ముగ్గురు భామలతో థాంక్యూ..! | Naga Chaitanya To Romance Three Heroins | Sakshi
Sakshi News home page

నాగచైతన్యకు ముగ్గురు హీరోయిన్లు

Nov 4 2020 9:15 PM | Updated on Nov 4 2020 9:15 PM

Naga Chaitanya To Romance Three Heroins - Sakshi

అక్కినేని కుటుంబానికి ఫ్యామిలీ డైరెక్టర్‌ అయిపోయాడు విక్రమ్‌ కె కుమార్‌. లెజండరీ నటుడు అక్కినేని నాగేశ్వర్‌ రావు చివరి చిత్రం మనంతో మొదలైంది అక్కినేని కుటుంబానికి, విక్రమ్‌ కుమార్‌కు మధ్య అనుబంధం. ఆ తర్వాత అఖిల్‌తో ఆయన హలో మూవీ తెరకెక్కించారు. ఇప్పుడు నాగచైతన్యతో థాంక్యూ అంటూ ప్రేక్షకులను పలకరించేందుకు సిద్ధమవుతున్నారు. ఈ సినిమాకు సంబంధించిన తాజా అప్‌డేట్‌ ప్రస్తుతం మూవీ దునియాలో చక్కర్లు కొడుతోంది. 

థాంక్యూ సినిమాలో నాగచైతన్యతో ముగ్గురు హీరోయిన్లు నటించబోతున్నారని జోరుగా ప్రచారం సాగుతోంది. డిసెంబర్‌ నుంచి మొదలుకానున్న ఈ చిత్రంలో రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ మెయిన్‌ హీరోయిన్‌గా ఛాన్స్‌ కొట్టేసినట్లు సమాచారం. మరో హీరోయిన్‌గా గ్యాంగ్‌లీడర్‌ ఫేమ్‌ ప్రియాంక అరుల్‌ మోహన్‌ నటిస్తుందన్న ఊహాగానాలూ కూడా వినిపిస్తున్నాయి. అయితే, మూవీ టీమ్‌ నుంచి ఇందుకు సంబంధించి ఎటువంటి ప్రకటన వెలువరించలేదు. ఈ పుకార్లన్నీ నిజమా కాదా అని తెలియాలంటే ఇంకొన్ని రోజులు వేచి చూడాల్సిందే.

విక్రమ్‌ కుమార్‌ దర్శకత్వంలో వస్తున్న థాంక్యూ ఒక కమర్శియల్‌ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతోంది. దీన్ని దిల్‌ రాజు తన బ్యానర్‌ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌ ఆధ్వర్యంలో నిర్మిస్తున్నారు. ఇది 2021 చివర్లో విడుదల చేయాలని సన్నాహాలు చేస్తున్నారు మేకర్స్‌. ప్రస్తుతం నాగచైతన్య సాయి పల్లవితో కలిసి లవ్‌స్టోరీ సినిమాలో నటిస్తున్నారు.

2014లో విడుదల అయిన మనం సినిమా అక్కినేని కుటుంబానికి ఎంతో ప్రత్యేకమైనది. కానీ దాని తర్వాత ఆయన తీసిన హలో అక్కినేని వారికి హిట్‌ ఇవ్వలేకపోయింది. థాంక్యూతో అయినా విక్రమ్‌ మళ్లీ మనం లాంటి హిట్‌ ఇస్తాడేమో చూడాలి.

Advertisement
 
Advertisement
Advertisement