ఓట్ల లెక్కింపు రోజు వరకూ ఆ నిందితులను అదుపులోకి తీసుకోకూడదన్నది పోలీసుల ఉద్దేశంగా ఉంది. తద్వారా మరోసారి దాడులు, దౌర్జన్యాలతో భయానక పరిస్థితి సృష్టించేందుకు పోలీసు యంత్రాంగం కొమ్ము కాస్తున్నట్లు స్పష్టమవుతోంది.

AP High Court protection for those candidates Until June 6th 2024
ఆ అభ్యర్థులకు హైకోర్టు రక్షణ

సాక్షి, అమరావతి: ఎన్నికల బరిలో నిలిచిన పలువురు అభ్యర్థులకు హైకోర్టు పోలీసుల అరెస్టు నుంచి రక్షణ కల్పించింది. హైకోర్టును ఆశ్రయించిన అభ్యర్థులను జూన్‌ 6వ తేదీ వరకు అరెస్టు చెయ్యొద్దని పోలీసులను ఆదేశించింది. దీంతో వారికి హైకోర్టు మధ్యంతర ముందస్తు బెయిల్‌ మంజూరు చేసినట్లయింది. ఈ సందర్భంగా హైకోర్టు పలు షరతులు విధించింది. కౌంటింగ్‌ ముగిసే వరకు తాడిపత్రిలో ఉండరాదని.. తాడిపత్రి బయట ఉండాలని జేసీ అస్మిత్‌రెడ్డి, కేతిరెడ్డి పెద్దారెడ్డి, స్వతంత్ర అభ్యర్థి సోమశేఖర నాయుడులను హైకోర్టు ఆదేశించింది. నలుగురు కంటే ఎక్కువ మందితో తిరగరాదని.. ఎలాంటి నేరపూరిత చర్యలకు పాల్పడరాదని అస్మిత్‌రెడ్డి, పెద్దారెడ్డిలతో సహా మిగిలిన అభ్యర్థులైన పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి, చింతమనేని ప్రభాకర్‌ తదితరులనూ ఆదేశించింది. పోలీసులు ఎన్నికల సంఘం నియంత్రణలో పనిచేస్తున్నారని, అందువల్ల అభ్యర్థుల కదలికలపై నిరంతరం నిఘా పెట్టాలని ప్రధాన ఎన్నికల అధికారికి స్పష్టంచేసింది. అంతేకాక.. ఆయా కేసులకు సంబంధించి సాక్షులను ప్రభావితం చేయడంగానీ.. దర్యాప్తులో జోక్యం చేసుకోవడంగానీ చేయరాదని ఆదేశించింది. కేసు పూర్వాపరాల ఆధారంగా ఎలాంటి అభిప్రాయం వ్యక్తంచేయడం లేదన్న హైకోర్టు, ఈ వ్యాజ్యాల్లో పూర్తి వివరాలతో కౌంటర్లు దాఖలు చేయాలని పోలీసులను ఆదేశించింది. తదుపరి విచారణను జూన్‌ 6కి వాయిదా వేసింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్‌ ప్రతాప వెంకట జ్యోతిర్మయి గురువారం రాత్రి మధ్యంతర ఉత్తర్వులు జారీచేశారు.అరెస్టుకు అవకాశం ఉంది.. మధ్యంతర ముందస్తు బెయిల్‌ ఇవ్వండి..ఎన్నికల సందర్భంగా జరిగిన గొడవలకు సంబంధించి నమోదైన కేసుల్లో పోలీసులు తమను అరెస్టుచేసే అవకాశముందని, అందువల్ల తమకు మధ్యంతర ముందస్తు బెయిల్‌ మంజూరు చేయాలంటూ వైఎస్సార్‌సీపీకి చెందిన మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, నర్సరావుపేట ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి, తాడిపత్రి ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి, తాడిపత్రి టీడీపీ అభ్యర్థి జేసీ అస్మిత్‌రెడ్డి, దెందులూరు టీడీపీ అభ్యర్థి చింతమనేని ప్రభాకర్‌లతో పలువురు స్వతంత్ర అభ్యర్థులు హైకోర్టులో వేర్వేరుగా పిటిషన్లు దాఖలు చేశారు. వీటిపై జస్టిస్‌ వెంకట జ్యోతిర్మయి విచారణ జరిపారు. పిటిషనర్ల తరఫున సీనియర్‌ న్యాయవాదులు టి. నిరంజన్‌రెడ్డి, పి.వీరారెడ్డి, ఓ.మనోహర్‌రెడ్డి, పోసాని వెంకటేశ్వర్లు, న్యాయవాదులు ఎస్‌.రామలక్ష్మణరెడ్డి, చుక్కపల్లి భానుప్రకాశ్‌.. పోలీసుల తరఫున పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ (పీపీ) యర్రంరెడ్డి నాగిరెడ్డి తమ తమ వాదనలను వినిపించారు.సుప్రీంకోర్టుకన్నా తామే ఎక్కువని ఈసీ భావిస్తోంది..పిటిషనర్లపై నమోదైన కేసులన్నీ కూడా ఏడేళ్ల కంటే తక్కువ శిక్షపడే కేసులని, అందువల్ల వారికి సీఆర్‌పీసీ సెక్షన్‌ 41ఏ కింద నోటీసులు ఇచ్చి విచారించాల్సి ఉంటుందని నిరంజన్‌రెడ్డి తెలిపారు. అర్నేష్‌కుమార్‌ కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారం ఏడేళ్ల కన్నా తక్కువ శిక్షపడే కేసుల్లో అరెస్టుచేయడానికి వీల్లేదన్నారు. అయితే, ఎన్నికల సంఘం మాత్రం రామకృష్ణారెడ్డిని అరెస్టుచేసి తీరుతామని ప్రకటనలు ఇచ్చిందని తెలిపారు. సుప్రీంకోర్టు కన్నా తామే ఎక్కువన్న విధంగా ఎన్నికల సంఘం వ్యవహరిస్తోందని తెలిపారు. అలాగే, టీడీపీ నేత నారా లోకేశ్‌ ఎక్స్‌ ఖాతాలో పోస్ట్‌చేసిన వీడియో ఆధారంగా ఎన్నికల కమిషన్‌ రామకృష్ణారెడ్డిని అరెస్టు చేయాలని ఆదేశించిందన్నారు. వాస్తవాలు విచారించకుండా ఇలాంటి వీడియోల ఆధారంగా అరెస్టుకు చర్యలు తీసుకోవడం జరిగిందన్నారు. ఇలా వ్యవహరించిన ఉదంతాలు గతంలో ఎక్కడా లేవన్నారు. రెండు రాష్ట్రాలకు చెందిన ఎనిమిది పోలీసు బృందాలు రామకృష్ణారెడ్డి కుటుంబ సభ్యుల వెంటపడ్డాయన్నారు. తాము కౌంటింగ్‌ పూర్తయ్యే వరకు పోలీసుల అరెస్టు నుంచి రక్షణ కోరుతున్నామని సీనియర్‌ న్యాయవాదులు తెలిపారు. ఇప్పుడు అరెస్టుచేస్తే కౌంటింగ్‌ రోజున ఏజెంట్లను నియమించుకునే అవకాశం కూడా ఉండదన్నారు. దీనివల్ల పిటిషనర్లు తీవ్రంగా నష్టపోతారన్నారు. ఈ సమయంలో పీపీ నాగిరెడ్డి జోక్యం చేసుకుంటూ.. మధ్యంతర బెయిల్‌ ఇస్తే మొన్న జరిగిన ఘటనల వంటి వాటిని పునరావృత్తం చేసే అవకాశం ఉందన్నారు. ఒకవేళ మధ్యంతర బెయిల్‌ ఇవ్వాలనుకుంటే షరతులు విధించాలని కోర్టుకు విన్నవించారు. ఎలాంటి ఘటనలు జరిగినా వారినే బాధ్యులుగా చేస్తూ ఉత్తర్వులు ఇవ్వాలని ఆయన కోరారు. అందరి వాదనలు విన్న న్యాయమూర్తి జస్టిస్‌ జ్యోతిర్మయి, హైకోర్టును ఆశ్రయించిన అభ్యర్థులకు పోలీసుల అరెస్టు నుంచి రక్షణ కల్పిస్తూ మధ్యంతర ఉత్తర్వులిచ్చారు. తదుపరి విచారణను జూన్‌ 6వ తేదీకి వాయిదా వేశారు. అప్పటివరకు పిటిషనర్లను అరెస్టు చెయ్యొద్దని పోలీసులను ఆదేశించారు.ఆ పిటిషన్ల విచారణ 30కి వాయిదా..ఇదిలా ఉంటే, ఎన్నికల సమయంలో, ఎన్నికల తరువాత జరిగిన ఘర్షణలపై పోలీసులు నమోదు చేసిన కేసుల్లో తమకు ముందస్తు బెయిల్‌ మంజూరు చేయాలంటూ పలువురు వ్యక్తులు హైకోర్టులో వేర్వేరుగా పిటిషన్లు దాఖలు చేశారు. ఈ వ్యాజ్యాలపై న్యాయమూర్తి తదుపరి విచారణను ఈ నెల 30కి వాయిదా వేశారు.

