బాలకృష్ణ 107 టైటిల్‌ గురించి మేకర్స్‌ ఏమన్నారంటే?

Mythri Movie Makers on NBK Film with Gopichand Malineni - Sakshi

టాలీవుడ్‌లో ఎంతో పాపులారిటీ ఉన్న హీరోల్లో నందమూరి బాలకృష్ణ ఒకరు. ప్రస్తుతం ఆయన బోయపాటి శ్రీను డెరెక్షన్‌లో ‘అఖండ’ చేస్తున్నాడు. ఆయన హీరోగా 107వ సినిమాని గోపిచంద్ మలినేని దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్ అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఈ మూవీకి ‘రౌడీయిజం’ అనే టైటిల్‌ పెట్టారంటూ టీటౌన్‌లో చక్కర్లు కొడుతున్నాయి. ఈ విషయంపై క్లారిటీ ఇస్తూ ఎన్‌బీకే 107 మేకర్స్‌ ఓ ప్రకటన విడుదల చేశారు.

అందులో.. ‘ఎన్‌బీకే 107 మూవీ టైటిల్‌ ఇదేనంటూ మీడియాలో ప్రచారంలో ఉన్న కథనాలు నిజం కాదు. ఆ సినిమాకి టైటిల్‌ ఫిక్స్‌ చేయలేదు. అయితే ఇలాంటివి చూస్తే ఈ సినిమా గురించి ప్రేక్షకులు ఎంత ఉత్సాహంగా ఉన్నారో తెలుస్తోంది. ఆ మూవీకి సరిపోయే టైటిల్‌ని, ఇతర విషయాలను త్వరలోనే ప్రకటిస్తాం’ అని టీం తెలిపింది. కాగా బాలనటుడిగా 1974లో తెరంగేట్రం చేసిన ఆయన ఇప్పటి వరకూ అవిశ్రాంతంగా నటిస్తూనే ఉన్నాడు. హీరోగా 105  సినిమాలు పూర్తి చేసి త్వరలో 106 సినిమాగా ‘అఖండ’తో పలకరించనున్నాడు. ఇక జానపద, పౌరాణిక, సాంఘిక, చారిత్రాత్మక  వంటి అన్ని జాన​ర్లలో బాలయ్య చిత్రాలు చేశాడు.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top