‘మనం’ దర్శకుడితో చైతూ కొత్త సినిమా | Naga Chaitanya will Act In Directer Vikaram Kumar New Movie | Sakshi
Sakshi News home page

‘మనం’ దర్శకుడితో చైతూ కొత్త సినిమా

Aug 29 2020 12:06 PM | Updated on Oct 5 2020 6:24 PM

Naga Chaitanya will Act In Directer Vikaram Kumar New Movie - Sakshi

టాలీవుడ్‌ కింగ్‌ అక్కినేని నాగార్జున పుట్టిన రోజు సందర్భంగా ఆయన తనయుడు హీరో నాగ చైతన్య తన కొత్త సినిమాను ప్రకటించారు. మనం సినిమా డైరెక్టర్‌ విక్రమ్‌ కుమార్‌ దర్శకత్వంలో చైతన్య హీరోగా ఓ సినిమా చేయనున్నారు. ఈ సినిమాకు ‘థాంక్యూ’ అనే టైటిల్‌ను కూడా ఖరారు చేశారు. దర్శకుడు విక్రమ్‌ విభిన్న కథను సిద్ధం చేసుకొని దానిని నాగ చైతన్యకు వినిపించగా..కథ ఎంతో నచ్చడంతో ఈ సినిమాకు చైతూ ఓకే చెప్పాడు. దిల్‌ రాజ్‌ నిర్మిస్తున్న ఈ మూవీలో హీరోయిన్‌ను ఇంకా ప్రకటించలేదు. 

ఇప్పటికే అక్కినేని కుటుంబం మొత్తంతో విక్రమ్‌ మనం సినిమాను తెరకెక్కించిన విషయం తెలిసిందే. అలాగే అఖిల్‌తోనూ ‘హలో’ సినిమాను తీశాడు. ఇప్పుడు ముచ్చటగా మూడోసారి అక్కినేని వారితో సినిమాను పట్టాలెక్కించనున్నాడు. ప్రస్తుతం చైతూ డైరెక్టర్‌ శేఖర్‌ కమ్ముల దర్శకత్వంలో ‘లవ్‌స్టోరి అనే సినిమా చేస్తున్నాడు. ఇందులో సాయి పల్లవి హీరోయిన్‌గా చేస్తున్నారు. కరోనావైరస్ లేకపోయుంటే ఈ చిత్రం ఇప్పటికే విడుదలై ఉండేది. అంతేగాక  ‘గీతగోవిందం’ ఫేమ్ పరశురామ్  దర్శకత్వంలో కూడా నాగ చైతన్య సినిమా చేస్తున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement