Actress Keerthy Suresh Wedding Rumours Goes Viral - Sakshi
Sakshi News home page

Keerthy Suresh Wedding Rumours: పెళ్లి పీటలు ఎక్కబోతున్న కీర్తి సురేశ్‌, వరుడు ఎవరంటే..

Aug 7 2022 9:19 AM | Updated on Aug 7 2022 10:12 AM

Actress Keerthy Suresh Wedding Rumours Goes Viral - Sakshi

హీరోయిన్ల పెళ్లిపై సోషల్‌ మీడియాలో ఎప్పటికప్పుడు సరికొత్త గాసిప్‌లు వస్తూనే ఉంటాయి. మొన్న ఆపిల్‌ బ్యూటీ హన్సిక పెళ్లికి కుదిరిందంటూ వార్తలు హల్‌చల్‌ చేశాయి. తాజాగా కీర్తీ సురేష్‌ సైతం త్వరలో పెళ్లి పీటలు ఎక్కనుందనే చర్చ కోలీవుడ్‌లో హాట్‌ హాట్‌గా జరుగుతుంది. తల్లిదండ్రులు నిశ్చయించిన వరుడితో ఏడు అడుగులు వేయటానికి సిద్ధమవుతున్నట్లు టాక్‌. పెళ్లికొడుకు వ్యాపారవేత్త అని, రాజకీయాల్లోనూ చురుగ్గా పాల్గొంటున్నారని ప్రచారం జరుగుతుంది.

ఇదే కనుక నిజమైతే కీర్తీ సురేష్‌ ఇంట మంగళ వాయిద్యాలు మోగుతాయన్నమాట. అయితే ఈ గాసిప్‌లపై కీర్తి సురేష్‌ ఇప్పటి వరకూ స్పందించలేదు. సినీ కుటుంబ నేపథ్యం నుంచి వచ్చిన నటి కీర్తీ సురేష్‌ మలయాళంలో ఎంట్రీ ఇచ్చినా ఆ తరువాత తమిళం, తెలుగు చిత్ర పరిశ్రమలో టాప్‌ హీరోయిన్‌గా రాణిస్తోంది.

మహానటి చిత్రంలో  సావిత్రి పాత్రలో అద్భుతంగా అభినయించి జాతీయ ఉత్తమ నటి అవార్డు అందుకుంది. ప్రస్తుతం  తమిళంలో ఉదయనిధి స్టాలిన్‌ జంటగా మామన్నన్‌ చిత్రంలో నటిస్తోంది. కేరీర్‌ మంచి స్వింగ్‌లో ఉండగా ఈ అమ్మడు పెళ్లికి అంగీకరించిందంటే నమ్మశక్యంగా లేదు కదా! 

Advertisement
 
Advertisement
Advertisement