NIA Chennai office receives threat to assassinate PM Narendra Modi
ప్రధాని మోదీని చంపేస్తాం!.. ఎన్‌ఐఏకి బెదిరింపు కాల్‌

సాక్షి, చెన్నై: ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీని చంపేస్తామంటూ అందిన బెదిరింపు కాల్‌తో చెన్నైలోని జాతీయ దర్యాప్తు విభాగం అప్రమత్తమైంది. చెన్నై పురసైవాక్కంలో ఎన్‌ఐఏ కార్యాలయం ఉంది. బుధవారం రాత్రి ఓ గుర్తు తెలియని వ్యక్తి ఈ కార్యాలయానికి ఫోన్‌ చేసి...ఎన్నికల ప్రచారంలో ప్రధాని మోదీని హతమా రుస్తామంటూ హిందీలో హెచ్చరించాడు. వెంటనే ఎన్‌ఐఏ అధికారులు చెన్నై సైబర్‌క్రైం బ్రాంచిని అప్రమత్తం చేశారు. మధ్యప్రదేశ్‌ నుంచి ఆ కాల్‌ వచ్చిన ట్టుగా తేలడంతో గురువారం ఉదయం ఎన్‌ఐఏ, సైబర్‌ క్రైం బృందాలు భోపాల్‌కు వెళ్లాయి. అదేవిధంగా, చివరి విడత ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్న ప్రధానికి భద్రతను మరింతగా పెంచాలని కూడా యోచిస్తున్నట్లు సమాచారం.

జనవరి 31న ఎల్బీ స్టేడియంలో నియామక పత్రాలు  అందుకున్న ఆనందంలో నర్సింగ్‌ ఆఫీసర్లు
కొలువు సరే.. జీతాలేవీ?

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం ఏర్పడగానే మొదటగా చేపట్టిన నియామకం నర్సింగ్‌ ఆఫీసర్‌ (స్టాఫ్‌ నర్స్‌) పోస్టుల భర్తీ. ఎల్బీ స్టేడియంలో జనవరి 31వ తేదీన అట్టహాసంగా నిర్వహించిన కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి చేతుల మీదుగా వారికి నియామక పత్రాలు అందజేశారు. తర్వాత వారంతా తమకు కేటాయించిన ఆస్పత్రుల్లో విధుల్లో చేరిపోయారు. మూడు నెలలుగా ఆస్పత్రుల్లో రేయింబవళ్లు డ్యూటీలు చేస్తున్నారు. కానీ వారికి ఇప్పటివరకు ఒక్కపైసా వేతనం అందలేదు. తొలి జీతం అందుకుని సంతోషంతో కుటుంబ సభ్యులకు స్వీట్లు పంచుకునే పరిస్థితి కూడా లేకుండా పోయింది. ఈ పోస్టులకు ఎంపికైవారిలో చాలా మంది వారి స్వస్థలాల్లో కాకుండా ఇతర ప్రాంతాల్లోని ఆస్పత్రుల్లో నియామకం అయ్యారు. అద్దె ఇళ్లలో ఉంటున్నారు. వారికి మూడు నెలలుగా వేతనాలు రాకపోవడంతో.. అద్దె కూడా చెల్లించలేక అవస్థలు పడుతున్నారు. ప్రభుత్వ నిర్లక్ష్యం, అధికారుల నిర్లిప్తత వల్లే తమకు వేతనాలు అందడం లేదని.. నర్సింగ్‌ ఆఫీసర్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎన్నిసార్లు విన్నవించినా ఎవరూ పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మొత్తం 6,956 మంది నర్సింగ్‌ ఆఫీసర్లు.. గత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం 2022 డిసెంబర్‌ 30వ తేదీన 5,204 నర్సింగ్‌ ఆఫీసర్ల పోస్టులకు నోటిఫికేషన్‌ ఇచ్చింది. గత ఏడాది ఆగస్టు 2న పరీక్ష నిర్వహించింది. 40,936 మంది దరఖాస్తు చేయగా.. 38,674 మంది పరీక్షలు రాశారు. ఫలితాలు వెల్లడించి, నియామకాలు చేపట్టాల్సి ఉన్నా.. ఎన్నికల నేపథ్యంలో ప్రక్రియ ఆగిపోయింది. అసెంబ్లీ ఎన్నికల తర్వాత కొత్తగా ఏర్పాటైన కాంగ్రెస్‌ ప్రభుత్వం డిసెంబర్‌ 15న ఆ నోటిఫికేషన్‌కు మరో 1,890 పోస్టులను కలిపింది. మొత్తంగా డీఎంఈ పరిధిలో 5,650 పోస్టులు, తెలంగాణ వైద్య విధాన పరిషత్‌ పరిధిలో 757, ఎంఎన్‌జే, గురుకులాల్లో మిగతా పోస్టులను సిద్ధం చేశారు. ఫలితాల తర్వాత 6,956 మంది ఉద్యోగాలకు ఎంపికయ్యారు. రాష్ట్రంలోని 26 మెడికల్‌ కాలేజీలు, ఇతర స్పెషాలిటీ ఆస్పత్రులు, జిల్లా ఆస్పత్రులు, ఏరియా ఆస్పత్రులు, కమ్యూనిటీ హెల్త్‌ సెంటర్లలో వారికి పోస్టింగ్‌ ఇచ్చారు. వీరిలో బీసీలు 45.97 శాతం, ఎస్సీలు 30.64 శాతం, ఎస్టీలు 12.81 శాతం మంది ఉన్నారు. ఆర్థోపెడికల్లీ చాలెంజ్డ్‌ కేటగిరీలో అభ్యర్థులు లేకపోవడంతో 138 పోస్టులు భర్తీ కాలేదు. కొత్తగా ఎంపికైన నర్సింగ్‌ ఆఫీసర్‌ పోస్టులకు రూ.36,750– రూ.1,06,990గా పేస్కేల్‌ ఖరారు చేశారు. దీంతోపాటు టీఏ, డీఏ, హెచ్‌ఆర్‌ఏ తదితర అలవెన్సులు ఉంటాయి. కొత్తగా ఎంపికై వారందరికీ కలిపి నెలకు దాదాపు రూ.35 కోట్లు ఖజానా నుంచి చెల్లించాల్సి ఉంటుంది. దొరికిందే చాన్స్‌గా ‘ముడుపుల’ వ్యవహారం వాస్తవానికి డ్యూటీలో చేరిన 15 రోజుల్లోగా నియామక ప్రక్రియ పూర్తికావాలి. కానీ మూడు నెలల తర్వాత కూడా కొన్నిచోట్ల క్లర్కుల స్థాయిలోనే ఫైళ్లు ఆగిపోయాయంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చనే విమర్శలు వస్తున్నాయి. కొన్ని జిల్లాల్లో నర్సింగ్‌ ఆఫీసర్లకు ఎంప్లాయి ఐడీలు కూడా ఇవ్వలేదు. ట్రెజరీలకు వివరాలు పంపలేదు. మూడు నెలలుగా వేతనాలు రాక నర్సింగ్‌ ఆఫీసర్లు ఇబ్బంది పడుతుంటే.. కిందిస్థాయి సిబ్బంది ‘ముడుపులు’ అందితేనే ఫైల్‌ కదులుతుందని డిమాండ్‌ చేస్తున్నట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి. కొన్ని జిల్లాల్లో ఐడీ, ప్రాన్‌ కార్డుల కోసం హెచ్‌ఓడీ, డీఎంహెచ్‌ఓ ఆఫీసు స్టాఫ్‌ డబ్బులు అడుగుతున్నారని ఓ నర్సింగ్‌ ఆఫీసర్‌ వాపోయారు. ముడుపులు ఇచ్చినోళ్ల వివరాలను మాత్రమే ట్రెజరీకి పంపుతున్నారని అంటున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం, వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ స్పందించి.. తమకు వెంటనే వేతనాలు అందేలా చూడాలని నర్సింగ్‌ ఆఫీసర్లు కోరుతున్నారు. వేతనాలు వెంటనే ఇవ్వాలి.. కొత్తగా నియమితులైన నర్సింగ్‌ ఆఫీసర్లకు ప్రభుత్వం ఇప్పటివరకు వేతనాలు ఇవ్వలేదు. ప్రభుత్వం తక్షణమే స్పందించి వేతనాలు మంజూరు చేయాలని వైద్యారోగ్యశాఖ ముఖ్య కార్యదర్శికి వినతిపత్రం ఇచ్చాం. శాశ్వత పద్ధతిలో నియమితులైన వారందరికీ వేతనాలు, గుర్తింపు కార్డులు త్వరగా ఇవ్వాలి.. – వి.మరియమ్మ, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, తెలంగాణ నర్సెస్‌ అసోసియేషన్‌ ప్రభుత్వం నుంచి ఆమోదం రావాలి మొదటిసారి శాలరీలు డ్రా చేయాలంటే అందరూ చేరేంతవరకు ఆగాల్సి ఉంటుంది. నర్సింగ్‌ ఆఫీసర్లు అంతా చేరడానికి ఫిబ్రవరి వరకు పట్టింది. తర్వాత వాళ్ల నుంచి 27 కాలమ్స్‌ డేటా సేకరించాలి. కానీ ఆ డేటాను అందరూ ఇవ్వడం లేదు. కొందరు పాన్‌కార్డు లేదంటారు. అంతేకాదు ప్రతీ దానికి ఒక డాక్యుమెంట్‌ కావాలి. వివరాలన్నీ ఒకేసారి పట్టుకొని రావాలని ట్రెజరీ అధికారులు అంటున్నారు. ఇవన్నీ అందజేస్తే అప్పుడు నర్సింగ్‌ ఆఫీసర్లకు ఎంప్లాయీ ఐడీ ఇస్తారు. ఐడీ వచ్చాక ముంబై నుంచి ప్రాన్‌ నంబర్‌ తెప్పించాలి. చాలా మంది వివరాలు సరిగా ఇవ్వలేదు. దాంతో ఆలస్యం అవుతోంది. సప్లిమెంటరీ బిల్లులు తొందరగా పాస్‌ కావు. రెగ్యులర్‌ బిల్లు అయితే ప్రభుత్వం వెంటనే జీతాలు వేస్తుంది. ఇప్పుడు నర్సింగ్‌ ఆఫీసర్లది సప్లిమెంటరీ బిల్లు కావడం వల్లే ఈ సమస్య. – డాక్టర్‌ వాణి, డీఎంఈ 3 నెలలైనా ప్రక్రియ పూర్తి చేయక.. నర్సింగ్‌ ఆఫీసర్ల నియామక ప్రక్రియను ప్రజారోగ్య సంచాలకుల కార్యాలయం పర్యవేక్షించాలి. అభ్యర్థులు తమ నియామక పత్రాలను సంబంధిత ఆస్పత్రి సూపరింటెండెంట్, డీ ఎంహెచ్‌వోకు అందజేస్తే.. వారికి సర్వీస్‌ నిబంధనల ప్రకారం.. ఎంప్లాయ్‌ ఐడీ, బ్యాంక్‌ ఖాతా కేటాయిస్తారు. ఆ వివరాలను ప్రజారోగ్య సంచాలకుల కార్యాలయానికి, అక్కడి నుంచి నర్సింగ్‌ విభాగానికి పంపి అప్‌డేట్‌ చేస్తారు. అప్పటి నుంచీ ప్రభుత్వ ఉద్యోగిగా గుర్తింపు లభిస్తుంది. అయితే 3 నెలలైనా ఈ ప్రక్రియ పూర్తి కాలేదు. ఉన్నతాధికారుల నిర్లక్ష్యం, కిందిస్థాయి అధికారుల అవినీతితోనే జాప్యం జరుగుతోందనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.

కారంపూడిలో  టీడీపీ మూక దాడిలో కాలిపోతున్న బైక్‌లు (ఫైల్‌)
పచ్చమూక అరాచకం.. ఆనవాళ్లివిగో..

సాక్షి, నరసరావుపేట: పోలింగ్‌ రోజు, ఆ తర్వాత టీడీపీ నేతలు పల్నాడులో విధ్వంసం సృష్టించారు. ప్రజాస్వామ్య పద్ధతిలో జరగాల్సిన ఎన్నికల్లో రిగ్గింగ్‌కు పాల్పడ్డారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాల ప్రజలు వైఎస్సార్‌సీపీకి అనుకూలంగా ఉన్నారన్న అక్కసుతో వారిపై దాడులకు తెగబడ్డారు. ఎలాగైనా వారిని ఓటింగ్‌కు దూరం చేసి ఏకపక్షంగా రిగ్గింగ్‌కు పాల్పడేందుకు అరాచకాలు సృష్టించారు. ఓటింగ్‌ తరువాత సైతం బడుగు, బలహీన వర్గాలపై ప్రతాపం చూపారు. బలహీన వర్గాలపై సాగిన వరుస దాడులను అడ్డుకోవాల్సిన పోలీసు యంత్రాంగం పట్టించుకున్న పాపానపోలేదని వైఎస్సార్‌సీపీ నేతలు వాపోతున్నారు. పోలింగ్‌ రోజు, తరువాత పల్నాడులో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలపై దాడుల పరంపర కొనసాగింది. ఓటేసేందుకు వెళ్తున్న ఎస్సీ, ఎస్టీలపై దాడి రెంటచింతల మండలం తుమృకోటలో మే 13న ఓటు వేసేందుకు వెళ్తున్న ఎస్సీ, ఎస్టీ మహిళలపై టీడీపీలోని అగ్రకుల నాయకులు విచక్షణారహితంగా దాడి చేశారు. అప్పటికే క్యూలైన్లలో ఉన్న మహిళల్ని కొట్టడంతోపాటు వారిని బయటకు తరిమేసిన టీడీపీ నేతలు రిగ్గింగ్‌కు పాల్పడ్డారు. పోలింగ్‌ బూత్‌లో ఏజెంట్లను బయటకు గెంటేశారు. వైఎస్సార్‌సీపీకి ఓటు వేస్తున్న మహిళల తలలు పగులగొట్టారు. దీంతో బాధిత మహిళలు ఆర్తనాదాలు చేస్తూ పరుగులు తీశారు. ఆ ఒక్క కులమే గ్రామంలో బతకాలా.. దళితులకు ఓటు వేసే హక్కులేదా అంటూ బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. కాగా.. రెంటచింతల మండల పరిధిలోని గోలి గ్రామంలో వైఎస్సార్‌సీపీకి చెందిన మూఢావత్‌ మల్లయ్య నాయక్, కొండానాయక్, ఆర్‌.నాగేశ్వరరావు నాయక్, నాగేశ్వరరావు నాయక్‌లపై టీడీపీ నేతలు దాడి చేసి గాయపరిచారు. పాలువాయిగేటు బూత్‌లలో అరాచకం పాలువాయిగేటు గ్రామంలో టీడీపీ గూండాలు ఈ నెల 13న ఉదయం 6.30 గంటల సమయంలో ప్రవేశించి గ్రామంలోని 201, 202 పోలింగ్‌ బూత్‌లలో వైఎస్సార్‌సీపీకి చెందిన వారిని ఓటు వేయనివ్వకుండా అడ్డుకున్నారు. ఇక్కడ జరుగుతున్న అరాచకాన్ని వైఎస్సార్‌సీపీ కార్యకర్తలు ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి దృష్టికి తీసుకువెళ్లారు. గ్రామానికి చెందిన టీడీపీ నాయకుడు నంబూరి శేషగిరిరావు బరితెగించి ఓటర్లపై దౌర్జన్యానికి దిగారు. 202 బూత్‌లోకి వెళ్లి ఓటర్లను భయాందోళనకు గురిచేసి రిగ్గింగ్‌కు పాల్పడ్డారు. ఈ విషయాన్ని జిల్లా కలెక్టర్‌ లోతేటి శివశంకర్‌కు, నియోజకవర్గ రిటరి్నంగ్‌ అధికారికి, ఎస్పీ బిందుమాధవ్, జేసీ శ్యామ్‌ప్రసాద్‌ తదితర ఉన్నతాధికారులకు పిన్నెల్లి ఎన్నిసార్లు ఫోన్‌ చేసినా ఎవరూ స్పందించలేదు. ఈ సమయంలో టీడీపీ గూండాలు ఒక్కసారిగా కర్రలు, రాళ్లతో వచ్చి వైఎస్సార్‌సీపీ వర్గీయులపై దాడులకు తెగబడ్డారు. పిన్నెల్లి రామకృష్ణారెడ్డి కుమారుడు గౌతమ్‌రెడ్డి, డ్రైవర్‌ అంజిరెడ్డి, శ్రీను, మరికొందరికి గాయాలయ్యాయి. అక్కడితో ఆగకుండా టీడీపీ వర్గీయులు పిన్నెల్లి కాన్వాయ్‌లోని వాహనాన్ని ధ్వసం చేశారు. ఈ దాడిలో ప్రధాన నిందితుడు నంబూరి శేషగిరిరావు. అతనిపై పోలీసులు ఏ1గా కేసు నమోదు చేశారు. అయితే.. ఆయనేదో ప్రజాస్వామ్యాన్ని రక్షించాడంటూ చంద్రబాబు ఫోన్‌లో పరామర్శించడంపై పాలువాయిగేటు గ్రామ ప్రజలు ఛీదరించుకుంటున్నారు. పోలింగ్‌ ముగిశాక బుడగ జంగాలపైనా దాడి కారంపూడి మండలం పేటసన్నెగండ్ల శివారు బాలచంద్రనగర్‌ (పోతురాజుగుట్ట)లో నివాసం ఉంటున్న బేడ బుడగ జంగాలు తమకు ఓటు వేయలేదని ఆగ్రహించిన టీడీపీకి చెందిన సుమారు 70 మంది పోలింగ్‌ ముగిశాక వారి ఇళ్లపై దాడి చేశారు. కనిపించిన ప్రతి ఒక్కరినీ కర్రలు, రాళ్లతో దాడి చేసి విచక్షణారహితంగా కొట్టారు. మహిళలు, పిల్లలని కూడా చూడకుండా చావబాదారు. ఇళ్లలోని సామాన్లు, చివరకు ఫ్యాన్లు, బల్బులను కూడా పగులగొట్టారు. వైఎస్సార్‌సీపీ నాయకుడు పెల్లూరి కోటయ్యకు చెందిన స్కార్పియో కారును ధ్వంసం చేశారు. గొర్ల సైదులు చేయి, కాలిపై కర్రలతో బాదారు. కత్తెర లక్ష్మి చేయి విరగ్గొట్టారు. రాళ్ల దాడితో పోతురాజుగుట్టలోని వారంతా ప్రాణభయంతో పారిపోయి వేరేచోట తలదాచుకున్నారు. ‘ఏరా.. టీడీపీకి ఓటు వేయకుండా వైఎస్సార్‌సీపీకి ఓట్లు వేస్తారా. నా కొడకల్లారా..’ అంటూ తీవ్రంగా దూషిస్తూ అరాచపర్వాన్ని కొనసాగించారని బాధితులు కన్నీటి పర్యంతమయ్యారు. తాము అధికారంలోకి వచ్చాక మీ అంతు చూస్తామని బెదిరించారన్నారు. ఊరొదిలి పారిపోయిన బడుగు జీవులు గురజాల నియోజకవర్గ పరిధిలోని మాచవరం మండలం కొత్త గణేషునిపాడులో ఎస్సీ, ఎస్టీ, బీసీ సామాజిక వర్గాలకి చెందిన కుటుంబాలు వైఎస్సార్‌సీపీకి అనుకూలంగా ఓట్ల వేశారన్న అక్కసుతో యరపతినేని శ్రీనివాస్‌ వర్గీయులు పక్క గ్రామాల నుంచి పెద్దఎత్తున టీడీపీ రౌడీలు, గూండాలను తీసుకొచ్చి పోలింగ్‌ రోజు రాత్రి దాడులకు పాల్పడ్డారు. వైఎస్సార్‌సీపీ సానుభూతిపరుల్ని లక్ష్యంగా చేసుకుని వారి ఇళ్లపై దాడులకు పాల్పడి ధ్వంసరచన సాగించారు. బైక్‌లు, జేసీబీలు, ఆటోలను, ఇళ్లలోని సామగ్రితోపాటు టీవీలు ఇతర వస్తువులను ధ్వంసం చేశారు. మహిళలు, పిల్లలు అనే కనికరం కూడా లేకుండా బూతులు తిడుతూ భౌతిక దాడులకు పాల్పడ్డారు. ఈ ఘటనతో గ్రామంలోని వైఎస్సార్‌సీపీ నేతలు పొలాల్లోకి పారిపోయి అర్ధరాత్రి బిక్కుబిక్కుమంటూ గడిపారు. మహిళలు, చిన్న పిల్లలు, మహిళలు గంగమ్మ గుడిలో తలదాచుకున్నారని తెలిసి రాళ్లు విసురుతూ భయకంపితుల్ని చేశారు. పోలీసులకు విషయం తెలిసినా గ్రామానికి చేరుకోలేని పరిస్థితి కల్పించారు. ఇప్పటికీ ఆ గ్రామానికి చెందిన బాధితులు అజ్ఞాతంలో ఉండగా, వారిపైనే పోలీసులు కేసులు నమోదు చేయడం కొసమెరుపు. బాధితుల్ని పరామర్శించడానికి వెళ్లిన ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థులు అనిల్‌కుమార్, కాసు మహేష్‌రెడ్డిపై కూడా టీడీపీ మూకలు దాడులకు తెగబడ్డాయంటే వారి అరాచకం ఏ స్థాయిలో ఉందో ఆర్థం చేసుకోవచ్చు. చివరకు పోలీసులు గాల్లోకి కాల్పులు జరిపి నాయకుల్ని గ్రామాలు దాటించాల్సిన భయానక పరిస్థితులు నెలకొన్నాయి. ముప్పాళ్లలో మైనార్టీలపై దాడులు సత్తెనపల్లి నియోజకవర్గ పరిధిలోని ముప్పాళ్ల మండలం తొండపిలో వైఎస్సార్‌సీపీ సానుభూతిపరులైన ముస్లింల ఇళ్లలోకి టీడీపీ సానుభూతిపరులు మూకుమ్మడిగా చొరబడ్డారు. మహిళలను, చిన్నారులను భయబ్రాంతులకు గురిచేస్తూ దాడికి పాల్పడ్డారు. దీంతో గ్రామంలోని పురుషులంతా ప్రాణాలు కాపాడుకునేందుకు పొలాల్లోకి పరుగులు తీశారు. మహిళలు, చిన్నారులు తలుపులు వేసుకొని ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని బిక్కుబిక్కుమంటూ ఇళ్లలోనే ఉండిపోయారు. ముస్లిం వర్గాలకు చెందిన వైఎస్సార్‌సీపీ మద్దతుదారులు గ్రామం వదిలి వెళ్లిపోయారు. కంభంపాడులో విధ్వంసకాండ పెదకూరపాడు నియోజకవర్గం కంభంపాడులో పోలింగ్‌ రోజున వైఎస్సార్‌సీపీకి పట్టున్న ఎస్సీ, బీసీ కాలనీలపై కత్తులు, కర్రలతో టీడీపీ కార్యకర్తలు దాడులకు పాల్పడ్డారు. పోలింగ్‌ కేంద్రాల వద్ద వీరంగం వేశారు. మహిళలపైనా దాడులకు తెగబడ్డారు. వైఎస్సార్‌సీపీ నేత, సర్పంచ్‌ ఆర్తిమళ్ల నాగేశ్వరరావు (నాగయ్య), సతీమణి వైఎస్సార్‌సీపీ ఎంపీటీసీ సభ్యురాలు అంజిమ్మ లక్ష్యంగా టీడీపీ కార్యకర్తలు, నేతలు దాడులకు పాల్పడ్డారు. పలుమార్లు ఎస్సీ, బీసీ కాలనీలకు టీడీపీ రౌడీ మూక వెళ్లి అక్కడ ప్రజల్ని భయభ్రాంతులకు గురిచేశారు. ఎస్సీలపై దాష్టీకం చిలకలూరిపేట మండలం కావూరు ఎస్సీ కాలనీలో పోలింగ్‌ సందర్భంగా మే 13వ తేదీ రాత్రి వైఎస్సార్‌సీపీ వర్గీయులపై టీడీపీ నాయకుల దౌర్జన్యం చేశారు. వైఎస్సార్‌సీపీకి ఎస్సీలు ఓటు వేశారన్న అక్కసుతో వారిపై టీడీపీ నేతలు దాడి చేశారు. పోలింగ్‌ మరుసటి రోజు నుంచి కాలనీకి చెందిన ఎస్సీలు గ్రామంలోని ప్లాంట్‌నుంచి మంచినీరు తీసుకువెళ్లకుండా టీడీపీ నేతలు తమ దాష్టీకాన్ని చాటుకున్నారు. ఓటేయకుండా అడ్డుకున్నారు ఓటేద్దామని పోలింగ్‌ బూత్‌కు వెళితే టీడీపీ నేతలు బెదిరించి అడ్డుకున్నారు. కర్రలతో దాడులు చేస్తుండటంతో ప్రాణభయంతో ఇంటికి పారిపోయా. అధికారులకు చెప్పినా చూస్తూ నిలబడిపోయారు. ప్రాణాలు కాపాడుకోవడం మేలని ఓటేయకుండా తిరిగొచ్చేశా. –కర్రా ఏసుపాదం, ఎస్సీ మహిళ, తుమృకోట ఓటు వేయలేకపోయా ఓటు వేయాలని రెండుసార్లు పోలింగ్‌ బూత్‌కు వెళ్లాను. అక్కడ యుద్ధ వాతావరణం చూసి భయపడి ఇంటికి వచ్చేశా. టీడీపీకి చెందిన వారు దాడులు చేస్తూ బడుగులను భయపెట్టి ఇళ్లకు పంపించారు. గతంలో ఎప్పుడూ ఇటువంటి పరిస్థితి నేను చూడలేదు. – నందిగం పున్నమ్మ, ఎస్సీ మహిళ, తుమృకోట నా భర్తను కొట్టారు ఓటు వేయడానికి వెళ్లిన నా భర్త దీపావత్‌ స్వామినాయక్‌ను టీడీపీ గూండాలు దారుణంగా కొట్టారు. నన్ను కూడా ఓటు వేయకుండా బెదిరించారు. పోలింగ్‌ బూత్‌ల వద్ద దాడులు చేయడంతో మా కాలనీలో ఎవరూ ఓటు వేయలేదు. అధికారులు మాకు రక్షణ కలి్పంచలేకపోవడం వల్ల ప్రాణ భయంతో ఓటు వేయడానికి వెళ్లలేదు. – దీపావత్‌ రమణ, ఎస్టీ మహిళ, తుమృకోట ప్రాణభయంతో పరుగులు పెట్టా ఓటు వేయవద్దని.. వేస్తే పరిస్థితులు తీవ్రంగా ఉంటాయని టీడీపీ నేతలు బెదిరించారు. గ్రామస్తులు లెక్కచేయకపోవడంతో రిగ్గింగ్‌ చేయాలనే తలంపుతో దళితులపై కర్రలు, రాళ్లతో దాడులు చేయడంతో ప్రాణాలు కాపాడుకోవడం కోసం పరుగులు పెట్టా. – కత్తి భూలక్ష్మి, ఎస్సీ మహిళ, పాలువాయిగేటు, రెంటచింతల మండలం వైఎస్సార్‌ సీపీకి ఓటు వేశామని దాడి టీడీపీ నేతలు పోలింగ్‌ రోజు మా ఇళ్ల మీద పడి కనపడిన వారిని కనపడినట్టు కొట్టారు. మా ఆస్తులను ధ్వంసం చేశారు. నా చేయి, కాలుపై కర్రలతో కొట్టారు. నాతో మరో నలుగురిని కొట్టారు. ముసలోళ్లమని కూడా చూడలేదు. బీభత్సం చేశారు. – గొర్ల సైదులు, జంగాల కాలనీ, పేటసన్నెగండ్ల , కారంపూడి

