హారర్‌ ఆట | Naatho Aata Movie releasing shortly | Sakshi
Sakshi News home page

హారర్‌ ఆట

Oct 24 2020 5:12 AM | Updated on Oct 24 2020 5:12 AM

Naatho Aata Movie releasing shortly - Sakshi

నూతన నటీనటులతో పీబీ లింగరాజ్‌ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘నాతో ఆట’. విఘ్నేష్‌ ధనుష్‌ సమర్పణలో శుక్లాంబరధరం సినీ క్రియేషన్స్‌పై బి.ఎల్‌. బాబు నిర్మించిన ఈ సినిమా సెన్సార్‌ కార్యక్రమాలు పూర్తి చేసుకుని, విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ సందర్భంగా బి.ఎల్‌. బాబు మాట్లాడుతూ– ‘‘నాతో ఆట’ ఒక హారర్‌ చిత్రం. మంచి కథతో యూత్‌కి కావాల్సిన అన్ని అంశాలతో నిర్మించాం. మా చిత్రాన్ని మోహిత్‌ ఫిలిమ్స్‌ వారు ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నారు. త్వరలోనే సినిమా విడుదల చేస్తాం’’ అన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement