‘నా వెంట‌ప‌డుతున్న చిన్నాడెవ‌డ‌మ్మా’ బిగ్‌ హిట్‌ కావాలి’ | Sakshi
Sakshi News home page

‘నా వెంట‌ప‌డుతున్న చిన్నాడెవ‌డ‌మ్మా’ బిగ్‌ హిట్‌ కావాలి’

Published Tue, Aug 30 2022 4:58 PM

Naa Venta Paduthunna Chinnadevadamma Movie Pre Release Event Highlights - Sakshi

తేజ్‌ కూరపాటి, అఖిల ఆకర్షణ జంటగా నటించిన చిత్రం ‘నా వెంటపడుతున్న చిన్నాడెవడమ్మా’. వెంకట్‌వందెల దర్శకుడు. ముల్లేటి నాగేశ్వరావు నిర్మాణ సారథ్యంలో ముల్లేటి కమలాక్షి, గుబ్బల వెంకటేశ్వరావు  నిర్మించిన ఈ చిత్రం సెప్టెంబరు 2న విడుదల కానుంది. ఈ నేపథ్యంలో తాజాగా హైదరాబాద్‌లో ఈ మూవీ ప్రీరిలీజ్‌ ఈవెంట్‌ని నిర్వహించారు.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చిన ప్రముఖ దర్శకుడు కోదండ రామిరెడ్డి మాట్లాడుతూ..‘అందరూ కొత్త వారితో తీసిన ఈ సినిమా సాంగ్స్, ట్రైలర్ చాలా బాగున్నాయి .ఈ సినిమాకు నటీ నటులు, టెక్నిసియన్స్ అందరూ చాలా హార్డ్ వర్క్ చేసినట్లనిపిస్తుంది సినిమా కూడా బాగుంటుందనుకుంటున్నాను. మంచి కథతో వస్తున్న ఈ సినిమా నిర్మాతలకు బిగ్ హిట్ అవ్వాలి’ అన్నారు.

ప్రొడ్యూసర్ కౌన్సిల్ సెక్రటరీ ప్రసన్న కుమార్ మాట్లాడుతూ.. ‘వరుస అపజయాలతో  నిర్మాతలు ఎంతో ఇబ్బంది పడుతున్న సమయంలో వచ్చిన బింబిసార, సీతారామం, కార్తికేయ సినిమాలు ఇండస్ట్రీ కి ఊపిరి నింపాయి.మళ్ళీ అలాంటి మంచి కంటెంట్ తో చిన్న సినిమా గా మొదలైన ఈ సినిమా పెద్ద సినిమాగా మారేలా ప్రేక్షకులు ఆదరించాలని కోరుకుంటున్నాను. ఈ సినిమాలోని సాంగ్స్ చాలా బాగున్నాయి. మంచి ప్రేమకథను దర్శకుడు వెంకట్ సెలెక్ట్ చేసుకొన్నాడు .ఈ చిత్రానికి నిర్మాతలు కూడా చాలా కష్టపడ్డారు. సెప్టెంబర్ 2 న విడుదల చేస్తున్న ఈ సినిమా గొప్ప విజయం సాదించాలి ’అన్నారు.

చిత్ర నిర్మాత ముల్లేటి క‌మ‌లాక్షి మాట్లాడుతూ.. ఒక్క సినిమా చేయడం ఎంత కష్టమో ఈ చిత్రం ద్వారా తెలిసింది.  ఒక్క మూవీ కోసం  ఒక లైట్ బాయ్ దగ్గరనుండి నటీ నటులు, టెక్నిషియన్స్ వరకు ఎంతో మంది కష్టపడతారు. ఇలా వీరందరూ కలిస్తేనే ఒక సినిమాగా బయటకు వస్తుంది. అలాంటి సినిమాను అవమానంగా చూడద్దు అని ప్రతి ఒక్కరికీ తెలియజేస్తున్నాను. ఈ సినిమాకు కష్టపడిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదములు. మా సినిమాను మనస్ఫూర్తిగా ఆశీర్వాదించాలని ప్రేక్షకులను కోరకుంటున్నాను’అని అన్నారు.

‘పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ బర్త్ డే రోజున విడుదల చేస్తున్న  ఈ సినిమాను పవన్‌ ఫ్యాన్స్‌ ఆదరించాలని కోరుకుంటున్నాను’అని దర్శకుడు వెంకట్ వందెల అన్నారు. మొదటి సారి సోలో హీరో గా వస్తున్నందుకు తనను ఆశ్వీర్వదించి, సినిమాను ఆదరించాలని హీరోల తేజ్‌ కురపాటి అన్నారు.

ప్రముఖ దర్శకుడు సాగర్ మాట్లాడుతూ..సినిమా ట్రైలర్, టీజర్, పాటలు చూస్తుంటే సినిమా బాగుంటుంది అనే నమ్మకం ఉంది. ప్రేక్షకులందరూ సెప్టెంబర్ 2 న థియేటర్ కు వచ్చి సినిమా చూసి అశీర్వదించాలని కోరుకుంటున్నాను అన్నారు .

Advertisement
 
Advertisement
 
Advertisement