Lok Sabha Election 2024: Chhoti Bahu Maneka Gandhi fights lone battle in Sultanpur
Lok Sabha Election 2024: చోటీ బహూకు ఇంటిపోరు

సుల్తాన్‌పూర్‌. గాంధీ కుటుంబపు కంచుకోట రాయ్‌బరేలీకి కేవలం 100 కిలోమీటర్ల దూరంలో ఉన్న లోక్‌సభ స్థానం. అత్తగారైన ఇందిరను ఎదిరించి చిన్న వయస్సులోనే ఒంటరిగా రాజకీయాల్లోకి వచి్చన మేనకా గాంధీ ఇక్కడి సిట్టింగ్‌ ఎంపీ. ఎంపీగా ఏకంగా తొమ్మిదో విజయమే లక్ష్యంగా బీజేపీ తరఫునే మళ్లీ బరిలోకి దిగారు. అయితే సొంత పారీ్టయే ఆమెకు అంతగా సహకరించడం లేదన్న గుసగుసలు వినిపిస్తున్నాయి. గత ఎన్నికల్లో మేనక కేవలం 14,500 ఓట్లతో గట్టెక్కారు. ఈసారి ఆమె గెలుపు ఈజీ కాదని విశ్లేషకులూ అంటున్న పరిస్థితి! ఇన్ని సవాళ్ల నడుమ సుల్తాన్‌ పూర్‌ పరీక్షలో 67 ఏళ్ల ఈ ‘చోటీ బహు’ ఎలా నెగ్గుకొస్తారనేది ఉత్కంఠ రేపుతోంది... భర్త సంజయ్‌గాంధీ మరణం తర్వాత ఇందిరతో విభేదాలు మేనకను ఒంటరిని చేశాయి. అప్పటికి చంటిపిల్లాడైన వరుణ్‌ గాం«దీని తీసుకొని కుటుంబం నుంచి బయటికొచ్చారు. నాలుగు దశాబ్దాలుగా రాజకీయాల్లో ఒంటరి పోరాటమే చేస్తూ వచ్చారు. తొలిసారి 1984లో అమేథీలో బావ రాజీవ్‌గాం«దీని ఢీకొని 2.7 లక్షల ఓట్ల తేడాతో ఓటమి చవిచూశారు. 1989లో జనతాదళ్‌ తరఫున ఉత్తరప్రదేశ్‌లోని పిలిభిత్‌ నుంచి గెలిచి తొలిసారి లోక్‌సభలో అడుగుపెట్టారు. 1991లో మళ్లీ బీజేపీ చేతిలో ఓటమి చవిచూసినా ఆ తర్వాత మాత్రం వరుసగా ఏడుసార్లు విజయం సాధించారు. పిలిభిత్‌ను కంచుకోటగా మార్చుకున్నారు. అక్కడి నుంచి మూడుసార్లు ఇండిపెండెంట్‌గా కూడా విజయకేతం ఎగరేయడం విశేషం. మధ్యలో ఒకసారి ఆవ్లా లోక్‌సభ స్థానం నుంచీ నెగ్గారు. వీపీ సింగ్‌ ప్రభుత్వంలో, తర్వాత వాజ్‌పేయి సర్కారులో, మోదీ తొలి విడత ప్రభుత్వంలోనూ మంత్రిగా కీలక బాధ్యతలు నిర్వహించారు. ఫిలిబిత్‌లో ఆరుసార్లు గెలిచాక 2019లో ఆ స్థానాన్ని కుమారుడు వరుణ్‌కు వదిలి తొలిసారి సుల్తాన్‌పూర్‌కు మారారు. వరుణ్‌కు బీజేపీ ఈసారి మొండిచేయి చూపడంతో మేనక కూడా నిరుత్సాహానికి గురయ్యారు. ఓబీసీలు, ముస్లింలే కీలకం... సుల్తాన్‌పూర్‌లో నిషాద్‌లతో పాటు కురీ్మలు, యాదవులు, ముస్లింలు, దళితులు ఎక్కువగా ఉన్నారు. బ్రాహ్మణులు, ఠాకూర్లు ఓ మోస్తరుగా ఉంటారు. కాంగ్రెస్‌ మద్దతుతో ఎస్పీ తరఫున బరిలోకి దిగిన రామ్‌ భువల్‌ నిషాద్‌కు ఆ సామాజిక వర్గంలో గట్టి పట్టుంది. బీఎస్పీ కుర్మీ సామాజికవర్గానికి చెందిన ఉద్రజ్‌ వర్మను రంగంలోకి దించడంతో ఓట్లు భారీగా చీలే అవకాశం కనిపిస్తోంది. ఇక్కడ బీఎస్పీ రెండుసార్లు గెలవగా ఎస్పీ బోణీయే చేయలేదు! స్థానిక సమస్యలే ప్రధానాంశాలుగా ప్రచారం సాగింది. ప్రచారానికి మోదీ, షా దూరం సుల్తాన్‌పూర్‌లో శనివారం ఆరో విడతలో పోలింగ్‌ జరగనుంది. కానీ యూపీ అంతా కలియదిరుగుతున్న ప్రధాని నరేంద్ర మోదీతో పాటు కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా, ఇతర బీజేపీ అగ్ర నేతలెవరూ అటువైపు కన్నెత్తి కూడా చూడకపోవడం విశేషం! ప్రచారం చివర్లో సీఎం యోగి ఆదిత్యనాథ్‌ మాత్రం ఓ ర్యాలీలో పాల్గొన్నారు. దీంతో ఈ ఎన్నికలు ఆమెకు మళ్లీ ఒంటరి పోరాటంగానే కనిపిస్తున్నాయి. అయితే కుటుంబీకులైన రాహుల్, ప్రియాంక మొదలుకుని విపక్ష నాయకులెవరూ కూడా మేనకకు వ్యతిరేకంగా పెద్దగా ప్రచారం చేయకపోవడం విశేషం! అయోధ్య రామ మందిర నిర్మాణం, వరుణ్‌కు టికెట్‌ నిరాకరణ వంటివేవీ సుల్తాన్‌పూర్‌లో ఎన్నికల అంశాలు కావు. నియోజకవర్గ ప్రజల సమస్యలే ప్రధానాంశాలు. వాటిని తీర్చేందుకు ఐదేళ్లుగా చేసిన కృషే నన్ను మళ్లీ గెలిపిస్తుంది. గత ఎన్నికల కంటే ఎక్కువ మెజారిటీతో గెలిచి చూపిస్తా. – మేనకా గాంధీ – సాక్షి, నేషనల్‌ డెస్క్‌

హఠాన్మరణం : ఇరాన్‌ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ
రైసీ మరణం రేపుతున్న ప్రశ్నలు

