భక్త కన్నప్పలో ప్రభాస్‌.. అదిరిపోయే అప్‌డేట్‌ | Prabhas In Manchu Vishnu Bhakta Kannappa Movie | Sakshi
Sakshi News home page

Bhakta Kannappa Movie: మంచు విష్ణు డ్రీమ్‌ ప్రాజెక్ట్‌లో ప్రభాస్‌.. శివుడిగా..

Sep 10 2023 11:04 AM | Updated on Sep 10 2023 11:33 AM

Prabhas In Manchu Vishnu Bhakta Kannappa Movie - Sakshi

హర హర మహాదేవ్‌ అంటూ అంటూ అది నిజమేనని చెప్పకనే చెప్పాడు. దీంతో ఫ్యాన్స్‌ ఫుల్‌ ఖుషీ అవుతున్నారు. బాహుబలిలో శివలింగాన్ని మోసే ప్రభాస్‌ ఈసారి నిజంగానే

టాలీవుడ్‌ హీరో మంచు విష్ణు డ్రీమ్‌ ప్రాజెక్ట్‌ భక్త కన్నప్ప ఇటీవలే పూజా కార్యక్రమాలతో మొదలైన సంగతి తెలిసిందే! ఆగస్టు 18న శ్రీకాళహస్తిలో మోహన్‌బాబు చేతుల మీదుగా సినిమా లాంచ్‌ అయింది. భారీ బడ్జెట్‌తో పాన్‌ ఇండియా స్థాయిలో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నట్లు చెప్పాడు మంచు విష్ణు. అవా ఎంటర్‌టైన్‌మెంట్‌, 24 ఫ్రేమ్స్‌ ఫ్యాక్టరీ పతాకంపై మోహన్‌బాబు నిర్మిస్తున్నారు. మహాభారతం సీరియల్‌కు దర్శకత్వం వహించిన ముఖేశ్‌ కుమార్‌ సింగ్‌ ఈ చిత్రాన్ని డైరెక్ట్‌ చేయనున్నారు.

ఆదిపురుష్‌ హీరోయిన్‌ కృతిసనన్‌ సోదరి నుపుర్‌ సనన్‌ హీరోయిన్‌గా నటించనుంది. తాజాగా ఈ సినిమాకు సంబంధించి ఓ ఆసక్తికర వార్త సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. భక్త కన్నప్ప చిత్రంలో ప్రభాస్‌ నటించనున్నారట. ట్విటర్‌లో ఈ విషయం మార్మోగిపోతుండగా తాజాగా దీనిపై విష్ణు మంచు స్పందించాడు.

'హర హర మహాదేవ్‌' అని రిప్లై ఇస్తూ అది నిజమేనని చెప్పకనే చెప్పాడు. దీంతో ఫ్యాన్స్‌ ఫుల్‌ ఖుషీ అవుతున్నారు. బాహుబలిలో శివలింగాన్ని మోసే ప్రభాస్‌ ఈసారి నిజంగానే శివుడి అవతారం ఎత్తబోతున్నాడంటూ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. భక్త కన్నప్పలో ప్రభాస్‌ ఎంట్రీ ఇస్తే ఈ మూవీ బాక్సాఫీస్‌ను షేక్‌ చేయడం ఖాయమని చెప్తున్నారు.

చదవండి: బిగ్‌బాస్‌: ఆ ఇద్దరిలో ఒకరు అవుట్‌.. ఎలిమినేట్‌ అయింది ఎవరంటే?

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement