మళ్లీ ట్విట్టర్‌లోకి నాగబాబు.. వివాదాస్పద ట్వీట్‌ తొలగింపు | Sakshi
Sakshi News home page

Nagababu: బన్నీ ఫ్యాన్స్ దెబ్బకు పరార్.. మళ్లీ ఇప్పుడు ఇలా

Published Sat, May 18 2024 12:12 PM

Nagababu Activates Twitter Account After Allu Arjun Issue

నాగబాబు మళ్లీ ఎక్స్ (ట్విట్టర్)లో ప్రత్యక్షమయ్యాడు. ఈ మధ్య ఈయన పెట్టిన ఓ ట్వీట్ పెద్ద దుమారమే రేపింది. అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఈయన ట్వీట్‌పై కస్సుమన్నారు. ట్రోల్స్, విమర్శలతో రెచ్చిపోయారు. దీంతో ఏం చేయాలో తెలీక తన ట్విట్టర్ ఖాతాని నాగబాబు డీ యాక్టివేట్ చేశాడు. ఇప్పుడు మళ్లీ యాక్టివేట్ చేయడంతో పాటు గతంలో పెట్టిన పోస్ట్‌ని డిలీట్ చేశాడు.

(ఇదీ చదవండి: నటుడు చందు ఆత్మహత్య.. షాకింగ్ నిజాలు బయటపెట్టిన భార్య)

రీసెంట్‌గా జరిగిన ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్‌లో నంద్యాల నుంచి శిల్పా రవిచంద్రారెడ్డి వైఎస్సార్‌సీపీ తరఫున ఎమ్మెల్యేగా పోటీ చేశారు. ఈయనకు అల్లు అర్జున్ స్నేహితుడు. ఈ క్రమంలోనే ప్రచారం కోసం బన్నీ.. నంద్యాల వెళ్లాడు. అయితే తనకు పార్టీతో సంబంధం లేదని అల్లు అర్జున్ క్లారిటీ ఇచ్చాడు. కానీ నాగబాబు మాత్రం.. 'మా పక్కనే ఉంటూ మమ్మల్ని బలహీనపరిచేవాడు మాకు శత్రువే. మమ్మల్ని బలపరిచేవాడు మా వ్యతిరేక వర్గంలో ఉన్నా వాడు మా వాడే' అని ట్వీట్ చేశాడు.

అయితే ఇది అల్లు అర్జున్‌ని ఉద్దేశించిందేనని బన్నీ ఫ్యాన్స్‌కి కోపమొచ్చింది. ముందు వెనకా ఆలోచించకుండా మాట్లాడిన నాగబాబుకి సోషల్ మీడియాలో ఇచ్చిపడేశారు. దీంతో ఏం చేయాలో తెలీక ట్విట్టర్ అకౌంట్ డీ యాక్టివేట్ చేసుకున్నాడు. మరి ఏమైందో ఏమో గానీ ఇప్పుడు యాక్టివ్ చేసుకున్నాడు. కాకపోతే పాత ట్వీట్ డిలీట్ చేశానని చెప్పి, మరో ట్వీట్ పెట్టాడు.

(ఇదీ చదవండి: ట్విటర్‌ నుంచి నాగబాబు ఔట్‌.. వారిద్దరూ వార్నింగ్‌ ఇచ్చారా..?)

Advertisement
 
Advertisement
 
Advertisement