ఇజ్రాయెల్‌పై అక్టోబర్‌ 7న హమాస్‌ చేసిన దాడుల నేపథ్యంలో... ఇజ్రాయెల్‌తో, అమెరికాతో ఇరాన్‌కు ప్రచ్ఛన్న ఘర్షణ జరుగుతున్న తరుణంలో ఆ దేశాధ్యక్షుడు ఇబ్రహీం రైసీ హఠాన్మరణం ఇరాన్‌ కు అకాల ఘటనే అని చెప్పాలి. తాలిబాన్‌ పాలనలో ఉన్న అఫ్గానిస్తాన్, ఇరాన్‌ దేశాలు ఇజ్రాయెల్‌తో పోరాడటానికి తమ ప్రచ్ఛన్న ఘర్షణలను ముందుకు తీసుకువెళుతున్న దశ ఇది. ఇరాన్‌ పట్ల భారత్‌ సానుకూల వైఖరి చేపడుతున్న ఈ దశలో.. రైసీ మరణం అనేక ప్రశ్నలు రేపుతోంది. ఆంక్షల నుండి భారతదేశాన్ని మినహాయించడానికి అమెరికన్లు గతంలో కంటే తక్కువ సుముఖతనే ప్రదర్శిస్తారా అన్నది ప్రధాన ప్రశ్న. భారత్‌ – ఇరాన్‌ సంబంధాలపై రైసీ మరణం ఎలాంటి ప్రభావం చూపబోతోందన్నది మరొక కీలకమైన ప్రశ్న.హమాస్‌కి ధన, ఆయుధాల సరఫరాదారుగా, ప్రేరేపకురాలిగా ఇరాన్‌పై ఆరోపణలున్నాయి. ఇరాక్, సిరియా, లెబనాన్‌లో ఉంటున్న ఇరాన్‌ అనుకూల సాయుధ గ్రూపులు, ప్రత్యేకించి హిజ్బుల్లాను ఇందులో భాగస్వాములుగా పరిగణిస్తున్నారు. ఇజ్రాయెల్‌పై తన మొట్టమొదటి ప్రత్యక్ష క్షిపణి, డ్రోన్‌ దాడిని ఇరాన్‌ ఈ ఏప్రిల్‌ 13న ప్రారంభించింది. డమాస్కస్‌లోని ఇరాన్‌ దౌత్య భవనంపై ఇజ్రాయెల్‌ బాంబు దాడి చేయడం ఇరాన్‌ ని రెచ్చగొట్టటం అందుకు కారణం. పశ్చిమాసియాలో ఇరాన్‌ రహస్య కార్యకలాపాలను సమన్వయం చేస్తున్న కొంతమంది ఇరాన్‌ సైనిక కమాండర్లు ఈ దాడి ఘటనలో చనిపోయారు.బరాక్‌ ఒబామా అధ్యక్షుడిగా ఉన్న సమయంలో, ఇరాన్‌ నుండి ఇరాక్, సిరియా, లెబనాన్‌ మీదుగా మధ్యధరా సముద్రం వరకు నడుస్తున్న షియా ప్రభావిత ప్రాంతంలో తన అణు కార్యక్రమాన్ని, వ్యూహాత్మక విస్తరణను నియంత్రించడానికి ఇరాన్‌ తో కలిసి పనిచేసే అవకాశాన్ని అమెరికా ఎంచుకుంది. ఈ నేపథ్యంలోనే ఇరాన్, ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలోని ఐదు శాశ్వత సభ్యదేశాలకు జర్మనీ మధ్య 2015లో అణు ఒప్పందం కుదిరింది. అయితే, అప్పటి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ 2018లో ఇరాన్‌ పై ఆంక్షలు విధిస్తూ ఆ ఒప్పందం నుండి వైదొలిగారు. అదే సమయంలో, అమెరికా అనుసరించే ఇజ్రాయెల్‌ అనుకూల వైఖరిని మరింతగా పెంచి పోషించారు. ఆక్రమిత వెస్ట్‌ బ్యాంక్‌లో స్థావరాల ఏర్పాటును అరికట్టడానికి లేదా ఇజ్రాయెల్, పాలస్తీనా దేశాల మధ్య పరిష్కారం విషయంలో ఇజ్రాయెల్‌ వైపునుంచి నిబద్ధతను సాధించకుండా అమెరికా రాయబార కార్యాలయాన్ని ఏకపక్షంగా జెరూసలేంకు మార్చివేశారు. తదుపరి అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ ఈ విధానాన్ని పునఃపరిశీలించడానికి ప్రయత్నించారు, కానీ మొదటగా కోవిడ్‌–19 మహమ్మారి, తరువాత ఉక్రెయిన్‌ యుద్ధం నేపథ్యంలో ఈ అంశంపై పెద్దగా దృష్టి సారించలేదు. ఈలోగా, ట్రంప్‌ అధ్యక్షుడిగా ఉన్న సమయంలో సంతకం చేసిన అబ్రహం ఒప్పందాలను ఉపయోగించి కొత్త పశ్చిమాసియా, గల్ఫ్‌ భద్రతా నమూనా అమలు గురించి అమెరికా ఊహించింది. ఇజ్రాయెల్‌తో సంబంధాలను సాధారణ స్థాయికి తీసుకురావడానికి యూఏఈ, బహ్రెయిన్, మొరాకో, సౌదీ అరేబియా వంటి తన అనుకూల అరబ్‌ దేశాలను అమెరికా ప్రోత్సహించింది. ఇరాన్‌తో, పశ్చిమాసియాతో తన లోతైన రాజకీయ సంబంధాలను కొనసాగించడమే దీని లక్ష్యం. కానీ ఇజ్రాయెల్‌ ప్రధాన మంత్రి బెంజమిన్‌ నెతన్యాహు నేతృత్వంలోని కొత్త సంకీర్ణ ప్రభుత్వంతో, పాలస్తీనా ప్రాధాన్యాన్ని తగ్గించి వేయడాన్ని సమర్థిస్తున్న తీవ్ర మితవాద పార్టీలతో ఎదురయ్యే ప్రమాదాన్ని అమెరికా విస్మరించింది. ప్రాంతీయ భౌగోళిక రాజకీయాలలో పాలస్తీనియన్లు ప్రాముఖ్యం కోల్పోయారని నెతన్యాహు ఈ సందర్భంగా వాదించారు.ఈ కొత్త దృక్పథం ఆధారంగా భారత్, మధ్య ప్రాచ్యం, యూరప్‌ ఆర్థిక కారిడార్‌ (ఐఎమ్‌ఈసీ) ప్రతిపాదనకు వచ్చింది. యూఏఈ, సౌదీ అరేబియా, అమెరికా, భారతదేశ నాయకులు న్యూఢిల్లీలో జీ20 శిఖరాగ్ర సమావేశం సందర్భంగా ఈ ప్రతిపాదనను ఘనంగా ఆవిష్కరించటం కోసం సమావేశమయ్యారు. కానీ అదానీ యాజమాన్యంలోని హైఫా ఓడరేవు ల్యాండ్‌ రూట్‌ ముగింపు కేంద్రంగా ఉన్న ఇజ్రాయెల్‌ని ఈ సందర్భంగా ప్రస్తావనలోకి తీసుకోలేదు. పాలస్తీనా సమస్యను పరిష్కరించే విషయంలో ఇజ్రాయెల్‌ నుంచి నిబద్ధత లేకుండా, అబ్రహం ఒప్పందాలపై సంతకం చేయడాన్ని సౌదీ స్పష్టంగానే ప్రతిఘటించింది. తర్వాత ఒక సంవత్సరం లోపే, ఇరాన్‌ ప్రేరేపిత గాజా సంక్షోభం ఐఎమ్‌ఈసీ ప్రాజెక్ట్‌ను ఎత్తివేసింది. యూఏఈ, బహ్రెయిన్‌ వంటి అబ్రహం ఒప్పందాలపై సంతకం చేసిన దేశాలు కూడా దేశీయ ప్రజాభిప్రాయాన్ని, అరబ్‌ ప్రజానీకం ఆగ్రహాన్ని సంతృప్తి పరచడానికి, ఇజ్రాయెల్‌కు వ్యతిరేకంగా తమ బహిరంగ వైఖరిని కఠినతరం చేయవలసి వచ్చింది.అమెరికా–ఇజ్రాయెల్‌ ప్రణాళికలను చిత్తు చేసిన ఇరాన్‌ ఈ క్రమంలో రష్యా–చైనా కూటమికి దగ్గరైంది. రష్యాకు సాయుధ డ్రోన్‌ ల ప్రధాన సరఫరాదారుగా ఇరాన్‌ మారింది. ఈ దశలోనే రైసీ మరణం సంభవించింది. రైసీ తన నాలుగేళ్ల పదవీకాలంలో మూడో సంవత్సరంలో ఉన్నారు. ఇరాన్‌ న్యాయవ్యవస్థ మాజీ అధిపతిగా, ప్రజాస్వామ్య దేశాలలో ప్రధాన న్యాయమూర్తుల కంటే ఎక్కువ అధికారం ఉన్న పదవిలో, ఆయన రక్తపు మరకలతో కూడిన కలుషిత గతాన్ని కలిగి ఉన్నారు. 1980లలో రాజకీయ ఖైదీల సామూహిక మరణశిక్షను ఆయన పర్యవేక్షించారు. 2021లో తన ఎన్నిక సాధారణ ఇరాన్‌ అధ్యక్ష ఎన్నికల కంటే తక్కువ స్వేచ్ఛాయుతంగా జరిగింది. సాంప్రదాయికంగా సుప్రీం లీడర్, అతని సలహాదారులు అధ్యక్ష అభ్యర్థుల జాబితాను కత్తిరించడానికి గార్డియన్‌ కౌన్సిల్‌ను ఉపయోగిస్తారు. గతంలో ప్రజలకు కొంత ఎంపిక అవకాశాన్ని, ఎన్నికల స్వేచ్ఛను అందించడానికి దీన్ని తెలివిగా అమలు చేశారు. 1997లో మొహమ్మద్‌ ఖతామీ ఎన్నికైనప్పుడు, అతను వ్యవస్థానుకూలమైన, సంప్రదాయవాదులను ఓడించిన, గుర్తింపు పొందిన సంస్కరణ వాదిగా ఉండేవారు. పాశ్చాత్య ఆంక్షల కారణంగా ఏర్పడిన ఆర్థిక కష్టాల వల్ల ప్రజల్లో పెరుగుతున్న అసంతృప్తి పెరుగుతున్న నేపథ్యంలో ఈ విధానాన్ని 2021లో నిలిపివేశారు. తరువాత, 2022 సెప్టెంబరులో పోలీసు కస్టడీలో మహ్సా అమిని అనే యువతి మరణం, ముఖ్యంగా మహిళల నుండి విస్తృతమైన నిరసనలను రేకెత్తించింది. వ్యవస్థ నైతిక అధికారం దెబ్బతినడంతో, 2021 ఓటింగ్‌ శాతం 60 శాతం లేదా అంతకంటే ఎక్కువ నుండి 49 శాతానికి పడిపోయింది. వాస్తవానికి, ఓటర్లు 13 శాతం వ్యతిరేక ఓట్లను వేయడం ద్వారా తమ నిరసన తెలిపారు. ఇది రైసీ ప్రత్యర్థులకు వచ్చిన ఓట్ల కంటే కూడా ఎక్కువ. ఇప్పుడు 50 రోజుల్లో కొత్త అధ్యక్ష ఎన్నికలు జరగాలి. ప్రస్తుత పరిస్థితి భారతదేశం–ఇరాన్‌ సంబంధాలపై ఎలా ప్రభావం చూపుతుందన్నది పెద్ద ప్రశ్న. చాబహార్‌ ఓడరేవు భారత్, ఇరాన్‌ ద్వైపాక్షిక సంబంధాలకు ప్రధాన చిహ్నం. ఓడరేవును అభివృద్ధి చేయడానికి ఇటీవలి పదేళ్ళ ఒప్పందం తరువాత, అమెరికా ఆంక్షల హెచ్చరికను జారీ చేసింది. అఫ్గానిస్తాన్, ఇరాన్‌ దేశాలు ఇజ్రాయెల్‌తో పోరాడటానికి తమ ప్రతినిధులను ముందుకు తీసుకువెళుతున్నందున, అమెరికన్లు భారతదేశానికి మినహాయింపు ఇవ్వడానికి గతంలో కంటే తక్కువ సుముఖంగా ఉండవచ్చు.1996–2001 కాలంలో తాలిబాన్లు అఫ్గానిస్తాన్‌ ను నియంత్రించినప్పుడు ఇండో–ఇరానియన్‌ వ్యూహాత్మక కలయిక అత్యంత సన్నిహితంగా ఉండేది. రెండు దేశాలూ అహ్మద్‌ షా మసూద్‌ నేతృత్వంలోని ఉత్తర కూటమికి మద్దతు ఇచ్చారు. కానీ 2003 నుండి, ఇరాన్‌ రహస్య అణు కార్యక్రమం వెల్లడి, అమెరికాతోపాటు పాశ్చాత్య దేశాలు ఆంక్షలు విధించిన తర్వాత, భారతదేశం అమెరికాతో అణు ఒప్పందంపై చర్చలు ప్రారంభించింది. అప్పటి నుండి, ఇరు దేశాల మధ్య సంబంధాలు వ్యూహాత్మక అనుమానం, లావాదేవీలలో సహనం మధ్య హెచ్చుతగ్గులకు లోనయ్యాయి.రైసీ మరణం ఈ ప్రాథమిక అంశాలను మార్చదు. ఏది ఏమైనప్పటికీ, ఇరాన్‌ అత్యున్నత జాతీయ భద్రతా మండలిలోని సుప్రీం లీడర్, సలహాదారులు, ముఖ్యంగా దాని సెక్రటరీ జనరల్‌ అలీ అక్బర్‌ అహ్మదీయన్‌ ఇరాన్‌ విదేశాంగ విధానాన్ని కొనసాగిస్తారు. కానీ రైసీ మరణం ఇరాన్‌ అంతర్గత రాజకీయ సమతుల్యతను ప్రభావితం చేస్తుంది. ఎందుకంటే అధికార శూన్యతను పూరించడానికి ఎవరో ఒక నేతను పైకి లేపడం ప్రారంభం కానుంది. కేసీ సింగ్‌ వ్యాసకర్త ఇరాన్‌ మాజీ రాయబారి, మాజీ కార్యదర్శి, విదేశాంగ మంత్రిత్వ శాఖ

