నిజం కచ్చితంగా గెలుస్తుంది | NagaChaitanya Custody Trailer Launch Event | Sakshi
Sakshi News home page

నిజం కచ్చితంగా గెలుస్తుంది

May 6 2023 4:39 AM | Updated on May 6 2023 4:39 AM

NagaChaitanya Custody Trailer Launch Event - Sakshi

‘నిన్ను సీఎం సెక్యూరిటీకి అని పంపిస్తే.. నువ్వు ఆవిడ బండినే ఆపేస్తావా?’ అనే డైలాగ్‌తో ‘కస్టడీ’ సినిమా ట్రైలర్‌ విడుదలైంది. నాగచైతన్య, కృతీ శెట్టి జంటగా వెంకట్‌ ప్రభు దర్శకత్వం వహించిన చిత్రం ‘కస్టడీ’. శ్రీనివాసా సిల్వర్‌ స్క్రీన్‌పై శ్రీనివాసా చిట్టూరి తెలుగు, తమిళ భాషల్లో నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 12న రిలీజ్‌  కానుంది. ఈ సందర్భంగా ఈ చిత్రం ట్రైలర్‌ని శుక్రవారం విడుదల చేశారు.

‘నిన్ను కోర్టుకి తీసుకెళ్లి అప్పగిస్తాను.. లేకపోతే ట్రై చేస్తూ చస్తాను’, ‘ఒక్కసారి న్యాయం పక్క నిలబడి చూడు.. నీ లైఫే మారిపోతుంది’, ‘నిజం గెలవడానికి లేట్‌ అవుతుంది.. కానీ కచ్చితంగా గెలుస్తుంది’ (నాగచైతన్య), ‘నువ్వు ఏం చేస్తావో నాకు తెలీదు కానీ ఎలాగైనా నన్ను తీసుకెళ్లు.. లేకపోతే నా చావు నేను చస్తా’ (కృతీ శెట్టి) వంటి డైలాగులు ట్రైలర్‌లో ఉన్నాయి.

ఈ చిత్రంలో ప్రియమణి ముఖ్యమంత్రిగా, అరవింద్‌ స్వామి విలన్‌గా, శరత్‌ కుమార్‌ పోలీసాఫీసర్‌గా నటించారని ట్రైలర్‌ స్పష్టం చేస్తోంది. ఈ చిత్రానికి సంగీతం: ఇళయరాజా, యువన్‌ శంకర్‌ రాజా, కెమెరా: ఎస్‌ఆర్‌ కతీర్, సమర్పణ: పవన్‌ కుమార్‌.

Advertisement
 
Advertisement
Advertisement