సమంత ట్వీట్‌కి రిప్లై ఇచ్చిన నాగ చైతన్య | Naga Chaitanya Thanks Wife Samantha For Calling Love Story Trailer A Winner | Sakshi
Sakshi News home page

Naga Chaitanya: సమంతకు థ్యాంక్స్‌ చెప్పిన చైతూ..

Sep 14 2021 5:29 PM | Updated on Sep 15 2021 8:26 AM

Naga Chaitanya Thanks Wife Samantha For Calling Love Story Trailer A Winner - Sakshi

Naga Chaitanya Thanks Wife Samantha: నాగ చైతన్య హీరోగా శేఖర్‌ కమ్ముల దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా లవ్‌స్టోరీ. సెప్టెంబర్‌ 24న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా విడుదలైన ట్రైలర్‌ ఎంతగానో ఆకట్టుకుంటుంది. ఇప్పటికే 5మిలియన్లకు పైగా వ్యూస్‌తో యూట్యూబ్‌లో ట్రెండింగ్‌లో నిలిచింది. ఇక నాగచైతన్య భార్య సమంత సైతం ట్రైలర్‌పై స్పందించిన సంగతి తెలిసిందే. 'విన్నర్.. లవ్‌స్టోరీ టీం అందరికీ ఆల్‌ ది బెస్ట్‌' అంటూ సమంత ట్వీట్‌ చేసింది.

దీనిపై నాగ చైతన్య  స్పందిస్తూ..'థ్యాంక్యూ సామ్‌' అంటూ తన తనదైన శైలిలో రిప్లై ఇచ్చారు. ప్రస్తుతం ఈ ట్వీట్‌ సోషల్‌ మీడియాలో తెగ వైరల్‌ అవుతుంది. ఇక లవ్‌స్టోరీలో నాగ చైతన్యకు జోడీగా సాయి పల్లవి నటించిన సంగతి తెలిసిందే. 

Advertisement
 
Advertisement
Advertisement