Mahesh Babu: సీతూ పాపతో మహేశ్.. పిక్‌ వైరల్‌ | Namrata Comments On Mahesh Babu About Cute Moments With Sitara | Sakshi
Sakshi News home page

మహేశ్‌ రియలైజ్ అవుతున్నాడు.. రేర్‌ పిక్‌ షేర్‌ చేసిన నమ్రత

Jun 12 2021 1:44 PM | Updated on Jun 12 2021 2:54 PM

Namrata Comments On Mahesh Babu About Cute Moments With Sitara - Sakshi

సూపర్‌ స్టార్‌ మహేశ్‌ బాబు మంచి ఫ్యామిలీ పర్సన్‌ అని అందరికి తెలిసిందే. స్టార్‌ హోదా ఎంత పెరిగినా తన కుటుంబ సభ్యులతో ఎప్పుడు నార్మల్‌గానే ఉంటాడు. తండ్రికి మంచి కొడుకుగా, భార్యకు మంచి భర్తగా, పిల్లలకు మంచి తండ్రిగా మహేశ్‌ ఉంటాడు. విరామం దొరికితే చాలు ఫ్యామిలీతో టూర్స్‌ వేస్తుంటాడు. ఇక లాక్‌డౌన్‌ సమయంలో అయితే మహేశ్‌ ఎక్కువగా కొడుకు గౌతమ్‌, కూతురు సితారాతోనే గడిపేస్తున్నాడు. వారితో కలిసి సరదాగా ఆడుకున్నాడు. ఆ  ఫొటోలను ఆయన భార్య నమ్రత శిరోద్కర్‌ ఎప్పటికప్పుడు సోషల్‌ మీడియాలో అభిమానులతో పంచుకుంటుంది.

తాజాగా నమ్రత సోషల్‌ మీడియాలో షేర్‌ చేసిన ఫోటో, దానిపై చేసిన కామెంట్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌ అయింది. అందులో మహేశ్‌ బాబు  తన గారాల పట్టి సితారాను గట్టిగా హత్తుకొని నిద్రపోయాడు.  ఆ దృశ్యాన్ని నమత్ర తన కెమెరాలో బంధించి, సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేసింది. ‘ఇలాంటి హగ్గులు అనూహ్యంగా వస్తుంటాయ్.. ఎప్పుడైనా ఎక్కడైనా.. ఇలా వస్తాయ్. ఒక వేళ పాఠశాలలు ప్రారంభమైతే.. ఇలాంటివి ఎప్పుడంటే అప్పుడు వస్తూనే ఉంటాయి. అదే ఇప్పుడు మహేశ్‌ బాబు రియలైజ్ అవుతున్నాడు’అని నమ్రత చెప్పుకొచ్చింది. ఇక మహేశ్‌ సినిమాల విషయానికి వస్తే.. ప్రస్తుతం ఆయన పరుశురామ్‌ దర్శకత్వంలో ‘సర్కారువారి పాట’చేస్తున్నారు. ఆ తర్వాత త్రివిక్రమ్‌తో ఓ సినిమా చేయబోతున్నారు. 

చదవండి:
సర్కారువారి పాట’ అప్‌డేట్స్‌ ఎప్పుడంటే.. 

Advertisement
 
Advertisement
Advertisement