Nagarjuna Revealed Climax Fight Scene In The Ghost Movie - Sakshi
Sakshi News home page

Nagarjuna The Ghost Movie: ఆ యాక్షన్ సీన్స్ హైలెట్‌గా నిలుస్తాయి: నాగార్జున

Published Tue, Oct 4 2022 7:17 PM

Nagarjuna Revealed Climax Fight Scene In The Ghost Movie - Sakshi

టాలీవుడ్ కింగ్ నాగార్జున, సోనాల్ చౌహన్ జంటగా నటించిన చిత్రం 'ది ఘోస్ట్'. ఈ చిత్రానికి ప్రవీణ్ సత్తారు దర్శకత్వం వహించారు.  ఈ మూవీపై ఇ‍ప్పటికే అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.  దసరా కానుకగా అక్టోబర్ 5న  థియేటర్లలో  సందడి చేయనుంది. ఈ సినిమా ప్రమోషన్లలో భాగంగా హీరో నాగార్జున  కొన్ని యాక్షన్ సీన్లపై ఇంట్రెస్టింగ్ కామెంట్స్‌ చేశారు.

ఇటీవల ఓ మీడియాకు ఇచ్చిన ఇంటర్వూలో ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నారు కింగ్. సాలిడ్ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో ఫైట్ సీన్స్ ఆసక్తిగా ఉంటాయన్నారు నాగ్.  క్లైమాక్స్‌లో వచ్చే చర్చ్ ఫైట్ హైలైట్‌గా నిలుస్తుందన్నారు కింగ్ నాగార్జున. అలాగే దర్శకుడు సైతం ఈ సినిమాలో ఏకంగా 12 యాక్షన్ సీన్లు ఉన్నాయని చెప్పారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజ్‌ అయిన ఫస్ట్‌లుక్‌ పోస్టర్‌, టీజర్‌కు అభిమానుల్లో మంచి స్పందన వచ్చింది.

Advertisement
 
Advertisement
 
Advertisement