కాంబినేషన్‌ రిపీట్‌

Nani next movie with Anupama Parameswaran - Sakshi

నాని, అనుపమా పరమేశ్వరన్‌ జంటగా ‘కృష్ణార్జున యుద్ధం’ చిత్రంలో నటించారు. ఈ ఇద్దరూ మరో సినిమాలో మళ్లీ కలసి నటించనున్నారని టాక్‌. రాహుల్‌ సంకృతియాన్‌ దర్శకత్వంలో నాని హీరోగా తెరకెక్కనున్న చిత్రం ‘శ్యామ్‌ సింగరాయ్‌’. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌ బ్యానర్‌పై నాగ వంశీ ఈ సినిమాను నిర్మించనున్నారు. కోల్‌కత్తా బ్యాక్‌డ్రాప్‌లో ఈ చిత్రకథాంశం ఉంటుంది. ఇందులో ఓ హీరోయిన్‌గా సాయిపల్లవి నటిస్తున్నారు. మరో హీరోయిన్‌గా అనుపమా పరమేశ్వరన్‌ని తీసుకున్నారట. ఈ సినిమా చిత్రీకరణను దాదాపు కోల్‌కత్తాలోనే పూర్తి చేయాలనుకుంది చిత్రబృందం. అయితే కరోనా వల్ల హైదరాబాద్‌లోనే కోల్‌కత్తాకు సంబంధించిన సెట్స్‌ నిర్మిస్తున్నారని టాక్‌. ప్రస్తుతం నాని ‘టక్‌ జగదీష్‌’ సినిమాతో బిజీగా ఉన్నారు. అది పూర్తి చేసిన వెంటనే ఈ సినిమా షూటింగ్‌లో పాల్గొంటారు.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top