Child Artist Ahsaas Channa Now: ఎక్కువగా అబ్బాయి పాత్రలనే పోషించిన ఈ నటి గురించి తెలుసా?

My Friend Ganesha Child Artist Ahsaas Channa Then And Now - Sakshi

ఎహ్‌సాస్‌ చన్నా.. ఊహ తెలిసినప్పటి నుంచి ఆమెకెరుకైన.. ఆమెను ఎరిగిన ప్రపంచం ఒక్కటే సినిమా ప్రపంచం! చైల్డ్‌ ఆర్టిస్ట్‌గా మొదలుపెట్టి.. నటిగా ఆమె పెరిగింది.. ఎదిగింది అక్కడే! ఓటీటీ వచ్చాక ఆ ప్లాట్‌ఫామ్‌కూ తన పరిచయాన్నిచ్చి వెబ్‌ వీక్షకుల అభిమానాన్నీ సంపాదించుకుంటోంది.

పుట్టింది పంజాబ్‌లోని జలంధర్‌లో. పెగింది ముంబైలో.  తండ్రి.. ఇక్బాల్‌ బహదూర్‌ సింగ్‌ చన్నా, ప్రొడ్యూసర్‌. తల్లి.. కుల్‌బిర్‌ బహదూర్‌ సింగ్‌ చన్నా.. నటి.  
నటనా వాతావరణంలోనే పుట్టి.. పెరగిన ఎహ్‌సాస్‌.. తన నాలుగో ఏటనే సినీరంగ ప్రవేశం చేసింది.  ‘వాస్తు శాస్త్ర’, ‘కభీ అల్విద నా కెహనా’, ‘మై ఫ్రెండ్‌ గణేశా’ మొదలు చైల్డ్‌ ఆర్టిస్ట్‌గా ఆమె నటించిన ఎన్నో  సినిమాల్లో అబ్బాయి పాత్రలనే ఎక్కువగా పోషించింది. టీవీ సీరియళ్లలోనూ బాలవేషాలు వేసింది. 


డబ్‌స్మాష్‌ చేయడంలో దిట్ట. ఆమె ‘మ్యూజికల్లీ (టిక్‌టాక్‌ లాంటిది)’ వీడియోస్‌కు లక్షల్లో ఫాలోవర్స్‌ ఉన్నారు. 
ఐఐటీ అభ్యర్థుల ఇతివృత్తంతో వచ్చిన ‘కోటా ఫ్యాక్టరీ’తో వెబ్‌ సిరీస్‌లో నటించడం మొదలుపెట్టింది ఎహ్‌సాస్‌. అందులోని ఆమె నటన ఇంకొన్ని ఓటీటీ అవకాశాలను తెచ్చిపెట్టింది. వాటిల్లో ఒకటి ‘గర్ల్స్‌ప్లెయినింగ్‌’ సిరీస్‌. 

ఎహ్‌సాస్‌ .. మోడలింగ్‌లో కూడా కాలుమోపింది. ‘గీతాంజలి ఫ్యాషన్‌ వీక్‌’లో వాళ్లమ్మతో కలసి ర్యాంప్‌వాక్‌ చేసింది. 
టీనేజ్‌ పిల్లలు ఎదుర్కొనే సమస్యల మీద ‘డియర్‌ టీనేజ్‌ మి’ అనే పాడ్‌కాస్ట్‌ చానెల్‌ను నిర్వహిస్తోంది.
వైవిధ్యమైన షూలు, మేకప్‌ వస్తువులు కలెక్ట్‌ చేయడం ఆమెకు సరదా.

టీనేజ్‌లో ఉన్నప్పుడు కాస్త అటెన్షన్‌ సీకింగ్‌ అమ్మాయిగా ఉండేదాన్ని. నా స్వభావం కాకపోయినా పదిమంది దృష్టి నా మీద పడడానికి డిఫరెంట్‌గా ఉండడానికి ప్రయత్నించేదాన్ని. ఇప్పుడు ఆలోచించుకుంటే నవ్వొస్తుంది. అయితే ఆ తప్పులన్నీ నన్ను నేను సరిదిద్దుకోవడానికి.. నేనీరోజు ఇలా  నిలబడ్డానికి దోహదపడ్డవే. అందుకే నాలోని ఏ చిన్న గుణాన్నీ మార్చుకోవడానికి ఇష్టపడను.
– ఎహ్‌సాస్‌ చన్నా

చదవండి: పెళ్లి పీటలు ఎక్కబోతున్న కీర్తి సురేశ్‌, వరుడు ఎవరంటే..
ఆ వ్యక్తి ఆరేళ్లు వేధించాడు.. క్షమించి వదిలేశా

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top