స్టార్ క్రికెటర్ బయోపిక్.. ఐదేళ్ల క్రితమే మొదలైంది కానీ | Sakshi
Sakshi News home page

800 Movie: బయోపిక్‌కి ఫస్ట్ ఒప్పుకోలేదు.. కానీ అలా జరగడంతో

Published Sun, Sep 10 2023 4:32 PM

Muttiah Muralitharan Comments His Biopic 800 Movie - Sakshi

శ్రీలంక దిగ్గజ బౌలర్ ముత్తయ్య మురళీధరన్‌ జీవితం ఆధారంగా తీస్తున్న సినిమా '800'. ఇందులో మురళీధరన్‌ పాత్రలో ఆస్కార్‌ గెలుచుకున్న 'స్లమ్‌ డాగ్‌ మిలియనీర్‌' ఫేమ్‌ మాదూర్‌ మిట్టల్‌ నటించాడు. మహిమా నంబియార్‌ హీరోయిన్. నాజర్‌, వేల రామమూర్తి, నరేన్‌, రమ్యకృష్ణ తదితరులు కీలకపాత్రలు పోషించారు. ఎం.ఎస్‌ శ్రీపతి కథ రాసి, దర్శకత్వం వహించారు.

(ఇదీ చదవండి: భోళా శంకర్‌ ఓటీటీ డేట్‌ ఫిక్స్.. స్ట్రీమింగ్ అప్పటి నుంచే)

ఇకపోతే తెలుగు, తమిళ, హిందీ భాషల్లో '800' మూవీని ట్రైన్‌ మోషన్‌ పిక్చర్స్‌ నిర్మించింది. జిబ్రాన్‌ సంగీతమందించారు. శ్రీదేవి మూవీస్‌ సంస్థ అధినేత శివలెంక కృష్ణప్రసాద్‌ సమర్పకులుగా వ్యవహరిస్తున్నారు. తాజాగా చెన్నైలో ప్రెస్ మీట్ పెట్టగా, ముత్తయ్య మురళీధరన్‌ ముఖ్య అతిథిగా వచ్చారు. ఆయన మాట్లాడుతూ తన బయోపిక్ పై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. 

'2018లో దర్శకుడు వెంకట్‌ ప్రభు, శ్రీపతి శ్రీలంకకు వచ్చి నన్ను కలిశారు. నా బయోపిక్‌ తీయాలనే ఆలోచన ఉందని అప్పుడే చెప్పారు. కానీ నాకు ఇష్టం లేదు. అయితే వారు ఇచ్చే డబ్బు నా స్వచ్ఛంద సంస్థకు ఉపయోగపడుతాయని నా మేనేజరు చెప్పాడు. దీంతో అంగీకరించాను. ఈ చిత్రం నా క్రికెట్‌ కెరీర్ గురించే కాదు. దాని వెనుక నా లైఫ్‌లో.. అట్టడుగు స్థాయి నుంచి ఎన్నో కష్టాలను, ఆటంకాలను ఎదుర్కొని ఈ స్థాయికి రావడం చూపించారు' అని మురళీధరన్ చెప్పారు. ఈ సినిమా అక్టోబర్‌ 6న థియేటర్లలోకి రానుంది. 

(ఇదీ చదవండి: మంచు విష్ణు కొత్త సినిమాలో ప్రభాస్‌.. ఆ పాత్రలో)

Advertisement
 
Advertisement