Mukesh Kumar Meena On Macharla Palwai Gate Polling Station EVM Issue
ఆ వీడియో లీక్‌ అయింది.. మేము విడుదల చేయలేదు: సీఈవో

సాక్షి, అమరావతి: మాచర్ల నియోజకవర్గం పాల్వాయి గేటు పోలింగ్‌ కేంద్రంలో ఈవీఎం ధ్వంసం సంఘటనకు సంబంధించి మాధ్యమాల్లో ప్రసారమవుతున్న వీడియో లీక్‌తో ఎన్నికల సంఘానికి సంబంధం లేదని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్‌కుమార్‌ మీనా స్పష్టం చేశారు. ఆ వీడియో తమ నుంచి బయ­టకు వెళ్లలేదని గురువారం సచివాలయంలో తనను కలిసిన విలేకరులకు చెప్పారు. ఆ వీడియో ఎలా బయటకు వెళ్లిందన్న దానిపై విచారణ చేస్తున్నామని వెల్లడించారు. రాష్ట్రంలో ఎన్నికల అనంతరం జరిగిన సంఘటనలపై దర్యాప్తు చేస్తున్న సందర్భంగా ఎవరి చేతి నుంచో బయటకు వెళ్లి ఉండొచ్చని అనుమానిస్తున్నట్లు తెలిపారు. ఈవీఎం ధ్వంసంపై సరైన సమాచారం ఇవ్వనందుకు విధుల్లో ఉన్న పీవో, ఏపీవోలను సస్పెండ్‌ చేయాలని ఆదేశాలిచ్చినట్టు మీనా తెలిపారు. మాచర్ల నియోజకవర్గంలో గాయపడిన కార్యకర్తల్ని పరామర్శించేందుకు తెలుగుదేశం పార్టీ నేతలు ఇప్పుడు వెళ్లడం మంచిది కాదని అభిప్రాయపడ్డారు. అక్కడ పరిస్థితులు ఇప్పుడిప్పుడే అదుపులోకి వస్తున్నాయని, ఇలాంటి తరుణంలో పరామర్శల పేరుతో వెళ్లి రాజకీయాలు చేయవద్దని ఆయన సూచించారు. ఇప్పుడు తెలుగుదేశం వాళ్లకు అనుమతిస్తే రేపు వేరే పార్టీ వాళ్లు వెళ్తామంటారని, అందుకే బయటి నుంచి నేతలెవరూ పరామర్శకు వెళ్లనీయొద్దని స్పష్టమైన ఆదేశాలు జారీ చేసినట్లు తెలిపారు.కౌంటింగ్‌కు పటిష్ట ఏర్పాట్లువచ్చే నెల 4వ తేదీన జరగనున్న ఓట్ల లెక్కింపునకు పటిష్టమైన ఏర్పాట్లు చేయాలని అన్ని జిల్లాల ఎన్నికల అధికారులకు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్‌ కుమార్‌ మీనా ఆదేశించారు. కచ్చితమైన ఫలితాలను త్వరితగిన ప్రకటించేలా ముందస్తు ఏర్పాట్లు చేసుకోవాలని సూచించారు. రాష్ట్ర సచివాలయం నుండి అన్ని జిల్లాల ఎన్నికల అధికారులతో గురువారం ఆయన వీడియో కాన్ఫరెన్సులో ఆయన మాట్లాడుతూ చెదురుమదురు సంఘటనలు మినహా అందరి సమష్టి కృషితో ఈ నెల 13న రాష్ట్రంలో ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహించినట్టు వివరించారు. అదే స్పూర్తితో ఓట్ల లెక్కింపు జరిగేలా పటిష్టమైన ఏర్పాట్లు చేసుకోవాలని కోరారు. ఏ రోజు, ఎన్ని గంటలకు ఎన్నిటేబుళ్లపై ఓట్ల లెక్కింపు జరుగుతుందో రాతపూర్వకంగా సంబంధిత అభ్యర్థులకు, ఎన్నికల ఏజెంట్లకు ముందుగానే తెలియజేయాలన్నారు. ప్రత్యేకంగా మీడియా సెంటర్లను ఏర్పాటు చేయాలన్నారు.పార్లమెంట్, అసెంబ్లీ ఓట్లను వేర్వేరుగా లెక్కింపుస్ట్రాంగ్‌ రూమ్‌ల నుంచి ఓట్ల లెక్కింపు కేంద్రాలకు పోలింగ్‌ యంత్రాలను తరలించే మార్గాలు, అభ్యర్థులు, ఏజంట్లు వెళ్లడానికి వేర్వేరు మార్గాలు ఏర్పాటు చేయాలని సూచించారు. ఎలాంటి సమస్యలు రాకుండా ఉండటానికి బారికేడ్లతో పాటు సూచికల బోర్డులను ఏర్పాటు చేసుకోవాలని చెప్పారు. లెక్కింపు కేంద్రంలో పార్లమెంట్, అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించి వేర్వేరుగా ఓట్ల లెక్కింపు టేబుళ్లను ఏర్పాటు చేయాలని చెప్పారు. పోస్టల్‌ బ్యాలెట్ల లెక్కింపునకు ప్రత్యేక టేబుళ్లు ఏర్పాటు చేయాలన్నారు. పోస్టల్‌ బ్యాలెట్లు లెక్కించిన తరువాతనే ఈవీఎంల వారీగా ఓట్లను లెక్కించాలని సూచించారు. హై స్పీడ్‌ ఇంటర్నెట్‌ సౌకర్యంతో అవసరమైన కంప్యూటర్లు, ప్రింటర్లను కౌటింగ్‌ కేంద్రాల్లో ఏర్పాటు చేసుకోవాలన్నారు. ఎన్కోర్‌లో ఎప్పటి కప్పుడు డాటా ఎంట్రీకి సుశిక్షితులై సిబ్బందిని ఏర్పాటు చేసుకోవాలని తెలిపారు. కౌంటింగ్‌ అధికారులు, సిబ్బంది మొబైల్‌ ఫోన్లను డిపాజిట్‌ చేసేందుకు వీలుగా ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేసుకోవాలని చెప్పారు. గుర్తింపు కార్డులు లేనివారిని, అనధికార వ్యక్తులను, ఇతరులను ఎట్టి పరిస్థితుల్లో కౌంటింగ్‌ కేంద్రం ప్రాంగణాల్లోకి అనుమతికుంచ కుండా పటిష్టమైన పోలీస్‌ బందోబస్తు ఏర్పాటు చేసుకోవాలని సూచించారు.స్ట్రాంగ్‌రూమ్‌ల వద్ద మూడంచెల భద్రతఈవీఎంలను భద్రపర్చిన స్ట్రాంగ్‌ రూముల వద్ద కేంద్ర, రాష్ట్ర పోలీసు బలగాలతో పటిష్టమైన మూడంచెల భద్రత కొనసాగుతున్నదని, స్ట్రాంగ్‌ రూమ్‌లకు సీలు వేసిన తలుపులు, సెక్యూరిటీ కారిడార్లను కవర్‌ చేసేలా ఏర్పాటు చేసిన సీసీ కెమెరాల పనితీరును, కంట్రోల్‌ రూమ్‌కు అనుసంధానం చేసిన సీసీ కెమెరాల పనితీరును నిరంతరం అధికారులు పర్యవేక్షిస్తుండాలని చెప్పారు. వీడియో కాన్ఫరెన్స్‌లో అదనపు సీఈవోలు పి.కోటేశ్వరరావు, ఎమ్‌.ఎన్‌.హరీంధర ప్రసాద్‌తో పాటు అన్ని జిల్లాల ఎన్నికల అధికారులు పాల్గొన్నారు.

