Naga Chaitanya First Love: అదే నా ఫస్ట్‌లవ్‌, ముక్కలయ్యింది.. చై కామెంట్స్‌ వైరల్‌

Naga Chaitanya Intresting Comments About His First Love - Sakshi

నాగచైతన్య, రాశీఖన్నా జంటగా నటించిన సినిమా 'థ్యాంక్యూ'. విక్రమ్‌ కె. కుమార్‌ దర్శకత్వం వహించిన ఈ సినిమాను దిల్‌రాజు నిర్మిస్తున్నారు. ఈనెల 22న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే విడుదలైన సాంగ్స్‌, ట్రైలర్‌కు మంచి రెస్పాన్స్‌ వస్తుండటంతో సినిమాపై మరింత హైప్‌ నెలకొంది. ఇక రిలీజ్‌ డేట్‌ దగ్గర పడుతుండటంతో మూవీ టీం ప్రమోషన్స్‌లో బిజీబిజీగా గడుపుతుంది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో రాశీఖన్నా, నాగచైతన్య సందడి చేశారు.

ఈ సందర్భంగా తన ఫస్ట్‌ లవ్‌ గురించి నాగ చైతన్య చేసిన కామెంట్స్‌ ఇప్పుడు నెట్టింట వైరల్‌గా మారాయి. 'నా ఫస్ట్‌లవ్‌ తొమ్మిదో తరగతిలో జరిగింది. ముగ్గురం కలిసి ఒకే అమ్మాయిని లవ్‌ చేసేవాళ్లం. అయితే ఆ అమ్మాయి తమ హృదయాలను ముక్కలు చేసింది' అంటూ గుర్తు చేసుకున్నాడు. ఆ తర్వాత ముగ్గురం మంచి స్నేహితులుగా మారిపోయామంటూ తెలిపాడు. ప్రస్తుతం చై చేసిన ఈ వ్యాఖ్యలు నెట్టింట హల్‌చల్‌ చేస్తున్నాయి. 

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top