Tripti Dimri will Share the Screen with Allu Arjun
ఊ అన్నావా భామా..!

‘పుష్ప: ది రైజ్‌’ చిత్రంలో స్పెషల్‌ సాంగ్‌ ‘ఊ అంటావా మావ....’ ఎంత పాపులర్‌ అయిందో తెలిసిందే. ఈ ప్రత్యేక పాటలో అల్లు అర్జున్‌తో కలిసి హాట్‌ హాట్‌ స్టెప్పులేశారు సమంత. ఈ చిత్రానికి సీక్వెల్‌గా రూపొందుతున్న ‘పుష్ప: ది రూల్‌’లో కూడా ఇలాంటి ఓ ప్రత్యేక పాట ఉందని సమాచారం. ఈ పాటకు అల్లు అర్జున్‌తో కలిసి బాలీవుడ్‌ నటి త్రిప్తి దిమ్రి కాలు కదపనున్నారని సమాచారం.రణ్‌బీర్‌ కపూర్‌ హీరోగా సందీప్‌ రెడ్డి దర్శకత్వంలో రూపొందిన ‘యానిమల్‌’లో చేసిన ఓ పాత్రతో త్రిప్తి బాగా పాపులర్‌ అయ్యారు. ఈ చిత్రం తర్వాత త్రిప్తీకి హిందీలో అవకాశాలు పెరిగాయి. ఇప్పుడు ‘పుష్ప: ది రూల్‌’ పాటకు ఆమెను తీసుకున్నారనే వార్త ప్రచారంలోకి రావడంతో ‘ఊ అన్నావా భామా...!’ అని అభిమానులు సరదాగా అంటున్నారు. మరి.. ప్రచారంలో ఉన్నట్లు ఈ పాటతో త్రిప్తి తెలుగుకి పరిచయం అవుతారా? వేచి చూడాల్సిందే.29న అగ్గిరవ్వ మాదిరి ఉంటాడే...‘పుష్ప: ది రూల్‌’ సినిమా నుంచి ఈ నెల 1న ‘పుష్ప..పుష్ప’ అంటూ సాగే పాట విడుదలైన సంగతి తెలిసిందే. కాగా ఈ సినిమా నుంచి ‘సూసికి అగ్గిరవ్వ మాదిరి ఉంటాడే నా సామి’ అంటూ సాగే మరో పాట లిరికల్‌ వీడియోను ఈ నెల 29న విడుదల చేయనున్నట్లుగా చిత్ర యూనిట్‌ వెల్లడించింది. తెలుగుతో పాటు తమిళ, కన్నడ, హిందీ, మలయాళ భాషల్లో కూడా ఈ పాట విడుదల కానుంది. దేవిశ్రీ ప్రసాద్‌ ఈ సినిమాకు స్వరకర్త. అల్లు అర్జున్, రష్మికా మందన్నా జంటగా సుకుమార్‌ దర్శకత్వంలో నవీన్ ఎర్నేని, వై. రవిశంకర్‌ నిర్మిస్తున్న ‘పుష్ప: ది రూల్‌’ చిత్రం ఆగస్ట్‌ 15న విడుదల కానుంది.

Cyclone to reach West Bengal and Bangladesh coasts by May 26 evening: IMD
నేడు బంగాళాఖాతంలో వాయుగుండం

సాక్షి, విశాఖపట్నం: దక్షిణ బంగాళాఖాతానికి ఆనుకుని పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో కొనసాగుతున్న అల్ప­పీ­డనం గురువారం తీవ్ర అల్పపీడనంగా మారింది. ఇది ఈశాన్య దిశగా కదులుతూ శుక్రవారం నాటికి మధ్య బంగాళాఖాతంలో వాయుగుండంగా బలపడనుంది. అనంతరం అదే దిశలో పయనిస్తూ శనివారం ఉదయా­నికి తూర్పు మధ్య బంగాళాఖాతంలో తుపానుగా మారే అవ­కా­శం ఉంది. ఆ తరువాత ఉత్తరం వైపు వెళ్లి 26వ తేదీ ఆది­వారం సాయంత్రానికి బంగ్లాదేశ్, దానికి ఆనుకుని ఉన్న పశ్చిమ బెంగాల్‌ తీరానికి చేరుకుని తీవ్ర తుపా­నుగా బలపడుతుందని భారత వాతావరణ విభాగం (ఐఎండీ) గురువారం రాత్రి నివేదికలో వెల్లడించింది.దీని ప్రభావంతో కోస్తాంధ్ర, రాయలసీమల్లో శుక్ర, శని­వా­రాల్లో కొన్నిచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, ఉత్తర కోస్తాంధ్రలో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవ­కాశం ఉందని తెలిపింది. శుక్రవారం పార్వతీపురం మన్యం, అల్లూరి, కాకినాడ, కోనసీమ, ఏలూరు, ఎన్టీ­ఆర్, శ్రీసత్యసాయి జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, శ్రీకాకుళం, అనకాపల్లి, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, కృష్ణా, గుంటూరు, ప్రకాశం, బాపట్ల, పల్నాడు, నెల్లూరు, కర్నూలు, నంద్యాల, అనంతపురం, వైఎస్సార్, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో తేలి­క­పాటి వర్షాలకు ఆస్కారం ఉంది.శనివారం అల్లూరి సీతా­రామరాజు, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడా భారీ వర్షాలు, శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, కోనసీమ, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు, శ్రీసత్యసాయి, వైఎస్సార్‌ జిల్లాల్లో అక్కడక్కడా తేలికపాటి వర్షాలు కురవనున్నాయి. ఆదివారం అల్లూరి సీతారామరాజు, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, నంద్యాల, అనంతపురం, వైఎస్సార్, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో తేలికపాటి వర్షాలు కురు­స్తాయని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ వివరించింది. అదే సమయంలో కొన్ని ప్రాంతాల్లో పిడుగులు కూడా సంభవిస్తాయని తెలిపింది.నేడు, రేపు కొన్నిచోట్ల వడగాడ్పులుమరోవైపు పగటి ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. కొన్ని జిల్లాల్లో సాధారణంకంటే 3నుంచి 5 డిగ్రీలు అధి­కంగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. వీటి ఫలితంగా రానున్న రెండురోజులు వడగాడ్పులు వీయ­నున్నాయి. శుక్రవారం శ్రీకాకుళం జిల్లాలో 9, విజయనగరం 11, పార్వతీపురం మన్యం 11, కాకి­నాడ 1, తూర్పు గోదావరి 1 మండలం చొప్పున 33 మండలాల్లోను, శనివారం శ్రీకాకుళం జిల్లాలో 5, విజయనగరం 7, పార్వతీపురం మన్యం 5, పశ్చిమ గోదావరి 1, ఏలూరు 2, కృష్ణా 2, బాపట్ల జిల్లాలో రెండు చొప్పున 24 మండలా­ల్లోనూ వడగాడ్పులు వీచే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది.

Advertisement
Advertisement


Advertisement
Advertisement
Advertisement
 

న్యూస్ పాడ్‌కాస్ట్‌

ఫోటో స్టోరీస్

View all
Advertisement